Telugu Murli 18/07/20

18-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యము, మీరు శ్రీమతానుసారముగా మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి”

ప్రశ్న:- ఆత్మిక సేవాధారీ పిల్లలైన మీరు ఏ విషయము గురించి అందరినీ అప్రమత్తం చేస్తారు?

జవాబు:- ఇది అదే మహాభారత యుద్ధ సమయము, ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనున్నది అని మీరు అందరినీ అప్రమత్తము చేస్తారు. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు. వినాశనం తర్వాత జయ జయకారాలు మ్రోగుతాయి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయము ఏ విధంగా లభించగలదు అని మీరు పరస్పరము చర్చించుకుని సలహాలను తీయాలి.

గీతము:- నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు….. (తూనే రాత్ గవాయి సో కే…..)

ఓంశాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు – భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారిని ఉన్నతాతి ఉన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు ఎందుకంటే మీరు సైన్యము కదా. మీ సుప్రీమ్ కమాండర్ ఎవరు? రెండు సైన్యాలున్నాయని కూడా మీకు తెలుసు – అది దైహిక సైన్యము, మీది ఆత్మిక సైన్యము. వారు హద్దులోని వారు, మీరు అనంతమైన వారు. మీలో కమాండర్స్ కూడా ఉన్నారు, జనరల్స్ కూడా ఉన్నారు, లెఫ్ట్నెంట్స్ కూడా ఉన్నారు. మేము శ్రీమతానుసారంగా రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమే లేదు. మనము శ్రీమతానుసారంగా మొత్తం విశ్వముపై మళ్ళీ మన దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. కల్ప-కల్పము మన ఈ పాత్ర కొనసాగుతుంది. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఆ యుద్ధాలలో ఈ విషయాలుండవు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు. వారిని ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. తండ్రి మహిమ అపారమైనది. మీరు కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. మాయ స్మృతిని మరిపింపజేస్తుంది. మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యము. మేము మా రాజ్యాన్ని ఎలా స్థాపన చేయాలి అన్న ఆలోచనే మీకు ఉంది. డ్రామా తప్పకుండా చేయిస్తుంది. పురుషార్థమైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది కదా. మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు పరస్పరములో చర్చించుకుని సలహాలు తీయాలి. అంతిమం వరకు మాయతో మీ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. మహాభారత యుద్ధము తప్పకుండా జరగేది ఉందని కూడా మీకు తెలుసు. లేకపోతే పాత ప్రపంచ వినాశనము ఎలా జరగుతుంది. బాబా మనకు శ్రీమతమునిస్తున్నారు. పిల్లలైన మనము మళ్ళీ మన రాజ్య-భాగ్యాన్ని స్థాపన చేసుకోవాలి. ఈ పాత ప్రపంచము వినాశనమై మళ్ళీ భారత్ లో జయ జయకారాలు జరగాలి, దీనికి మీరు నిమిత్తంగా అయ్యారు. కావున పరస్పరము కలుసుకుని మనము ఏ విధంగా సేవ చేయాలి, ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనున్నది అన్న తండ్రి సందేశాన్ని అందరికీ ఎలా వినిపించాలి అని చర్చించుకోవాలి. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పిల్లలు సంతోషపడతారు. అది హద్దుకు సంబంధించిన విషయము, ఇది మొత్తం విశ్వానికి సంబంధించిన విషయము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇప్పుడు ఇది పాత ప్రపంచము కావున తండ్రి ఎప్పుడు వచ్చారు, వచ్చి కొత్త ప్రపంచాన్ని ఎలా స్థాపన చేస్తారు అన్నది తెలిసి ఉండాలి. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుస్తుంది. అందరికన్నా గొప్పవారు తండ్రి, వారి తర్వాత నంబరువారుగా మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు ఉంటారు. కమాండర్, కెప్టెన్ ఇవన్నీ కేవలం ఉదాహరణగా తెలియజేయడం జరుగుతుంది. కావున అందరికీ తండ్రి పరిచయాన్ని ఏ విధంగా ఇవ్వాలి అని పిల్లలైన మీరు పరస్పరము చర్చించుకుని ప్లాన్ చేయాలి, ఇది ఆత్మిక సేవ. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారని మనం మన సోదరీ-సోదరులకు ఏ విధంగా అప్రమత్తం చేయాలి. పాత ప్రపంచ వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధము. మహాభారత యుద్ధము తర్వాత ఏమి జరుగుతుందో మనుష్యులకు తెలియదు.

ఇప్పుడు మనము సంగమములో పురుషోత్తములుగా అవుతున్నామని మీరిప్పుడు అనుభవం చేసుకుంటున్నారు. పురుషోత్తములుగా తయారుచేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేదీ లేదు. పిల్లలూ, పతిత ప్రపంచములో పావనమైనవారు ఒక్కరు కూడా ఉండరు మరియు పావన ప్రపంచములో మళ్ళీ పతితులు ఒక్కరు కూడా ఉండరు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. పిల్లలైన మీకు మొత్తం చిత్రాలు మొదలైనవాటి సారము అర్థం చేయించడం జరుగుతుంది. భక్తిమార్గములో మనుష్యులు జప-తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో, వాటన్నింటితో అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖము ప్రాప్తిస్తుంది. కానీ ఈ విషయాలను ఇక్కడకు వచ్చి అర్థం చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చుంటాయి. ఇది ఉన్నదే భక్తి రాజ్యము. జ్ఞానము అంశమాత్రం కూడా లేదు. ఏ విధంగా పతిత ప్రపంచంలో పావనమైనవారు ఒక్కరు కూడా లేరో, అలాగే జ్ఞానము కూడా ఒక్కరిలో తప్ప ఎవ్వరిలోనూ లేదు. వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి సంబంధించినవి. మెట్లు దిగాల్సిందే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఇక్కడ నంబరువారుగా సైన్యము ఉంది. ముఖ్యమైన కమాండర్, కెప్టెన్, జనరల్ మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారు పరస్పరము కలుసుకొని బాబా సందేశాన్ని ఏ విధంగా అందించాలి అని ప్లాన్ చేయాలి. మెసంజర్, సందేశకుడు లేక గురువు ఒక్కరే, మిగిలినవారందరూ భక్తిమార్గానికి చెందినవారని పిల్లలకు అర్థం చేయించారు. సంగమయుగానికి చెందినవారు కేవలం మీరు మాత్రమే. ఈ లక్ష్మీ-నారాయణుల లక్ష్యం చాలా ఏక్యురేట్ గా ఉంది. భక్తిమార్గములో సత్యనారాయణ కథ, మూడవ నేత్రం యొక్క కథ, అమరకథను కూర్చుని వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. భక్తిమార్గములోనివి గతించిన విషయాలు, ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళిపోయారో, వారి మందిరాలు మొదలైనవాటిని తరువాత తయారుచేస్తారు. ఇప్పుడు శివబాబా మిమ్మల్ని చదివిస్తున్నారు, తర్వాత భక్తిమార్గములో స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు. సత్యయుగంలో శివుడు లేదా లక్ష్మీ-నారాయణులు మొదలైన వారెవ్వరి చిత్రాలు ఉండవు. జ్ఞానము పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకు తెలుసు కావున చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు…. అని తండ్రి చెప్పారు.

కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు ఎంత సంతోషముంది. సుఖధామాన్ని స్థాపించేందుకు బాబా మళ్ళీ మనకు డైరక్షన్ ఇస్తున్నారు, అందులోనూ పావనంగా అవ్వండి అని నంబరువన్ డైరక్షన్ ఇస్తున్నారు. అందరూ పతితులుగానే ఉన్నారు కదా. కావున సేవను ఏ విధంగా పెంచాలి, పేదవారికి ఏ విధంగా సందేశమును ఇవ్వాలి అని మంచి-మంచి పిల్లలు పరస్పరము కలిసి ప్లాన్ చేయాలి, తండ్రి అయితే కల్పక్రితము వలె వచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. రాజధాని స్థాపన తప్పకుండా జరుగుతుంది. అందరూ తప్పకుండా అర్థము చేసుకుంటారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కారో వారు అర్థము చేసుకోరు. వినాశకాలే ఈశ్వరుని పట్ల విపరీత బుద్ధి కలిగి ఉంటారు కదా. వారు మనందరికీ నాథుడని పిల్లలైన మీకు తెలుసు కావున మీరు వికారాలలోకి వెళ్ళకూడదు, గొడవపడకూడదు-కొట్లాడకూడదు. మీ బ్రాహ్మణ ధర్మము చాలా ఉన్నతమైనది. వారు శూద్ర ధర్మానికి చెందినవారు, మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. మీరు పిలక స్థానంలో ఉన్నారు, వారు కాళ్ళ వద్ద ఉన్నారు. పిలకపైన ఉన్నతాతి ఉన్నతమైన నిరాకార భగవంతుడు ఉన్నారు. ఈ కళ్ళ ద్వారా చూడలేని కారణంగా విరాట రూపములో పిలక (బ్రాహ్మణుల) ను మరియు శివబాబాను చూపించరు. కేవలం దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్తారు. దేవతలుగా అయినవారే మళ్ళీ పునర్జన్మలు తీసుకొని క్షత్రియలుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. విరాట రూపము అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. సరియైన చిత్రాన్ని తయారుచేయాలని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. శివబాబాను చూపించారు, అలాగే బ్రాహ్మణులను కూడా చూపించారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అన్న సందేశాన్ని మీరిప్పుడు అందరికీ ఇవ్వాలి. సందేశమివ్వడం మీ కర్తవ్యము. తండ్రి మహిమ ఏ విధంగా అపారమైనదో, అలాగే భారత్ మహిమ కూడా అపారమైనది. ఇది కూడా ఎవరైనా 7 రోజులు వింటేనే బుద్ధిలో కూర్చుంటుంది. కానీ తీరిక లేదు అని అంటారు. అరే, అర్థకల్పము పిలుస్తూనే వచ్చారు, వారిప్పుడు ప్రాక్టికల్ గా వచ్చి ఉన్నారు. అంతిమంలో తండ్రి రావాల్సిందే. ఇది కూడా బ్రాహ్మణులైన మీరు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. చదువు ప్రారంభించగానే, నిశ్చయమేర్పడుతుంది. ఎవరినైతే మనము పిలుస్తూ వచ్చామో, ఆ ప్రియుడు వచ్చారు, తప్పకుండా ఏదో ఒక శరీరములోకే వచ్చి ఉంటారు. వారికి తమ శరీరము అయితే లేదు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్రము, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు. ఇది చదువు. ఎంతో సహజంగా అర్థం చేయిస్తున్నారు. నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము మీ వంటి పవిత్రమైనవారు మరియు సుఖాన్ని పొందేవారు ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు ఈ సమయంలో అందరికీ జ్ఞానాన్ని దానము చేస్తారు. తండ్రి మీకు రత్నాలను దానము చేస్తారు, మీరు ఇతరులకు ఇస్తారు. భారత్ ను స్వర్గంగా చేస్తారు. మీరు మీ తనువు-మనసు-ధనము ద్వారా శ్రీమతంపై భారత్ ను స్వర్గంగా చేస్తున్నారు. ఇది ఎంత ఉన్నతమైన కార్యము. మీరు గుప్తమైన సైన్యము, ఇది ఎవ్వరికీ తెలియదు. మేము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని, శ్రీమతం ద్వారా శ్రేష్ఠంగా అవుతున్నామని మీకు తెలుసు. నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. కృష్ణుడైతే అలా చెప్పలేరు, అతను రాకుమారుడు. మీరు రాకుమారులుగా అవుతున్నారు కదా. సత్య-త్రేతాయుగాల్లో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉంటుంది. అపవిత్ర రాజులు, పవిత్ర రాజా-రాణులైన లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గము వారి రాజ్యము కొనసాగుతుంది, ఆ తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గమైపోతుంది. రాత్రి మరియు పగలు సగం సగం ఉంటాయి కదా. లక్షల సంవత్సరాల విషయమైతే మళ్ళీ సగం-సగం ఉండదు. వాస్తవానికి లక్షల సంవత్సరాలైతే, దేవతా ధర్మానికి చెందిన హిందువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. లెక్కలేనంతగా ఉండాలి. ఇప్పుడైతే లెక్కపెడ్తారు కదా. ఇది డ్రామాలో రచింపబడింది, ఇది మళ్ళీ జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. కావున పరస్పరము కలుసుకుని సేవా ప్లాన్ ను తయారుచేయాలి. పిల్లలు సేవ చేస్తూ ఉంటారు. కొత్త-కొత్త చిత్రాలను కూడా తయారుచేస్తారు, ప్రదర్శనీలను కూడా చేస్తారు. అచ్ఛా. ఇప్పుడింకేమి చేయాలి? మంచి ఆత్మికమైన మ్యూజియంను తయారుచేయండి. స్వయంగా చూసి వెళ్ళినట్లయితే ఇతరులను కూడా పంపిస్తారు. పేదవారు మరియు షావుకార్లు అందరూ ధర్మార్థము కొద్దిగా ధనము వేరుగా తీస్తారు కదా. ధనవంతులు ఎక్కువగా తీస్తారు, ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. కొందరు వెయ్యి రూపాయలను వేరుగా తీస్తారు, కొందరు తక్కువగా తీస్తారు. కొందరైతే రెండు రూపాయలు కూడా పంపిస్తారు, ఒక రూపాయితో ఒక ఇటుకను పెట్టండి, ఒక రూపాయిని 21 జన్మల కోసం జమా చేయండి అని అంటారు. ఇది గుప్తమైనది. పేదవారి ఒక్క రూపాయి, షావుకార్ల వెయ్యి రూపాయలతో సమానమైనది. పేదవారి వద్ద ఉండేదే తక్కువ కావున ఏమి చేయగలరు. లెక్క అయితే ఉంది కదా. వ్యాపారస్థులు ధర్మార్థము కొద్దిగా ధనము వేరుగా తీస్తారు కదా, మరి ఇప్పుడేమి చేయాలి. తండ్రికి సహాయం చేయాలి. మళ్ళీ రిటర్న్ లో 21 జన్మల కోసం తండ్రి మీకు ఇస్తారు. తండ్రి వచ్చి పేదవారికి సహాయం చేస్తారు. ఇప్పుడిక ఈ ప్రపంచమే ఉండదు. అంతా మట్టిలో కలిసిపోతుంది. కల్పక్రితము వలె స్థాపన తప్పకుండా జరుగుతుందని కూడా మీకు తెలుసు. పిల్లలూ, దేహం యొక్క ధర్మాలన్నింటినీ త్యాగం చేసి, ఒక్క తండ్రినే స్మృతి చేయండని నిరాకార తండ్రి చెప్తున్నారు. ఈ బ్రహ్మా కూడా రచనే కదా. బ్రహ్మా ఎవరి సంతానం, ఎవరు సృష్టించారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను ఏ విధంగా సృష్టిస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి సత్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్రహ్మా కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే ఉంటారు. బ్రహ్మా వంశావళి గాయనము చేయబడింది. భగవంతుడు మనుష్య సృష్టిని ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా అయితే ఇక్కడే ఉండాలి కదా. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వీరు అనేక జన్మల అంతిమంలో ఉన్నారని తండ్రి చెప్తున్నారు. వీరు పూర్తిగా 84 జన్మలను తీసుకున్నారు. బ్రహ్మా సృష్టికర్త ఏమీ కాదు. ఒక్క నిరాకారుడు మాత్రమే సృష్టికర్త. ఆత్మలు కూడా నిరాకారియే. అవి అనాదిగా ఉన్నాయి. వాటిని ఎవరూ సృష్టించలేదు, మరి బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు. నేను వీరిలో ప్రవేశించి వీరి పేరును మార్చాను. బ్రాహ్మణులైన మీ పేర్లు కూడా మార్చేశాను అని తండ్రి చెప్తున్నారు. మీరు రాజఋషులు, ప్రారంభంలో సన్యసించి తోడుగా ఉన్నారు కావున మీ పేర్లు మార్చడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మాయ తినేయడం చూసి మాలను తయారుచేయడం, పేర్లు పెట్టడం మానేశారు.

నేటి ప్రపంచంలో ప్రతి విషయంలో ఎంతో మోసం ఉంది. పాలలో కూడా మోసమే ఉంది. సత్యమైన వస్తువేదీ దొరకదు. తండ్రి విషయంలో కూడా మోసం చేస్తూ ఉంటారు. స్వయాన్ని భగవంతుడు అని పిలిపించుకుంటూ ఉంటారు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్నారు. ఎవరు ఎలా చదువుతున్నారో మరియు ఎలా చదివిస్తున్నారో, ఎటువంటి పదవిని పొందుతారో తండ్రికి తెలుసు. మనము తండ్రి ద్వారా విశ్వకిరీటధారీ యువరాజులుగా అవుతున్నామని నిశ్చయముంది. కావున అటువంటి పురుషార్థాన్ని చేసి చూపించాలి. మనము కిరీటధారీ యువరాజులుగా అవ్వాలి. 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు మళ్ళీ అలా తయారౌతున్నాము. ఇది నరకము, ఇందులో ఏమీ లేదు. మళ్ళీ తండ్రి వచ్చి భండారాను నింపి మృత్యువును, దుఃఖమును దూరము చేస్తారు. ఇక్కడ మీరు భండారాను నింపుకునేందుకు వచ్చారు కదా అని అందరినీ అడగండి. అమరపురిలోకి కాలుడు రాలేడు. భండారాను నింపి మృత్యువును, దుఃఖమును దూరము చేసేందుకే తండ్రి వస్తారు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇటువంటి మధురాతి-మధురమైన విషయాలు వింటూ-వినిపించాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి విశ్వానికి యజమానులుగా తయారుచేసే చదువును చదివించేందుకు వచ్చారు కావున మాకు తీరిక లేదు అని ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీమతంపై తనువు-మనసు-ధనము ద్వారా భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవను చేయాలి.

2. పరస్పరము చాలా మధురాతి-మధురమైన జ్ఞానం యొక్క విషయాలనే వినాలి మరియు వినిపించాలి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు….. అని తండ్రి ఇచ్చిన ఈ డైరక్షన్ ను సదా గుర్తుంచుకోవాలి.

వరదానము:- పురుషార్థంలోని సూక్ష్మమైన నిర్లక్ష్యాన్ని కూడా త్యాగము చేసే ఆల్ రౌండర్, అలర్ట్ భవ

పురుషార్థంలో అలసట నిర్లక్ష్యానికి గుర్తు. నిర్లక్ష్యంగా ఉండేవారు త్వరగా అలసిపోతారు, ఉత్సాహం కలవారు అలసట లేకుండా ఉంటారు. ఎవరైతే పురుషార్థంలో నిరుత్సాహులుగా ఉంటారో వారికే నిర్లక్ష్యం వస్తుంది, ఏమి చేయను, ఇంతే జరుగుతుంది, ఎక్కువ చేయలేను అని వారు ఆలోచిస్తారు. ధైర్యము ఉండదు, నడుస్తూనే ఉన్నాను కదా, చేస్తూనే ఉన్నాను కదా – ఇప్పుడు ఈ సూక్ష్మమైన నిర్లక్ష్యానికి నామ రూపాలు కూడా ఉండకుండా ఉండేందుకు సదా అలర్ట్ గా, ఎవర్రెడీగా మరియు ఆల్ రౌండర్గా అవ్వండి.

స్లోగన్:- సమయం యొక్క మహత్వాన్ని ఎదురుగా ఉంచుకొని సర్వ ప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *