Telugu Murli 16/07/20

16-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – ఈ సంగమయుగము వికర్మలను వినాశనం చేసుకునే యుగము, ఈ యుగములో మీరు ఎటువంటి వికర్మలనూ చేయకూడదు, తప్పకుండా పావనంగా అవ్వాలి”

ప్రశ్న:- అతీంద్రియ సుఖపు అనుభవం ఏ పిల్లలకు కలుగుతుంది?

జవాబు:- ఎవరైతే అవినాశీ జ్ఞానరత్నాలతో నిండుగా ఉంటారో, వారికే అతీంద్రియ సుఖపు అనుభవం కలుగగలదు. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తారో, అంతగా షావుకారులుగా అవుతారు. జ్ఞాన రత్నాల ధారణ జరగకపోతే వారు పేదవారు. తండ్రి మీకు భూత, భవిష్య, వర్తమానాల జ్ఞానమునిచ్చి త్రికాలదర్శులుగా తయారుచేస్తున్నారు.

గీతము:- ఓం నమః శివాయ…..

ఓంశాంతి. గతించినదే ఇప్పుడు వర్తమానంగా జరుగుతుంది, మళ్ళీ ఈ వర్తమానమే గతంగా మారిపోతుంది. వారు గతించినదానిని గాయనము చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. పురుషోత్తమ అన్న పదమును తప్పకుండా ఉపయోగించాలి. మీరు వర్తమానాన్ని చూస్తున్నారు, గతించిన విషయాల గాయనమేదైతే ఉందో అది ప్రాక్టికల్ గా జరుగుతుంది, ఇందులో ఎటువంటి సంశయం కలగకూడదు. ఇది సంగమయుగమే కాక కలియుగ అంతిమమని కూడా పిల్లలకు తెలుసు. సంగమయుగము తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం గడిచింది, ఇప్పుడు మళ్ళీ వర్తమానంలో జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, గతంలో జరిగినదే భవిష్యత్తులో కూడా జరుగుతుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, ఆ తర్వాత సత్యయుగంలో రాజ్యాన్ని పొందుతారు. ఇప్పుడిది సంగమయుగము. ఈ విషయం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మీరు ప్రాక్టికల్ గా రాజయోగమును నేర్చుకుంటున్నారు. ఇది చాలా సులభము. చిన్న పిల్లలు మరియు పెద్దవారందరికీ ఒక ముఖ్య విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి, “తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి.” వికర్మలు వినాశనం చేసుకునే ఈ సమయంలో మళ్ళీ వికర్మలు చేసేవారు ఎవరుంటారు. కానీ మాయ వికర్మలను చేయిస్తుంది, అప్పుడు, చెంపదెబ్బ తగిలింది, మా ద్వారా ఈ పెద్ద పొరపాటు జరిగిపోయిందని అర్థం చేసుకుంటారు. అప్పుడే తండ్రిని, ఓ పతిత పావనా, రండి అని పిలుస్తారు. ఇప్పుడు పావనంగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు కావున పావనంగా అవ్వాలి కదా. ఈశ్వరునికి చెందినవారిగా అయి మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. సత్యయుగంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఈ భారతదేశమే పావనంగా ఉండేది. నిర్వికారీ ప్రపంచము, వికారీ ప్రపంచము అని గాయనం కూడా ఉంది. వారు సంపూర్ణ నిర్వికారులు, మనము వికారులము ఎందుకంటే మనము వికారాలలోకి వెళ్తాము. వికారాలు అన్న పదమే అశుద్ధమైనది. వచ్చి పావనంగా చేయండి అని పతితులే పిలుస్తారు. క్రోధం కలవారు అలా పిలువరు. తండ్రి కూడా మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తారు. కొద్దిగా కూడా మార్పు జరుగదు. ఏదైతే గతించిపోయిందో అదే వర్తమానంలో జరుగుతూ ఉంది. భూత, భవిష్య, వర్తమానాలను తెలుసుకున్నవారినే త్రికాలదర్శులు అని అనడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇవి చాలా శ్రమతో కూడుకున్న విషయాలు. క్షణ-క్షణమూ మర్చిపోతారు. లేకపోతే పిల్లలైన మీకు ఎంత అతీంద్రియ సుఖం ఉండాలి. మీరిక్కడ అవినాశీ జ్ఞాన ధనంతో చాలా చాలా షావుకారులుగా అవుతున్నారు. ఎవరు ఎంతగా ధారణ చేస్తారో, వారు అంతగా షావుకారులుగా అవుతున్నారు, కానీ కొత్త ప్రపంచంలో అలా అవుతారు. మనమిప్పుడు చేసేదంతా భవిష్య కొత్త ప్రపంచం కొరకేనని మీకు తెలుసు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు, పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకే తండ్రి వచ్చారు. కల్పక్రితం జరిగినట్లుగానే మళ్ళీ జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా చూస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. భూకంపాలు రావడంతో అంతా సమాప్తమైపోతుంది. భారతదేశంలో ఎన్ని భూకంపాలు జరుగుతాయి. ఇవన్నీ జరగవల్సిందే అని మనము అంటాము. కల్పక్రితం కూడా జరిగాయి కావున బంగారు ద్వారక కిందికి వెళ్ళిపోయిందని అంటారు. మేము 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకున్నామని పిల్లలైన మీ బుద్ధిలో చాలా బాగా కూర్చోబెట్టాలి. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. బాబా, 5 వేల సంవత్సరాల క్రితం కూడా మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. మేము అనేకసార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. మీరు ఎన్నిసార్లు విశ్వానికి యజమానులుగా అవుతారు అన్నది లెక్కించడానికి వీలు లేదు, మళ్ళీ ఫకీర్లుగా అవుతారు. ఈ సమయంలో భారతదేశం పూర్తి నిరుపేదగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా అని మీరు వ్రాస్తారు. వారు డ్రామా అన్న పదమును వాడరు. వారి ప్లాన్ వారిదే.

డ్రామా ప్లాన్ అనుసారంగా మళ్ళీ 5 వేల సంవత్సరాల క్రితం వలె స్థాపనను చేస్తున్నాము అని మీరు చెప్తారు. కల్పక్రితం ఏ కర్తవ్యమునైతే చేశామో, అది ఇప్పుడు కూడా శ్రీమతం ద్వారా చేస్తాము. శ్రీమతం ద్వారానే శక్తి తీసుకుంటాము. శివశక్తులనే పేరు కూడా ఉంది కదా. కావున శివశక్తులైన మీరు దేవీలు, మందిరాలలో కూడా మీ పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరే ఆ దేవీలు, మళ్ళీ మీరు విశ్వ రాజ్యాన్ని పొందుతారు. జగదంబకు ఎంతగా పూజ జరుగుతుందో చూడండి. అనేక పేర్లు పెట్టేశారు. ఉన్నవారు ఒక్కరే. అలాగే ఒక్క శివుడే అందరికీ తండ్రి. మీరు కూడా విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు కావున మీకూ పూజ జరుగుతుంది. దేవీలు అనేకమంది ఉన్నారు, లక్ష్మిని ఎంతగానో పూజిస్తారు. దీపావళి రోజున మహాలక్ష్మిని పూజిస్తారు. వారు హెడ్, మహారాజు-మహారాణిని కలిపి మహాలక్ష్మి అని అంటారు. ఇందులో ఇరువురూ వచ్చేస్తారు. నేను కూడా మహాలక్ష్మిని పూజించేవాడిని, ధనం వృద్ధి చెందితే మహాలక్ష్మి దయ చూపించినట్లు భావిస్తారు. అంతే, ఇక ప్రతి సంవత్సరమూ పూజిస్తారు. అచ్ఛా, వారి నుండి ధనాన్ని కోరుకుంటారు, మరి దేవీల నుండి ఏం కోరుకుంటారు? సంగమయుగీ దేవీలైన మీరు స్వర్గపు వరదానమును ఇచ్చేవారు. ఈ దేవీల ద్వారా స్వర్గపు కామనలన్నీ పూర్తవుతాయని మనుష్యులకు తెలియదు. మీరు దేవీలు కదా. మనుష్యులకు జ్ఞాన దానాన్ని ఇస్తారు, దాని ద్వారా వారి కామనలన్నీ పూర్తి చేస్తారు. రోగాలు మొదలైనవి వచ్చినప్పుడు బాగు చేయమని దేవీలను వేడుకుంటారు. రక్షించమని అంటారు. అనేక రకాలైన దేవీలున్నారు. మీరు సంగమయుగపు శివశక్తి దేవీలు. మీరే స్వర్గపు వరదానమునిస్తారు. తండ్రి కూడా ఇస్తారు, అలాగే పిల్లలు కూడా ఇస్తారు. మహాలక్ష్మిని చూపిస్తారు. నారాయణుడిని గుప్తం చేసేస్తారు. తండ్రి మీ ప్రభావాన్ని ఎంత గొప్పగా చేస్తారు. దేవీలు 21 జన్మల కొరకు సుఖ కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు. ధనం కోసమే మనుష్యులు మంచి వ్యాపారాలు మొదలైనవి చేస్తారు. తండ్రి వచ్చి మిమ్మల్ని మొత్తం విశ్వానికి అధికారులుగా చేస్తారు, అపారమైన ధనమునిస్తారు. శ్రీలక్ష్మినారాయణులు ఒకప్పుడు విశ్వానికి అధికారులు. వారు ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు. మీరు రాజ్యము చేసి, మళ్ళీ ఏ విధంగా నెమ్మది-నెమ్మదిగా క్రిందికి దిగుతూ వచ్చారో పిల్లలైన మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కళలు తగ్గిపోతూ-తగ్గిపోతూ ఇప్పుడు ఎటువంటి స్థితి ఏర్పడిందో చూడండి! ఇది కూడా క్రొత్త విషయమేమి కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం ఎంత నిరుపేదగా ఉంది. ఇది రావణ రాజ్యము. ఎంత ఉన్నతంగా నంబరువన్ గా ఉండేది, ఇప్పుడు లాస్ట్ నంబరులో ఉంది. చివరి నంబరులోకి రాకపోతే మళ్ళీ నంబరువన్ లోకి ఎలా వెళ్ళగలుగుతారు. లెక్క ఉంది కదా. ఓపికగా విచార సాగర మథనము చేస్తే అన్ని విషయాలు వాటంతటవే బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఎంత మధురాతి-మధురమైన విషయాలు! ఇప్పుడైతే మీరు మొత్తం సృష్టి చక్రమునంతా తెలుసుకున్నారు. చదువు కేవలం స్కూల్లో మాత్రమే చదువుకోవడం జరగదు. టీచర్ పాఠము చెప్పి ఇంట్లో చదువుకునేందుకు హోంవర్క్ ఇస్తారు. తండ్రి కూడా మీకు ఇంట్లో చదువుకునేందుకు చదువునిస్తారు. పగలంతా వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, శరీర నిర్వహణ అయితే చేసుకోవాల్సిందే. అమృతవేళలో అయితే అందరికీ తీరిక ఉంటుంది. ఉదయముదయమే 2-3 గంటల సమయము చాలా మంచిది. ఆ సమయంలో మేల్కొని తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. అయితే ఈ వికారాలే మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిచ్చాయి. రావణుడిని తగలబెడతారు కానీ దీని అర్థం కూడా ఏ మాత్రమూ తెలియదు. కేవలం పరంపరగా రావణుడిని తగలబెట్టే ఆచారం కొనసాగుతూ వచ్చింది. డ్రామానుసారంగా ఇది కూడా రచింపబడి ఉంది. రావణుడిని హతమారుస్తూ వచ్చారు కానీ రావణుడు ఏమాత్రము మరణించలేదు. రావణుడిని తగలబెట్టడం ఎప్పుడు సమాప్తమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథను వింటారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీకు వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. తండ్రి ఎవరో తెలుసుకోలేని కారణంగా అందరూ అనాథలుగా ఉన్నారు. భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేసే తండ్రి గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. మెట్లు దిగుతూ తమోప్రధానంగా అయ్యారు కావుననే తండ్రి మళ్ళీ వచ్చారు. కానీ స్వయాన్ని తమోప్రధానంగా ఉన్నామని భావించరు. ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుందని తండ్రి చెప్తున్నారు. ఒక్కరు కూడా సతోప్రధానంగా లేరు. శాంతిధామం మరియు సుఖధామంలో మాత్రమే సతోప్రధానంగా ఉంటారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. తండ్రే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతారు. మీరు మళ్ళీ ఇతరులను మేల్కొల్పుతారు. అలా అందరూ మేల్కొంటూ ఉంటారు. మనుష్యులు మరణిస్తే, వారు ప్రకాశంలోకి రావాలని వారికి దీపాన్ని వెలిగిస్తారు. ఇది ఘోరమైన అంధకారము, ఆత్మలు తిరిగి తమ ఇంటికి వెళ్ళలేవు. దుఃఖాల నుండి విముక్తులవ్వాలని మనసులో ఉంటుంది. కానీ ఒక్కరు కూడా విడుదల అవ్వలేరు.

ఏ పిల్లలకైతే పురుషోత్తమ సంగమయుగపు స్మృతి ఉంటుందో వారు జ్ఞాన రత్నాలను దానం చేయకుండా ఉండలేరు. ఎలాగైతే పురుషోత్తమ మాసములో మనుష్యులు చాలా దాన పుణ్యాలను చేస్తారో, అలా ఈ పురుషోత్తమ సంగమయుగంలో మీరు జ్ఞాన రత్నాలను దానం చేయాలి. స్వయం పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు, కృష్ణుడు కాదు అని కూడా అర్థం చేసుకున్నారు. కృష్ణుడైతే సత్యయుగపు మొదటి రాకుమారుడు, తర్వాత వారు పునర్జన్మలను తీసుకుంటూ వస్తారు. భూత, భవిష్య, వర్తమానాల రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. మీరు త్రికాలదర్శులుగా అవుతారు, తండ్రి తప్ప మరెవ్వరూ త్రికాలదర్శులుగా తయారుచేయలేరు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం తండ్రికి మాత్రమే ఉంది, వారినే జ్ఞానసాగరులని అంటారు. ఉన్నతాతి-ఉన్నతమైనవారు భగవంతుడని గాయనముంది, వారే రచయిత. హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్న పదము చాలా స్పష్టంగా ఉంది – అనగా స్వర్గ స్థాపన చేసేవారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారెప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు అన్నది ఎవ్వరికీ తెలియదు. జయంతి యొక్క అర్థమే తెలియకపోతే, ఇక జరుపుకుని ఏం చేస్తారు, ఇదంతా డ్రామాలో ఉంది. ఈ సమయంలోనే పిల్లలైన మీరు డ్రామాలోని ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు, ఇంకెప్పుడూ తెలుసుకోరు. మళ్ళీ బాబా వచ్చినప్పుడే తెలుసుకుంటారు. ఈ 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మీకిప్పుడు స్మృతిలోకి వచ్చింది. భక్తిమార్గంలో ఏముంది? దాని ద్వారా ఏమీ లభించదు. ఎంతో మంది భక్తులు గుంపులో ఎదురుదెబ్బలు తినేందుకు వెళ్తూ ఉంటారు, బాబా అయితే మిమ్మల్ని వాటి నుండి విడిపించేసారు. మనం శ్రీమతమును అనుసరించి మళ్ళీ భారతదేశాన్ని శ్రేష్ఠంగా తయారుచేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతం ద్వారానే శ్రేష్ఠంగా అవుతారు. శ్రీమతం సంగమయుగంలోనే లభిస్తుంది. మనం ఎవరు, ఈ విధంగా ఎలా తయారయ్యాము అని మీరు యథార్థంగా తెలుసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు. ఒకవేళ పురుషార్థము చేస్తూ-చేస్తూ పిల్లలు ఫెయిల్ అయితే తండ్రికి సమాచారమివ్వండి, మళ్ళీ లేచి నిలబడేందుకు తండ్రి అటెన్షన్ ఇస్తారు. ఓడిపోయామని ఎప్పుడూ కూర్చుండిపోకూడదు. మళ్ళీ లేచి నిలబడండి, మెడిసిన్ వేసుకోండి. సర్జన్ అయితే కూర్చునే ఉన్నారు కదా. 5 అంతస్థుల నుండి కింద పడడానికి, అలాగే 2 అంతస్థుల నుండి కింద పడడానికి ఎంత తేడా ఉందో బాబా అర్థం చేయిస్తున్నారు. 5 అంతస్థులు అనగా కామ వికారము, అందుకే కామం మహాశత్రువు, అదే మిమ్మల్ని పతితంగా చేసింది, ఇప్పుడు పావనంగా అవ్వండి అని తండ్రి చెప్పారు. పతిత పావనుడైన తండ్రియే వచ్చి పావనంగా చేస్తారు. తప్పకుండా సంగమంలోనే తయారుచేస్తారు. ఇది కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము.

తండ్రి ఇప్పుడు అంటు కడుతున్నారని, ఇదే మళ్ళీ మొత్తం ఒక వృక్షంగా పెరుగుతుందని పిల్లలకు తెలుసు. బ్రాహ్మణుల వృక్షం పెరిగిన తర్వాత సూర్యవంశం, చంద్రవంశంలోకి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు. ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. సరే, మురళీ లభించకపోతే తండ్రిని స్మృతి చేయండి. నన్ను స్మృతి చేసినట్లయితే విష్ణు వంశంలోకి వెళ్తారని శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మాకు చెప్తున్నారు అన్నది మీ బుద్ధిలో పక్కా చేసుకోండి. మొత్తమంతా పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. కల్ప-కల్పమూ ఏ పురుషార్థమునైతే చేశారో, అదే పునరావృతమవుతుంది. అర్థకల్పము దేహాభిమానులుగా అయ్యారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యే పూర్తి పురుషార్థం చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. చదువైతే సహజమే, ముఖ్యమైనది పావనంగా అవ్వడము. తండ్రిని మర్చిపోవడం అన్నది చాలా పెద్ద పొరపాటు. దేహాభిమానములోకి రావడంతోనే మర్చిపోతారు. శరీర నిర్వహణార్థం వ్యాపార వ్యవహారాలను 8 గంటలు చేయండి, మిగిలిన 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి. ఆ స్థితి అంత త్వరగా ఏర్పడదు. అంతిమంలో ఈ స్థితి ఏర్పడినప్పుడు వినాశనమౌతుంది. కర్మాతీత స్థితి ఏర్పడిందంటే ఇక ఈ శరీరం ఉండదు, ఎందుకంటే ఆత్మ పవిత్రమైపోయింది కావున శరీరం నుండి విడిపోతుంది. ఎప్పుడైతే నంబరువారుగా కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది, అంతవరకు రిహార్సల్ జరుగుతూనే ఉంటుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ మాసంలో అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేయాలి. అమృతవేళలో లేచి విచార సాగర మథనము చేయాలి. శ్రీమతం అనుసారంగా శరీర నిర్వహణ చేస్తూ తండ్రి ఇచ్చిన హోంవర్కును తప్పకుండా చేయాలి.

2. పురుషార్థంలో ఏదైనా ఆటంకం వస్తే తండ్రికి సమాచారాన్నిచ్చి వారి నుండి శ్రీమతాన్ని తీసుకోవాలి. సర్జన్ కు అంతా వినిపించాలి. వికర్మలను వినాశనం చేసుకునే సమయంలో ఎటువంటి వికర్మలనూ చేయకూడదు.

వరదానము:- దేహము, సంబంధాలు మరియు వైభవాల బంధనము నుండి స్వతంత్రంగా ఉండే బాప్ సమాన్ కర్మాతీత భవ

ఎవరైతే మోహము కారణంగా కాక నిమిత్తమాత్రంగా, డైరెక్షన్ అనుసారంగా ప్రవృత్తిని సంభాళిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారో, వారికి ఒకవేళ, ఇప్పటికిప్పుడే వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే, వారు వెంటనే వచ్చేస్తారు. విజిల్ మోగిన తర్వాత, ఆలోచనలోనే సమయం గడచిపోకూడదు, అప్పుడు నష్టోమోహా అని అంటారు. కావున సదా దేహము యొక్క, సంబంధాల యొక్క, వైభవాల యొక్క బంధనాలు తమవైపుకు లాగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే బంధనముంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. కానీ ఎవరైతే స్వతంత్రంగా ఉంటారో వారు తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు.

స్లోగన్:- స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయినట్లయితే రాజధానిలో ముందు నంబరు లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *