Telugu Murli 17/07/20

17-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞాన సారమంతా ఉంది, కావున మీకు చిత్రాల అవసరము కూడా లేదు, మీరు తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరులచేత చేయించండి”

ప్రశ్న:- అంతిమ సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానముంటుంది?

జవాబు:- ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్తామని ఆ సమయములో మీ బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి చక్రములోకి వస్తారు. నెమ్మది-నెమ్మదిగా మెట్లు దిగుతారు, మళ్ళీ ఎక్కే కళలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు. మొదట మేము సూర్యవంశీయులుగా ఉండేవారము, తర్వాత చంద్రవంశీయులుగా అయ్యాము…. అన్నది ఇప్పుడు మీకు తెలుసు, ఇందులో చిత్రాల అవసరము లేదు.

ఓంశాంతి. పిల్లలూ, ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? 84 జన్మల చక్రము అనగా మీ వెరైటీ జన్మల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. విరాటరూప చిత్రము కూడా ఉంది కదా. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనే జ్ఞానము కూడా పిల్లల్లో ఉంది. మూలవతనము నుండి మొట్టమొదట దేవీ దేవతా ధర్మములోకి వస్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, ఇందులో చిత్రాల అవసరము లేదు. మనము ఎటువంటి చిత్రాలు మొదలైనవాటిని గుర్తు చేసుకోకూడదు. “నేను ఆత్మను, మూలవతనవాసిని, ఇక్కడ నా పాత్ర ఉంది” అన్నది మాత్రమే అంతిమంలో గుర్తుంటుంది. ఇది మర్చిపోకూడదు. ఇవి మనుష్య సృష్టి చక్రములోని విషయాలే, ఇవి చాలా సహజమైనవి. ఇందులో చిత్రాల అవసరము అసలు లేదు, ఎందుకంటే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గపు వస్తువులు. జ్ఞానమార్గములో చదువు ఉంది. చదువులో చిత్రాల అవసరము లేదు. ఈ చిత్రాలను కేవలం సరిదిద్దడం జరిగింది. ఎలాగైతే వారు గీతా భగవంతుడు కృష్ణుడని అంటారో, అలాగే మనము శివుడని అంటాము. ఇది కూడా బుద్ధి ద్వారా అర్థము చేసుకునే విషయము. మేము 84 జన్మల చక్రములో తిరిగాము అని బుద్ధిలో ఈ జ్ఞానముంటుంది. ఇప్పుడు మనము పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయి మళ్ళీ కొత్తగా ఆ చక్రములో తిరుగుతాము. ఈ సారాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. ఎలాగైతే ప్రపంచ చరిత్ర-భూగోళాలు లేక 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అన్నది తండ్రి బుద్ధిలో ఉందో, అలాగే మీ బుద్ధిలో కూడా మొదట మేము సూర్యవంశీయులుగా, ఆ తర్వాత చంద్రవంశీయులుగా అవుతామని ఉంది. చిత్రాల అవసరమే లేదు. కేవలం మనుష్యులకు అర్థం చేయించేందుకు వీటిని తయారుచేశారు. జ్ఞానమార్గములో అయితే తండ్రి కేవలం మన్మనాభవ అని అంటారు. ఈ చతుర్భుజ చిత్రము, రావణుని చిత్రము ఇవన్నీ అర్థము చేయించేందుకు చూపించవలసి వస్తుంది. మీ బుద్ధిలోనైతే యథార్థమైన జ్ఞానముంది. మీరు చిత్రాలు లేకుండానే అర్థం చేయించగలరు. మీ బుద్ధిలో 84 జన్మల చక్రముంది. చిత్రాల ద్వారా కేవలం సహజం చేసి అర్థం చేయించడం జరుగుతుంది, వీటి అవసరము లేదు. మొదట మేము సూర్యవంశానికి చెందినవారిగా ఉన్నాము, తర్వాత చంద్రవంశానికి చెందినవారిగా అయ్యాము అన్నది మీ బుద్ధిలో ఉంది. అక్కడ చాలా సుఖముంది, దానినే స్వర్గమని అంటారు, వీటిని చిత్రాల ద్వారా అర్థం చేయిస్తారు. అంతిమంలో అయితే బుద్ధిలో ఈ జ్ఞానముంటుంది. ఇప్పుడు మనం వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ చక్రములోకి వస్తాము. మెట్ల చిత్రంపై అర్థము చేయించినట్లయితే మనుష్యులకు సహజమవుతుంది. మనమెలా మెట్లు దిగుతాము అని కూడా మీ బుద్ధిలో పూర్తి జ్ఞానముంది. మళ్ళీ తండ్రి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. నేను ఈ చిత్రాల సారాన్ని మీకు అర్థం చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇది 5 వేల సంవత్సరాల చక్రము అని సృష్టిచక్రం ద్వారా అర్థం చేయించవచ్చు. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే సంఖ్య ఎంతగా పెరిగిపోతుంది. క్రైస్తవులది 2 వేల సంవత్సరాలని చూపిస్తారు. ఇందులో ఎంతమంది మనుష్యులుంటారు. 5 వేల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులుంటారు. ఈ లెక్కనంతా మీరు తెలియజేస్తారు. సత్యయుగంలో పవిత్రంగా ఉన్నందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. సత్యయుగానికి లక్షల సంవత్సరాల ఆయువు ఉన్నట్లయితే సంఖ్య కూడా లెక్కలేనంతగా అయిపోతుంది. క్రైస్తవులతో పోల్చుకుని జనాభా లెక్కను తీస్తారు కదా. హిందువుల జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తారు. ఎంతో మంది క్రైస్తవులుగా అయిపోయారు. మంచి తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు చిత్రాలు లేకుండానే అర్థము చేయించగలరు. ఈ సమయంలో ఎంత మంది మనుష్యులున్నారో ఆలోచించండి. కొత్త ప్రపంచములో ఎంత తక్కువ మంది మనుష్యులుంటారు. ఇప్పుడిది పాత ప్రపంచము, ఇందులో ఎంతో మంది మనుష్యులున్నారు. మళ్ళీ కొత్త ప్రపంచం ఎలా స్థాపనవుతుందో, ఎవరు స్థాపిస్తారో, ఇవి తండ్రే అర్థం చేయిస్తారు. వారే జ్ఞానసాగరులు. పిల్లలైన మీరు కేవలం 84 జన్మల చక్రమునే మీ బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనము నరకము నుండి స్వర్గములోకి వెళ్తాము, కావున లోపల సంతోషము ఉంటుంది కదా. సత్యయుగంలో దుఃఖపు విషయమేదీ ఉండదు. అక్కడ పురుషార్థం చేసి ప్రాప్తి చేసుకునేందుకు అప్రాప్తి అయిన వస్తువేదీ ఉండదు. ఇక్కడ పురుషార్థము చేయవలసి ఉంటుంది… ఈ మిషను కావాలి, ఇది కావాలి, అది కావాలి అని… అక్కడైతే అన్ని సుఖాలు ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా మహారాజు ఉంటే వారి వద్ద అన్ని సుఖాలుంటాయి. పేదవారి వద్ద సుఖాలన్నీ ఉండవు. కానీ ఇది కలియుగము కావున వ్యాధులు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. స్వర్గము, నరకము రెండూ ఇక్కడే ఉంటాయి.

ఈ సూక్ష్మవతన ఆట-పాటలన్నీ కూడా కేవలం కాలక్షేపానికి మాత్రమే. కర్మాతీత స్థితి ఏర్పడేంత వరకు కాలక్షేపం చేసేందుకే ఈ ఆటపాటలు ఉపయోగపడతాయి. కర్మాతీత స్థితికి చేరుకుంటే చాలు. ఆత్మనైన నేను ఇప్పుడు 84 జన్మలు పూర్తి చేశాను, ఇప్పుడిక ఇంటికి వెళ్తాను. మళ్ళీ సతోప్రధాన ప్రపంచములోకి వచ్చి సతోప్రధాన పాత్రను అభినయిస్తాను. ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు, ఇందులో చిత్రాలు మొదలైనవి అవసరము లేదు. బ్యారిష్టరు ఎంతగా చదువుతారు, బ్యారిష్టరుగా అవ్వగానే చదివినదంతా సమాప్తమవుతుంది. ప్రాలబ్ధం ఫలితముగా లభిస్తుంది. మీరు కూడా చదువుకుని వెళ్ళి రాజ్యము చేస్తారు. అక్కడ జ్ఞానము అవసరముండదు. ఈ చిత్రాలలో కూడా తప్పొప్పులు ఏమిటో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణులు ఎవరు, ఈ విష్ణువు ఎవరు, అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. విష్ణువు చిత్రములో మనుష్యులు తికమకపడతారు. అర్థము తెలియకుండా పూజలు చేయడం కూడా వ్యర్థమే, ఏమీ అర్థము చేసుకోరు. విష్ణువును ఎలా అయితే అర్థము చేసుకోరో, అలాగే లక్ష్మీనారాయణులను కూడా అర్థము చేసుకోరు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా అర్థము చేసుకోరు. బ్రహ్మా అయితే ఇక్కడ ఉన్నారు, వీరు పవిత్రంగా అయి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచముపై వైరాగ్యముంది. ఇక్కడి కర్మ బంధనాలు దుఃఖమునిచ్చేవి. ఇప్పుడు మన ఇంటికి పదండి అని తండ్రి చెప్తున్నారు. అక్కడ దుఃఖం యొక్క నామ-రూపాలు ఉండవు. మొదట మీరు మీ ఇంట్లో ఉండేవారు, తర్వాత రాజధానిలోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ పావనంగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో మనుష్యుల ఆహార-పానీయాలు మొదలైనవి ఎంత అశుద్ధంగా ఉన్నాయి. ఏవేవో వస్తువులను తింటూ ఉంటారు. అక్కడ దేవతలు ఇటువంటి అశుద్ధమైన వస్తువులను తినరు. భక్తిమార్గము ఎటువంటిదో చూడండి, మనుష్యులను కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్తదిగా తప్పకుండా అవ్వాలి. మనము సతోప్రధానంగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో చిత్రాలు లేకపోతే ఇంకా మంచిది అని బుద్ధి అర్థము చేసుకుంటుంది కదా. లేకపోతే మనుష్యులు ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. తండ్రి 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించారు. మనము ఇలా సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్య వంశీయులుగా అవుతాము, ఇన్ని జన్మలు తీసుకుంటాము. ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోవలసి ఉంటుంది. పిల్లలైన మీరు సూక్ష్మవతన రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు, ధ్యానములో సూక్ష్మవతనానికి వెళ్తారు, కానీ ఇందులో యోగమూ లేదు, జ్ఞానమూ లేదు. ఇది కేవలం ఒక ఆచారము. ఆత్మను ఎలా పిలవడం జరుగుతుందో అర్థము చేయించబడుతుంది, ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏడుస్తుంది, మేము బాబా చెప్పింది వినలేదు అని పశ్చాత్తాప్పడుతుంది. ఇవన్నీ కూడా పురుషార్థములో నిమగ్నమవ్వాలని, తప్పు చేయకుండా ఉండాలని….. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. మేము మా సమయాన్ని సఫలము చేసుకోవాలి, వ్యర్థము చేయకూడదని పిల్లలు సదా ఈ అటెన్షన్ పెట్టినట్లయితే, మాయ పొరపాటు చేయించలేదు. పిల్లలూ, సమయాన్ని వృథా చేయకండి అని బాబా కూడా చెప్తూ ఉంటారు. అనేకమందికి మార్గాన్ని తెలియజేసే పురుషార్థం చేయండి. మహాదానులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరైతే వస్తారో, వారికిది అర్థం చేయించండి మరియు 84 జన్మల చక్రాన్ని కూడా తెలియజేయండి. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో, సంక్షిప్తంగా పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉండాలి.

ఇప్పుడీ అశుద్ధమైన ప్రపంచము నుండి మనము విడుదలవుతామని పిల్లలకు చాలా సంతోషముండాలి. స్వర్గము-నరకము ఇక్కడే ఉన్నాయని మనుష్యులు భావిస్తారు. ఎక్కువ ధనమున్నవారు మేము స్వర్గములో ఉన్నామని భావిస్తారు. మంచి కర్మలు చేశారు కావున సుఖము లభించింది. ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేసి 21 జన్మల కోసం సుఖాన్ని పొందుతారు. వారైతే ఒక్క జన్మ కోసం స్వర్గములో ఉన్నామని భావిస్తారు. అది అల్పకాలికమైన సుఖము, మీది 21 జన్మల సుఖము అని తండ్రి చెప్తున్నారు. దీని కొరకు అందరికీ మార్గాన్ని తెలియజేస్తూ ఉండండని తండ్రి చెప్తున్నారు. తండ్రి స్మృతి ద్వారానే నిరోగులుగా అవుతారు మరియు స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వర్గములో రాజ్యముంటుంది. దానిని కూడా స్మృతి చేయండి. ఒకప్పుడు రాజ్యముండేది, ఇప్పుడు లేదు. ఇది భారతదేశపు విషయమే. మిగిలినవన్నీ అంతర్భాగాలు (బైప్లాట్లు). అంతిమంలో అందరూ వెళ్ళిపోతారు, తర్వాత మనము కొత్త ప్రపంచములోకి వస్తాము. ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేయించేందుకు చిత్రాల అవసరము లేదు. కేవలం అర్థము చేయించేందుకే మూలవతనాన్ని, సూక్ష్మవతనాన్ని చూపిస్తారు. భక్తి మార్గము వారు ఈ చిత్రాలు మొదలైనవి తయారుచేసారని అర్థం చేయించబడుతుంది. కావున మనం కూడా వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ తయారుచేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు నాస్తికులు, అందుకే కరెక్ట్ చేసి తయారుచేసారు అని అంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము….. వాస్తవానికి ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవ్వరూ ఏమీ చేయరు. వైజ్ఞానికులు కూడా తమ బుద్ధితో ఇవన్నీ తయారుచేస్తారు. బాంబులను తయారుచేయవద్దని వైజ్ఞానికులకు ఎవరు ఎంతగా చెప్పినా కానీ, ఎవరి దగ్గరైతే బాంబులు ఎక్కువగా ఉన్నాయో, వారు వాటిని సముద్రంలో వేస్తే, అప్పుడు ఇక ఇతరులెవ్వరూ తయారుచేయరు. వారు ఉంచుకున్నట్లయితే ఇతరులు కూడా తప్పకుండా తయారుచేస్తారు. సృష్టి వినాశనమైతే తప్పకుండా జరగాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. యుద్ధము కూడా తప్పకుండా జరుగుతుంది. వినాశనమవుతుంది, ఆ తర్వాత మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు. పిల్లలూ, సర్వుల కళ్యాణకారులుగా అవ్వండని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు.

పిల్లలు తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు – మధురమైన పిల్లలూ, తమ సర్వస్వాన్ని యజమాని పేరున సఫలము చేసుకోండి. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు…… పిల్లలూ, ఇందులో ఖర్చు చేయండి, ఈ ఆత్మిక ఆసుపత్రి, విశ్వవిద్యాలయాన్ని తెరిస్తే అనేకుల కళ్యాణము జరుగుతుంది అని యజమాని అయిన ఆ తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఆ యజమాని పేరు మీద మీరు ఖర్చు చేస్తే దాని ప్రతిఫలము మీకు 21 జన్మలకు లభిస్తుంది. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది కావున ఆ యజమాని పేరు మీద ఎంత వీలైతే అంత సఫలము చేయండి. యజమాని శివబాబా కదా. భక్తిమార్గములో కూడా యజమాని పేరు మీద దానము చేసేవారు కదా. ఇప్పుడైతే డైరెక్ట్ గా చేస్తున్నారు. యజమాని పేరు మీద పెద్ద-పెద్ద విశ్వవిద్యాలయాలను తెరుస్తూ వెళ్ళినట్లయితే అనేకుల కళ్యాణము జరుగుతుంది. 21 జన్మలకు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. లేకపోతే ఈ ధన-సంపదలన్నీ సమాప్తమైపోతాయి. భక్తిమార్గములో సమాప్తమవ్వవు. ఇప్పుడైతే సమాప్తమవ్వనున్నాయి. మీరు ఖర్చు చేసినట్లయితే, మళ్ళీ మీకే ప్రతిఫలము లభిస్తుంది. యజమాని పేరు మీద సర్వులకు కళ్యాణము చేస్తే, 21 జన్మల వారసత్వము లభిస్తుంది. ఎంత బాగా అర్థము చేయించినా సరే, ఎవరి అదృష్టంలో ఉంటే వారే ఖర్చు చేస్తూ ఉంటారు. తమ ఇల్లు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఇతని (బ్రహ్మా) పాత్రయే ఈ విధంగా ఉంది. ఒక్కసారిగా నషా పెరిగిపోయింది. బాబా రాజ్యాన్ని ఇస్తూ ఉంటే ఈ గాడిద బరువును ఏం చేయను? మీరు రాజ్యాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు కావున ఫాలో చేయండి. వీరు సర్వస్వాన్ని ఎలా వదిలేశారో మీకు తెలుసు. ఓహో! రాజ్యము లభిస్తోంది అని నషా ఎక్కిపోయింది, అల్ఫ్(ఆత్మ)కు అల్లా లభించినప్పుడు బే (భాగస్వామి) కి రాజ్యమును ఇచ్చేశారు. రాజ్యముండేది, తక్కువేమీ లేదు. చాలా లాభదాయకమైన వ్యాపారముండేది. ఇప్పుడు మీకు ఈ రాజ్యము లభిస్తుంది కావున అనేకుల కళ్యాణము చేయండి. ముందుగా భట్టీ జరిగింది, అందులో కొందరు బాగా పరిపక్వమయ్యారు, కొందరు అపరిపక్వంగానే మిగిలిపోయారు. ప్రభుత్వము నోట్లను తయారుచేసినప్పుడు అవి సరిగ్గా తయారవ్వకపోతే వాటిని కాల్చివేయవలసి ఉంటుంది. మొదట వెండి రూపాయలు వాడుకలో ఉండేవి. బంగారము మరియు వెండి చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడేమవుతుంది. కొందరిది రాజులు తినేస్తారు, కొందరిది దొంగలు తినేస్తారు, దొంగతనాలు కూడా ఎన్ని జరుగుతున్నాయో చూడండి. కరువు కాటకాలు కూడా వస్తాయి. ఇది ఉన్నదే రావణరాజ్యము. రామరాజ్యమని సత్యయుగాన్ని అంటారు. మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారుచేస్తే, మళ్ళీ బికారులుగా ఎలా అయ్యారు అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇంత జ్ఞానము లభించింది కావున మీకు ఎంతో సంతోషముండాలి. రోజురోజుకూ సంతోషం పెరుగుతూ ఉంటుంది. యాత్రలో గమ్యస్థానానికి ఎంతగా దగ్గరవుతూ ఉంటే అంత సంతోషము కలుగుతుంది. శాంతిధామము-సుఖధామము ఎదురుగా నిలబడి ఉన్నాయని మీకు తెలుసు. వైకుంఠ వృక్షము కనిపిస్తుంది. అంతే, ఇక చేరుకోబోతున్నాము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ సమయాన్ని సఫలము చేసుకోవాలనే అటెన్షన్ ను ఉంచాలి. మాయ మీ ద్వారా ఎటువంటి పొరపాటు చేయించకుండా ఉండేందుకు మహాదానులుగా అయి అనేకులకు మార్గాన్ని తెలియజేయడంలో బిజీగా ఉండాలి.

2. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు యజమాని పేరు మీద సర్వస్వాన్ని సఫలము చేయాలి. ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి.

వరదానము:- కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మాబాబా సమానంగా అలసటలేనివారిగా కండి

బ్రహ్మాబాబా సమానంగా అలసటలేనివారిగా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయండి. దీని కోసం ఏవైనా కఠినమైన నియమాలను తయారుచేసుకోండి. దృఢ సంకల్పము చేయండి, అటెన్షన్ అనే కాపలాదారుడు సదా అలర్ట్ గా ఉన్నట్లయితే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. మొదట స్వయంపై శ్రమించండి, ఆ తర్వాత సేవలో శ్రమ చేయండి, అప్పుడు ధరణి పరివర్తన అవుతుంది. ఇప్పుడు కేవలం “చేస్తాములే, అయిపోతుంది” అనే ఇటువంటి విశ్రాంతమయమైన సంకల్పాల డన్లప్ ను వదలండి. చేయాల్సిందే, అన్న ఈ స్లోగన్ మస్తకంలో గుర్తున్నట్లయితే పరివర్తన అయిపోతుంది.

స్లోగన్:- మాటల్లో ఆత్మిక భావము మరియు శుభభావన ఉండడము సమర్థమైన మాటలకు గుర్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *