Telugu Murli 04/07/20

04-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – ఉన్నతంగా అవ్వాలనుకుంటే ఏ కర్మేంద్రియమూ మోసం చేయడం లేదు కదా అని ప్రతి రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, కళ్ళు ఎంతగానో మోసం చేస్తూ ఉంటాయి, వాటి నుండి సంభాళించుకోండి”

ప్రశ్న:- అన్నింటికంటే చెడ్డ అలవాటు ఏది, దాని నుండి రక్షించుకునేందుకు ఉపాయమేమిటి?

జవాబు:- అన్నింటికంటే చెడ్డ అలవాటు – జీహ్వ చాపల్యము (నాలుక రుచి). ఏదైనా మంచి రుచికరమైన వస్తువును చూస్తే దాచుకుని తినేస్తారు. దాచుకుని తినడమంటే దొంగతనము. దొంగతనము రూపంలో ఉండే మాయ కూడా అనేక మందిని ముక్కు చెవులతో పట్టుకుంటుంది. దీని నుండి రక్షించుకునేందుకు సాధనం – ఎప్పుడైనా బుద్ధి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే స్వయానికి స్వయమే శిక్షించుకోండి. చెడు అలవాట్లను తొలగించుకునేందుకు మీకు మీరు బాగా చీవాట్లు పెట్టుకోండి.

ఓంశాంతి. ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? ప్రతి ఒక్క విషయం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసి ఉంటుంది. మేము ఆత్మాభిమానులుగా అయి కూర్చుని తండ్రిని స్మృతి చేస్తున్నామా? శివశక్తి పాండవ సైన్యం అన్న గాయనం కూడా ఉంది. ఇక్కడ శివబాబా సైన్యం కూర్చొని ఉంది కదా. ఆ దైహిక సైన్యంలో యువకులు మాత్రమే ఉంటారు, వృద్ధులు లేక పిల్లలు మొదలైనవారు ఉండరు. ఈ సైన్యంలో అయితే వృద్ధులు, పిల్లలు, యువకులు మొదలైనవారందరూ కూర్చొని ఉన్నారు. ఇది మాయపై విజయం పొందే సైన్యం. ప్రతి ఒక్కరూ మాయపై విజయాన్ని పొంది తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు. కర్మేంద్రియాలే అన్నిటికంటే ఎక్కువగా మోసం చేస్తాయి. ఈ రోజు ఏ కర్మేంద్రియం మోసం చేసింది అని కూడా చార్టులో వ్రాయండి. ఈ రోజు ఫలానా వారిని చూడగానే ముట్టుకోవాలి, ఇది చేయాలి అని అనిపించింది. కళ్ళు చాలా నష్టపరుస్తాయి. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని చూడండి, ఏ కర్మేంద్రియం ఎక్కువగా మోసం చేస్తుంది? ఈ విషయంలో సూరదాసు ఉదాహరణను కూడా ఇస్తారు. స్వయాన్ని పరిశీలించుకోవాలి. కళ్ళు ఎంతగానో మోసం చేస్తాయి. మంచి-మంచి పిల్లలను కూడా మాయ మోసం చేసేస్తుంది. సేవ కూడా బాగా చేస్తారు కాని కళ్ళు మోసం చేస్తాయి. వీటిపై ఎంతో అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే శత్రువు కదా. మన పదవిని భ్రష్టం చేస్తుంది. తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు దీనిని బాగా నోట్ చేసుకోవాలి. వారి పాకెట్ లో డైరీ ఉండాలి. ఎలాగైతే భక్తి మార్గంలో బుద్ధి ఇతరవైపులకు వెళ్తున్నప్పుడు స్వయాన్ని గిచ్చుకుంటారో, అలాగే మీరు కూడా శిక్షలు విధించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మేంద్రియాలు మోసం చేయడం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మోసం చేస్తున్నట్లయితే, పక్కకు తప్పుకోవాలి. అలాగే నిలబడి చూడకూడదు కూడా. స్త్రీ-పురుషుల హంగామానే ఎంతో ఉంటుంది. చూడడంతోనే కామ వికారపు దృష్టి వెళ్తుంది, కావున సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరు సన్యాసులైతే స్త్రీలకు వెనుదిరిగి కూర్చుంటారు. ఆ సన్యాసులు మొదలైనవారికి ఏం లభిస్తుంది? 10-20 లక్షలు లేక కోట్లు జమ చేసుకుంటారేమో. మరణించినట్లయితే అంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ మరుసటి జన్మలో జమ చేసుకోవలసి ఉంటుంది. పిల్లలైన మీకు ఏదైతే లభిస్తుందో అది అవినాశీ వారసత్వంగా అయిపోతుంది. అక్కడ ధనం యొక్క కోరికే ఉండదు. కష్టపడేందుకు ఎటువంటి అప్రాప్తి ఉండదు. కలియుగ అంతిమానికి మరియు సత్యయుగ ఆదికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖముంటుంది. ఇక్కడ కొంచెం కూడా లేదు. సంగమం అన్న పదంతో పాటు పురుషోత్తమ అన్న పదాన్ని కూడా తప్పకుండా వ్రాయండి అని బాబా సదా చెప్తూ ఉంటారు. పదాలను స్పష్టంగా పలకాలి. అర్థం చేయించడం సహజంగా ఉంటుంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారు….. అంటే దేవతలుగా తయారుచేసేందుకు, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసేందుకు తప్పకుండా సంగమయుగములోనే వస్తారు కదా. మనుష్యులైతే ఘోరమైన అంధకారంలో ఉన్నారు. స్వర్గమంటే ఏమిటో తెలియనే తెలియదు. ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని చూడను కూడా చూడలేరు, అందుకే మీ ధర్మము చాలా సుఖమునిచ్చేది అని బాబా చెప్తారు. దానిని హెవెన్ అని అంటారు. అయితే మేము కూడా స్వర్గానికి వెళ్ళగలము అని భావించరు. ఇది ఎవ్వరికీ తెలియదు. భారతవాసులు ఇది మర్చిపోయారు. స్వర్గాన్ని లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. 3 వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేదని స్వయంగా క్రైస్తవులు కూడా అంటారు. లక్ష్మీనారాయణులను గాడ్-గాడెస్ (భగవాన్-భగవతి) అని అంటారు. తప్పకుండా భగవంతుడే భగవాన్-భగవతీలను తయారుచేస్తారు. కావున శ్రమించాలి. ప్రతిరోజు తమ లెక్కలను చూసుకోవాలి. ఏ కర్మేంద్రియం మోసం చేసింది? నాలుక కూడా తక్కువైనదేమీ కాదు. ఏదైనా మంచి వస్తువు కనపడినట్లయితే దాచి పెట్టుకుని తినేస్తారు. అది కూడా పాపమే అని అర్థం చేసుకోరు. దొంగతనం అయినట్లే కదా. అందులోనూ శివబాబా యజ్ఞం నుండి దొంగతనం చేయడం చాలా చెడ్డ పని. ఒక్క పైసా దొంగతనం చేసినవారే రేపు లక్ష రూపాయలు దొంగతనం చేస్తారని అంటారు. అనేకమందిని మాయ ముక్కుతో పట్టుకుంటూ ఉంటుంది. ఈ చెడు అలవాట్లు అన్నింటినీ తొలగించుకోవాలి. మిమ్మల్ని మీరే శిక్షించుకోవాలి. చెడు అలవాట్లు ఉన్నంతవరకు ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గంలోకి వెళ్ళడం గొప్ప విషయమేమీ కాదు. కాని రాజా-రాణులు ఎక్కడ, ప్రజలెక్కడ! కావున కర్మేంద్రియాలను బాగా పరిశీలించుకోవాలి అని తండ్రి చెప్తున్నారు. ఏ కర్మేంద్రియం మోసం చేస్తుంది అన్న లెక్కను తీయాలి. ఇది వ్యాపారం కదా. నాతో వ్యాపారం చేసి ఉన్నత పదవిని పొందాలంటే శ్రీమతంపై నడవండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి డైరెక్షన్ ఇస్తారు, అందులో కూడా మాయ విఘ్నాలను కలిగిస్తుంది. అది చేయనివ్వదు. ఇది మర్చిపోకండి అని తండ్రి చెప్తున్నారు. పొరపాట్లు చేసినట్లయితే తర్వాత ఎంతో పశ్చాత్తాపపడతారు. ఎప్పటికీ ఉన్నత పదవిని పొందలేరు. ఇప్పుడైతే మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని సంతోషంగా అంటారు, కానీ కర్మేంద్రియాలు ఎక్కడా మోసం చేయడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి.

తమ ఉన్నతిని చేసుకోవాలంటే తండ్రి ఇచ్చే డైరెక్షన్ లను అమలులోకి తీసుకురండి. మొత్తం రోజంతటి లెక్కాపత్రాన్ని చూసుకోండి. పొరపాట్లయితే ఎన్నో జరుగుతూ ఉంటాయి. కళ్ళు ఎంతగానో మోసం చేస్తాయి. వీరికి తినిపించాలని, ఏదైనా బహుమతినివ్వాలని దయ కలుగుతూ ఉంటుంది. తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. మాలలోని మణిగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది. 8 రత్నాలు ముఖ్యమైనవి. నవరత్నాలని అంటారు. ఒకరైతే బాబా, మిగిలినవారు 8 మంది, బాబా చిహ్నము మధ్యలో ఉండాలి కదా, ఏదైనా గ్రహచారము మొదలైనవి వచ్చినట్లయితే నవరత్నాల ఉంగరము మొదలైనవి ధరింపజేస్తారు. ఇంతమంది పురుషార్థం చేసేవారిలో నుండి 8 మంది మాత్రమే పాస్ విత్ ఆనర్లుగా వెలువడతారు. 8 రత్నాలకు చాలా మహిమ ఉంది. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. తలపై చాలా పాపాలు ఉన్నాయి, దాన-పుణ్యాలు చేస్తే పాపాలు తొలగిపోతాయి అని భక్తిలో కూడా చింత ఉంటుంది కదా. సత్యయుగములో రావణ రాజ్యమే ఉండదు, కావున చింతించే విషయమే ఉండదు. అక్కడ కూడా ఇటువంటి విషయాలు జరిగినట్లయితే నరకానికి, స్వర్గానికి తేడా ఏమీ ఉండదు. మీరు ఇంత ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చొని చదివిస్తారు. బాబా గుర్తు రాకపోతే, కనీసం చదివించే టీచరునైనా గుర్తు చేసుకోండి. మాకు ఒకే తండ్రీ, సద్గురువు అని అయినా స్మృతి చేయండి. మనుష్యులు ఆసురీ మతంపై తండ్రిని ఎంతగా తిరస్కరించారు! ఇప్పుడు తండ్రి అందరికీ ఉపకారం చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఉపకారం చేయాలి. ఎవ్వరికీ అపకారము చేయకూడదు, చెడు దృష్టి కూడా ఉండకూడదు. స్వయాన్ని నష్టపరుచుకుంటారు. ఆ వైబ్రేషన్లు ఇతరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది చాలా పెద్ద గమ్యము అని తండ్రి చెప్తున్నారు. రోజూ తమ లెక్కాపత్రాన్ని చూసుకోండి – ఎటువంటి వికర్మలనూ తయారుచేసుకోలేదు కదా? ఇది ఉన్నదే వికర్మల ప్రపంచము, వికర్మల శకం. వికర్మాజీత్ దేవతల శకం గురించి ఎవ్వరికీ తెలియదు. వికర్మాజీత్ శకం 5 వేల సంవత్సరాల క్రితం ఉండేది, తర్వాత మళ్ళీ వికర్మల శకం ప్రారంభమవుతుంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు, అందుకే కర్మ-అకర్మ-వికర్మల గతిని గురించి మీకు నేను అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యంలో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. వికర్మలుగా అవ్వవు. అక్కడ వికారాల మాటే ఉండదు. ఈ జ్ఞానపు మూడవ నేత్రము మీకిప్పుడే లభించింది. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారయ్యారు. మనుష్యులెవ్వరూ తయారుచేయలేరు. మిమ్మల్ని తయారుచేసేవారు తండ్రి. మొదట ఆస్తికులుగా అయినప్పుడే త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా అవుతారు. మొత్తం డ్రామా రహస్యమంతా బుద్ధిలో ఉంది. మూలవతనం, సూక్ష్మవతనం, 84 జన్మల చక్రమంతా బుద్ధిలో ఉంది. ఆ తర్వాత అనేక ధర్మాలు వస్తాయి. వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ ధర్మ స్థాపకులను గురువులని అనరు. సర్వులకూ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే ఉన్నారు. మిగిలినవారు సద్గతినిచ్చేందుకు రారు. వారు ధర్మ స్థాపకులు. క్రీస్తును స్మృతి చేయడం ద్వారా సద్గతి ఏమీ లభించదు, వికర్మలూ వినాశనమవ్వవు. ఏమీ జరగదు. వారందరినీ భక్తిమార్గములోని వారు అని అనడం జరుగుతుంది. జ్ఞాన మార్గములో కేవలం మీరే ఉన్నారు. మీరు మార్గదర్శకులు. అందరికీ శాంతిధామానికి, సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి కూడా లిబరేటర్, మార్గదర్శకులు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి.

పిల్లలైన మీరిప్పుడు మీ వికర్మలను వినాశనం చేసుకునే పురుషార్థాన్ని చేస్తున్నారు, కావున ఒకవైపు పురుషార్థం చేస్తూ, మరోవైపు వికర్మలు జరగకూడదు అని మీరు ధ్యానమును ఉంచాలి. పురుషార్థంతో పాటు వికర్మలు కూడా చేస్తే అవి వంద రెట్లుగా అయిపోతాయి. ఎంత వీలైతే అంత వికర్మలను చేయకండి. లేకపోతే అవి ఇంకా పెరిగిపోతాయి. పేరును కూడా అప్రతిష్ఠపాలు చేస్తారు. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని తెలిసినప్పుడు ఇక ఎటువంటి వికర్మలూ చేయకూడదు. దొంగతనము చిన్నదైనా పెద్దదైనా, పాపమైతే జరుగుతుంది కదా. ఈ కళ్ళు ఎంతగానో మోసం చేస్తాయి. పిల్లల నడవడిక ద్వారా తండ్రికి అర్థమైపోతుంది, ఈమె నా భార్య అని ఎప్పుడూ సంకల్పంలో కూడా రాకూడదు, మేము బ్రహ్మాకుమార్-కుమారీలము, శివబాబాకు మనమలము. మేము బాబాతో ప్రతిజ్ఞ చేశాము, రాఖీ కట్టుకున్నాము, మరి కళ్ళు ఎందుకు మోసం చేస్తాయి? స్మృతి బలం ద్వారా ఏ కర్మేంద్రియాల మోసం నుండైనా విముక్తులవ్వగలరు. ఎంతో శ్రమించాలి. తండ్రి డైరెక్షన్ ను అమలుపరచి చార్టును వ్రాయండి. మేమైతే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, టీచరు నుండి పూర్తిగా చదువుకుంటాము అని స్త్రీ-పురుషులు కూడా పరస్పరంలో ఇవే మాటలను మాట్లాడుకోండి. అనంతమైన జ్ఞానమునిచ్చే ఇటువంటి టీచర్ ఇంకెప్పుడూ లభించరు. లక్ష్మీనారాయణులకే తెలియనప్పుడు వారి తరువాత వచ్చేవారు ఎలా తెలుసుకోగలరు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని కేవలం మీరు మాత్రమే సంగమయుగములో తెలుసుకుంటారు. ఇది చేయండి, ఇలా చేయండి అని బాబా చాలా అర్థం చేయిస్తారు. మళ్ళీ ఇక్కడి నుండి లేవగానే అంతా సమాప్తమైపోతుంది. శివబాబా తమకు చెప్తున్నారు అని భావించరు. ఎప్పుడూ శివబాబానే చెప్తున్నారని భావించండి, వీరి ఫోటోను కూడా పెట్టుకోకండి. ఈ రథమును అయితే అద్దెకు తీసుకున్నారు. వీరు కూడా పురుషార్థియే, నేనూ బాబా నుండే వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని వీరు కూడా అంటారు. మీలా వీరు కూడా విద్యార్థి జీవితములో ఉన్నారు. మున్ముందు మీ మహిమ జరుగుతుంది. మీరిప్పుడు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. తర్వాత సత్యయుగంలో మీరు దేవతలుగా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. అదృష్టంలో లేకపోతే, శివబాబా వచ్చి ఎలా చదివిస్తారు అన్న సంశయం ఉత్పన్నమవుతుంది. నేనైతే నమ్మను అని అంటారు. నమ్మకపోతే శివబాబాను ఎలా స్మృతి చేస్తారు. వికర్మలు వినాశనమవ్వవు. ఇక్కడంతా నంబరువారుగా రాజధాని స్థాపనవుతూ ఉంది. దాస-దాసీలు కూడా కావాలి కదా. రాజులకు కట్నం రూపంలో దాసీలు కూడా లభిస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలను పెట్టుకుంటే మరి సత్యయుగంలో ఎంతమంది ఉంటారు. అక్కడకు వెళ్ళి దాస-దాసీలుగా అయ్యే విధంగా సాధారణమైన పురుషార్థాన్ని చేయకూడదు. బాబా, మేమిప్పుడే మరణిస్తే ఏ పదవి లభిస్తుంది అని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్పేస్తారు. మీ లెక్కాపత్రాన్ని మీరే చూసుకోండి. అంతిమంలో నంబరువారుగా కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదనలో రాత్రింబవళ్ళు ఎంత బిజీగా ఉంటారు. బాగా బేరాలు కుదుర్చుకునేవారు ఎవరైతే ఉంటారో, వారు ఒక చేతితో భోజనం చేస్తూ ఉంటారు, మరో చేతితో ఫోనులో కార్య-వ్యవహారాలను నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి వ్యక్తి జ్ఞానమార్గంలో నడవగలుగుతారా? మాకు తీరిక ఎక్కడుంది అని అంటారు. అరే! సత్యమైన రాజ్యము లభిస్తుంది. బాబాను కేవలం స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. అష్టదేవతలు మొదలైనవారిని కూడా స్మృతి చేస్తారు కదా. వారి స్మృతి ద్వారా ఏమీ లభించదు. ఫలానా విషయం గురించి అర్థం చేయించలేదని ఎవ్వరూ అనకుండా, బాబా పదే-పదే ప్రతి విషయం గురించి అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సందేశమును కూడా అందరికీ ఇవ్వాలి. విమానాల ద్వారా కూడా కరపత్రాలను క్రిందకు వేసేందుకు ప్రయత్నించాలి. శివబాబా ఇలా చెప్తున్నారని అందులో వ్రాయండి. బ్రహ్మా కూడా శివబాబాకు సంతానమే. వారు ప్రజాపిత కావున వారూ తండ్రియే, వీరు కూడా తండ్రియే. శివబాబా అని అనడంతోనే చాలామంది పిల్లలకు ప్రేమ అశ్రువులు వచ్చేస్తాయి. వారిని ఎప్పుడూ చూడను కూడా చూడలేదు, కావున “బాబా, మిమ్మల్ని ఎప్పుడు వచ్చి కలుస్తాము, బాబా, బంధనం నుండి విడిపించండి” అని వ్రాస్తారు. చాలామందికి బాబా యొక్క మరియు ఆ తర్వాత రాకుమారుని యొక్క సాక్షాత్కారం కూడా జరుగుతుంది. మున్ముందు ఎంతో మందికి సాక్షాత్కారాలు జరుగుతాయి, అయినా పురుషార్థం అయితే చేయాల్సి వస్తుంది. మరణించే సమయంలో కూడా భగవంతుడిని స్మృతి చేయండి అని మనుష్యులు చెప్తారు. చివరి సమయంలో ఎంతగానో పురుషార్థం చేయడాన్ని మీరు కూడా చూస్తారు. స్మృతి చేయడం మొదలుపెడతారు.

ఎంత సమయం లభిస్తే అంత పురుషార్థాన్ని చేసి మేకప్ చేసుకోండి అని తండ్రి సలహానిస్తున్నారు. బాబా స్మృతిలో ఉండి వికర్మలను వినాశనం చేసుకున్నట్లయితే ఆలస్యంగా వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎలాగైతే ట్రైన్ ఆలస్యమైనప్పుడు ఆ ఆలస్యమైన సమయాన్ని మేకప్ చేస్తారు కదా, అలాగే మీకు కూడా ఇక్కడ సమయం లభించినప్పుడు మేకప్ చేసేసుకోవాలి. ఇక్కడకు వచ్చి సంపాదన చేసుకోవడంలో నిమగ్నమవ్వండి, ఇలా-ఇలా చేయండి, మీ కళ్యాణం చేసుకోండి అని బాబా సలహా కూడా ఇస్తారు. తండ్రి శ్రీమతంపై నడవండి. విమానం నుండి కరపత్రాలను వేయండి, అప్పుడు వీరు సరైన సందేశమునిస్తున్నారు అని మనుష్యులు అర్థం చేసుకోగలుగుతారు. భారత్ ఎంత పెద్దది, బాబాను మేము తెలుసుకోనేలేదు అని ఎవ్వరూ అనకుండా అందరికీ తెలియపరచాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కళ్ళు మోసం చేయడం లేదు కదా అని వివేకవంతులుగా అయి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏ కర్మేంద్రియాలకు వశమై తప్పుడు కర్మలు చేయకూడదు. స్మృతి బలముతో కర్మేంద్రియాల మోసం నుండి విముక్తులవ్వాలి.

2. ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి. ఆలస్యంగా వచ్చినా కూడా పురుషార్థము చేసి మేకప్ చేసుకోవాలి. ఇది వికర్మలు వినాశనము చేసుకునే సమయము కనుక ఎటువంటి వికర్మలూ చేయకూడదు.

వరదానము:- అన్ని పరిస్థితులలోనూ సురక్షితంగా ఉండే ఎయిర్ కండిషన్ టికెట్ యొక్క అధికారి భవ

ఏ పిల్లలైతే ఇక్కడ ప్రతి పరిస్థితిలోనూ సురక్షితంగా ఉంటారో, ఆ పిల్లలకే ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ప్రతి సమస్యను ఒక్క సెకండులో దాటివేసే సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎలాగైతే ఆ టికెట్ కొరకు ధనమునిస్తారో అలా ఇక్కడ “సదా విజయీ” గా అయ్యే ధనము కావాలి. తద్వారా టికెట్ లభిస్తుంది. ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చేసే అవసరం లేదు. కేవలం సదా తండ్రితో పాటు ఉండండి, దానితో లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది.

స్లోగన్:- ఎటువంటి పరిస్థితి ఉన్నా, పరిస్థితి వెళ్ళిపోవాలే కానీ సంతోషము పోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *