Telugu Murli 19/07/20

19-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి ‘బాప్దాదా’ 25-02-86


డబల్ విదేశీ సోదరీ – సోదరుల సమర్పణ సమారోహంలో అవ్యక్త బాప్ దాదా మహావాక్యాలు

ఈరోజు బాప్ దాదా ఈ విశేషమైన శ్రేష్ఠమైన రోజున విశేషంగా స్నేహభరిత శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఈరోజు ఏ సమారోహాన్ని జరుపుకున్నారు? బాహ్య దృశ్యమైతే సుందరంగా ఉండనే ఉన్నది. అందరి ఉల్లాస-ఉత్సాహాల, దృఢ సంకల్పాల మనసా శబ్దము మనోభిరాముడైన తండ్రి వద్దకు చేరుకుంది. కనుక ఈ రోజును విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలతో నిండిన దృఢ సంకల్పాల సమారోహమని అంటారు. ఎప్పటి నుండైతే తండ్రికి చెందినవారిగా అయ్యారో, అప్పటి నుండి సంబంధం ఉంది మరియు ఇక మీదట కూడా ఉంటుంది. ఈ విశేషమైన రోజును విశేషమైన రూపంతో జరుపుకున్నారు, దీనినే దృఢ సంకల్పం చేశారు అని అంటారు. ఏం జరిగినా కానీ, మాయా తుఫాన్లు వచ్చినా, లోకుల నుండి రకరకాల విషయాలు వచ్చినా, ప్రకృతికి చెందిన ఎటువంటి అలజడి దృశ్యము వచ్చినా, లౌకిక మరియు అలౌకిక సంబంధాలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నా, మనసా సంకల్పాలలో చాలా తీవ్రమైన తుఫాను ఉన్నా కూడా, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఒకే బలము, ఒకే నమ్మకము అన్న ఇటువంటి దృఢ సంకల్పాన్ని చేశారా లేక కేవలం స్టేజిపై కూర్చున్నారా! డబల్ స్టేజిపై కూర్చున్నారా లేక సింగల్ స్టేజిపై కూర్చున్నారా? ఒకటేమో ఈ స్థూలమైన స్టేజి, రెండవది దృఢ సంకల్పమనే స్టేజి, దృఢతా స్థితి. మరి డబల్ స్టేజిపై కూర్చున్నారు కదా? హారాలు కూడా చాలా సుందరమైనవి ధరించారు. కేవలం ఈ హారాన్నే ధరించారా లేక సఫలతా హారాన్ని కూడా ధరించారా? సఫలత మెడలోని హారము. ఈ దృఢతయే సఫలతకు ఆధారము. ఈ స్థూలమైన హారముతో పాటు సఫలతా హారము కూడా వేయబడి ఉన్నది కదా. బాప్ దాదా డబల్ దృశ్యాన్ని చూస్తారు. కేవలం సాకార రూపంలో ఉన్న దృశ్యాన్నే చూడరు, కానీ సాకార దృశ్యముతో పాటు ఆత్మిక స్థితి, మనసు యొక్క దృఢ సంకల్పము మరియు సఫలత అనే శ్రేష్ఠమైన మాల, ఈ రెండిటిని చూశారు. డబల్ మాలలు, డబల్ స్టేజిని చూస్తున్నారు. అందరూ దృఢ సంకల్పము చేశారు. చాలా మంచిది. ఏమి జరిగినా కానీ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. పరమాత్మ పట్ల ప్రీతి యొక్క రీతిని ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటూ సఫలతను పొందాలి. సఫలత మెడలోని హారము అన్నది నిశ్చితము. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు – ఇదే దృఢ సంకల్పము. ఒక్కరే ఉన్నప్పుడు, ఏకరస స్థితి స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశీ దారము జోడింపబడి ఉంది కదా. ఒకవేళ ఒక్క సంబంధము తక్కువైనా అలజడి కలుగుతుంది కనుక సర్వ సంబంధాల దారాన్ని కట్టుకున్నారు. సంబంధాన్ని జోడించారు. సంకల్పాన్ని చేశారు. సర్వ సంబంధాలు ఉన్నాయా లేక కేవలం ముఖ్యమైన మూడు సంబంధాలే ఉన్నాయా? సర్వ సంబంధాలు ఉంటే సర్వ ప్రాప్తులు ఉంటాయి. సర్వ సంబంధాలు లేనట్లయితే ఏదో ఒక ప్రాప్తి తక్కువైపోతుంది. అందరి సమారోహము జరిగింది కదా. దృఢసంకల్పము చేసినట్లైతే ఇక ముందు పురుషార్థంలో కూడా విశేషమైన రూపంలో లిఫ్ట్ లభిస్తుంది. ఈ విధి కూడా విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలను పెంచుతుంది. బాప్ దాదా కూడా పిల్లలందరికీ దృఢ సంకల్పము చేసే సమారోహానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక సదా అవినాశీ భవ, అమర భవ అనే వరదానాలను ఇస్తారు.

ఈ రోజు ఆసియా గ్రూపు కూర్చుని ఉంది. ఆసియా విశేషత ఏమిటి? విదేశాల సేవ యొక్క మొదటి గ్రూపు జపాన్కు వెళ్ళారు, ఇది విశేషతే కదా. సాకార బాబా ప్రేరణ అనుసారంగా విశేషంగా విదేశీ సేవకు నిమంత్రణ మరియు సేవ యొక్క ఆరంభము జపాన్ నుండి జరిగింది. కనుక స్థాపనలో ఆసియా నంబరు ముందుంది కదా. విదేశాల నుండి మొదటి నిమంత్రణ వచ్చింది. ఇతర ధర్మాలవారు నిమంత్రణ ఇచ్చి పిలవడం ఆసియా నుండే ప్రారంభమయింది. కనుక ఆసియా ఎంత భాగ్యశాలి! ఇక రెండవ విశేషత – ఆసియా భారతదేశానికి అన్నిటికంటే సమీపంగా ఉంది. ఎవరైతే సమీపంగా ఉంటారో వారిని అల్లారుముద్దు పిల్లలని అంటారు. అల్లారుముద్దు పిల్లలు దాగి ఉన్నారు, ప్రతి స్థానం నుండి ఎంత మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. క్వాంటిటీ తక్కువగా ఉన్నా క్వాలిటీ వారిగా ఉన్నారు. శ్రమకు ఫలితం బాగుంది. ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు సంఖ్య పెరుగుతూ ఉంది. అందరూ స్నేహీలే, అందరు ప్రియమైనవారే. ప్రతి ఒక్కరు ఒకరి కంటే ఒకరు ఎక్కువ స్నేహీలుగా ఉన్నారు. ఇదే బ్రాహ్మణ పరివారములోని విశేషత. నాకు బాబాపై అందరికంటే ఎక్కువ స్నేహముంది మరియు బాబాకు కూడా నేనంటే ఎక్కువ స్నేహముంది, నన్నే బాప్ దాదా ముందుకు తీసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరూ ఈ అనుభవం చేస్తారు. అందుకే భక్తిమార్గంలోని వారు కూడా ఒక మంచి చిత్రాన్ని చాలా అర్థసహితంగా తయారుచేశారు. ప్రతి గోపికతోనూ వల్లభుడు ఉన్నాడు. కేవలం ఒక్క రాధతోనే లేక కేవలం 8 మంది పట్టపురాణులతోనే కాదు, ప్రతి గోపికతోనూ గోపీవల్లభుడు ఉన్నాడు. ఎలాగైతే మీరు దిల్ వాడా మందిరానికి వెళ్ళినప్పుడు, ఇది నా చిత్రము లేక ఇది నా గది అని నోట్ చేసుకుంటారు కదా. అయితే ఈ రాస మండలిలో కూడా మీ అందరి చిత్రము ఉందా? దీనినే మహా రాస్ అని అంటారు. ఈ మహా రాస్ కు చాలా గొప్ప మహిమ ఉంది. బాప్ దాదాకు ప్రతి ఒక్కరిపట్ల ఒకరి కంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి బాప్ దాదా హర్షితులవుతారు. ఎవరైనా కానీ, కోట్లలో కొందరిగా ఉన్నారు. పదమాపదమ్ భాగ్యశాలురుగా ఉన్నారు. ప్రపంచము లెక్కలో చూస్తే ఇన్ని కోట్లమందిలో కొందరు కదా. జపాన్ అయితే ఎంత పెద్దది కానీ బాబా పిల్లలు ఎంతమంది ఉన్నారు! కనుక కోట్లలో కొందరిగా అయ్యారు కదా. బాప్ దాదా ప్రతి ఒక్కరి విశేషతను, భాగ్యాన్ని చూస్తారు. కోట్లలో కొద్దిమంది అయిన గారాబాల పిల్లలు. తండ్రికి అందరూ విశేషమైన ఆత్మలే. బాబా కొందరిని సాధారణమైనవారిగా, కొందరిని విశేషమైనవారిగా చూడరు. అందరూ విశేషమైనవారే. ఈ వైపు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందాలి ఎందుకంటే పూర్తిగా ఈ వైపంతా విశేషంగా డబల్ సేవ ఉంది. ఒకటేమో అనేక వెరైటి ధర్మాలవారు ఉన్నారు, అంతేకాక ఇటువైపు సింధ్ నుండి వెలువడిన ఆత్మలు కూడా చాలామంది ఉన్నారు. వారి సేవను కూడా బాగా చేయవచ్చు. వారిని సమీపంగా తీసుకొస్తే వారి సహయోగంతో ఇతర ధర్మాల వరకు కూడా సహజంగా చేరుకోగలరు. డబల్ సేవతో డబల్ వృద్ధిని చేయగలరు. వారిలో ఏదో ఒక రీతిలో, మంచిగానో, చెడుగానో బీజము నాటబడి ఉంది. పరిచయం ఉన్న కారణంగా సహజంగా సంబంధంలోకి రాగలరు. చాలా సేవ చేయగలరు ఎందుకంటే ఇది ఆత్మలందరి పరివారము. బ్రాహ్మణులు అన్ని ధర్మాలలో చెల్లాచెదురై ఉన్నారు. అందులో బ్రాహ్మణులు చేరుకోనటువంటి ధర్మము ఏదీ లేదు. ఇప్పుడు అన్ని ధర్మాల నుండి బయటపడి వస్తున్నారు మరియు ఎవరైతే బ్రాహ్మణ పరివారానికి చెందినవారిగా ఉంటారో, వారు నా వారని అనిపిస్తుంది కదా. ఏదో లెక్కాచారముతో వెళ్ళారు, మళ్ళీ తమ పరివారంలోకి వచ్చి చేరుకున్నారు. ఎక్కడెక్కడ నుండో వచ్చి చేరుకొని తమ సేవా భాగ్యాన్ని తీసుకునేందుకు నిమిత్తమయ్యారు. ఇదేమీ తక్కువ భాగ్యము కాదు. చాలా శ్రేష్ఠమైన భాగ్యము. చాలా గొప్ప పుణ్యాత్మలుగా అవుతారు. మహాదానులు, మహాన్ సేవాధారుల లిస్టులోకి వచ్చేస్తారు. కనుక నిమిత్తంగా అవ్వడం కూడా ఒక విశేషమైన గిఫ్ట్ మరియు డబల్ విదేశీయులకు ఈ గిఫ్ట్ లభిస్తుంది. కొద్దిగా అనుభవం చేస్తూనే సెంటరు స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయిపోతారు. కనుక ఇది కూడా లాస్ట్ సో ఫాస్ట్ వెళ్ళేందుకు విశేషమైన గిఫ్ట్. సేవ చేయడం వల్ల మెజారిటీ వారికి, నిమిత్తులమైన మేము ఏది చేస్తామో మరియు ఎలా నడుస్తామో, అలా మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు అనే స్మృతి ఉంటుంది. కనుక ఇది డబల్ అటెన్షన్ అయిపోతుంది. డబల్ అటెన్షన్ ఉన్నందుకు డబల్ లిఫ్ట్ అయిపోతుంది. అర్థమయిందా – డబల్ విదేశీయులకు డబల్ లిఫ్ట్ ఉంది. ఇప్పుడు అన్ని వైపులా ధరణి మంచిగా అయిపోయింది. నాగలితో దున్నిన తర్వాత భూమి మంచిగా అయిపోతుంది కదా. తర్వాత ఫలాలు కూడా మంచిగా మరియు సహజంగా వెలువడుతాయి. అచ్ఛా – ఆసియాకు చెందిన పెద్ద మైకు చేసే శబ్దము భారతదేశానికి త్వరగా చేరుకుంటుంది. కనుక అటువంటి మైకును తయారుచేయండి. అచ్ఛా –

పెద్ద దాదీలతో – మీ మహిమను ఏమని చేయాలి! ఎలాగైతే బాబా కొరకు చెప్తారు కదా – సాగరాన్ని సిరాగా చేసుకొని, భూమిని కాగితంగా చేసుకొని… అలాంటి మహిమయే మీ దాదీలందరికీ ఉంది. ఒకవేళ మహిమ చేయడం ప్రారంభిస్తే, పూర్తి రాత్రింబవళ్లు ఒక సప్తాహ కోర్సుగా అవుతుంది. బాగున్నారు, అందరి రాస్ బాగుంది. అందరి రాశి కలుస్తుంది, అంతేకాక అందరూ రాస్ కూడా బాగా చేస్తారు. చేతిలో చేతిని కలపడం అనగా ఆలోచనలను కలపడం – ఇదే రాస్. మరి బాప్ దాదా దాదీల ఈ రాస్ నే చూస్తూ ఉంటారు. ఇదే అష్టరత్నాల రాస్.

దాదీలైన మీరందరూ పరివారానికి విశేషమైన అలంకారము. ఒకవేళ అలంకారము లేకపోతే శోభ ఉండదు. కనుక అందరూ మిమ్మల్ని అదే స్నేహంతో చూస్తారు.

బ్రిజేంద్రా దాదీతో – బాల్యము నుండి లౌకికంలో, అలౌకికంలో అలంకారము చేస్తూ ఉండేవారు, మరి అలంకారము చేస్తూ-చేస్తూ స్వయం అలంకారంగా అయిపోయారు. ఇలాగే ఉన్నారు కదా. బాప్ దాదా మహావీరులు, మహారథులైన పిల్లలను సదా గుర్తు చెయ్యడమే కాదు, ఇమిడిపోయి ఉంటారు. ఎవరైతే ఇమిడిపోయి ఉంటారో వారిని గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. బాప్ దాదా సదా ప్రతి విశేషమైన రత్నాన్ని విశ్వం ముందు ప్రత్యక్షం చేస్తారు. కనుక మీరు విశ్వం ముందు ప్రత్యక్షమయ్యే విశేషమైన రత్నము. అదనంగా అందరి సంతోషమనే సహయోగముంది. మీ సంతోషాన్ని చూసి అందరికీ సంతోషమనే ఔషధం లభిస్తుంది కనుక మీ అందరి ఆయువు పెరుగుతోంది, ఎందుకంటే అందరి స్నేహమనే ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడింకా చాలా కార్యాన్ని చేయాలి కనుక మీరు పరివారానికి అలంకారము. అందరూ ఎంత ప్రేమగా చూస్తారు. ఎలాగైతే ఎవరిదైనా ఛత్రము పడిపోతే వారి తల ఎలా అనిపిస్తుంది. ఒకవేళ ఛత్రం ధరించేవారు, ధరించకపోతే, ఎలా ఉంటుంది. మరి మీరందరూ కూడా పరివారానికి ఛత్రముగా ఉన్నారు.

నిర్మలశాంత దాదీతో – మీ స్మృతిచిహ్నాన్ని సదా మధువనంలో చూస్తూ ఉంటారు. స్మృతిచిహ్నాలు స్మృతి చేసేందుకే ఉన్నాయి. కానీ మీ స్మృతి, స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తుంది. నడుస్తూ-తిరుగుతూ పరివారమంతటికీ, నిమిత్తంగా ఉన్న ఆధారమూర్తులు గుర్తుకొస్తూ ఉంటారు. కనుక మీరు ఆధారమూర్తులు. స్థాపనా కార్యానికి ఆధారమూర్తులు దృఢంగా ఉన్న కారణంగా ఈ వృద్ధి చేసారు మరియు ఉన్నతి యొక్క భవనము ఎంత దృఢంగా అవుతుంది. కారణమేమిటి? ఆధారము దృఢంగా ఉంది. అచ్ఛా.

డబల్ లైట్ గా అవ్వండి (అవ్యక్త మురళీల నుండి ఎన్నుకున్న అమూల్యమైన రత్నాలు)

డబల్ లైట్ అనగా ఆత్మిక స్వరూపంలో స్థితులై ఉంటే తేలికదనము స్వతహాగా వచ్చేస్తుంది. ఇటువంటి డబల్ లైట్ గా ఉన్నవారినే ఫరిస్తా అని అంటారు. ఫరిస్తాలు ఎప్పుడూ ఏ బంధనంలోనూ బంధింపబడరు. ఈ పాత ప్రపంచము, పాత దేహము యొక్క ఆకర్షణలోకి రారు ఎందుకంటే ఉన్నదే డబల్ లైట్ గా.

డబల్ లైట్ అనగా సదా ఎగిరేకళను అనుభవం చేసేవారు ఎందుకంటే ఏదైతే తేలికగా ఉంటుందో, అది సదా పైన ఎగురుతుంది, భారంగా ఉండేది కిందకు వెళ్తుంది. కనుక డబల్ లైట్ ఆత్మలు అనగా ఎటువంటి భారము ఉండకూడదు ఎందుకంటే ఏదైనా భారము ఉన్నట్లయితే, అది ఉన్నతమైన స్థితిలో ఎగరనివ్వదు. డబల్ బాధ్యత ఉన్నప్పటికీ డబల్ లైట్ గా ఉంటే లౌకిక బాధ్యత ఎప్పుడూ అలసిపోనివ్వదు ఎందుకంటే మీరు ట్రస్టీలు. ట్రస్టీలకు ఏమి అలసట ఉంటుంది. నా గృహస్థము, నా ప్రవృత్తి అని భావిస్తే భారముంటుంది. నాదంటూ ఏదీ లేనే లేదు కనుక ఇక ఏ విషయంలో భారముంటుంది. పూర్తిగా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. బాలకులు మరియు యజమానులుగా ఉంటారు.

సదా స్వయాన్ని బాబాకు అర్పణ చేసుకుంటే సదా తేలికగా ఉంటారు. మీ బాధ్యతను బాబాకు ఇచ్చేయండి అనగా మీ భారమును బాబాకు ఇచ్చేస్తే స్వయం తేలికగా అయిపోతారు. బుద్ధి ద్వారా సరెండర్ అయిపోండి. ఒకవేళ బుద్ధి ద్వారా సరెండర్ అయినట్లయితే వేరే ఏ విషయమూ బుద్ధిలోకి రాదు. అంతా బాబాదే, అన్నీ బాబాలోనే ఉన్నాయి అన్నప్పుడు ఇక వేరే ఏదీ ఉండనే ఉండదు. డబల్ లైట్ అనగా సంస్కార-స్వభావాల భారము కూడా ఉండదు, వ్యర్థ సంకల్పాల భారము కూడా ఉండదు – దీనినే తేలికదనమని అంటారు. ఎంత తేలికగా ఉంటారో అంత సహజంగా ఎగిరేకళను అనుభవం చేస్తారు. ఒకవేళ యోగంలో కొద్దిగా అయినా శ్రమ చేయాల్సి వస్తుందంటే తప్పకుండా ఏదో భారము ఉంది అని అర్థము. కనుక బాబా-బాబా అనే ఆధారాన్ని తీసుకుని ఎగురుతూ ఉండండి.

మేము తండ్రి సమానంగా అవ్వాలంటే, ఎలాగైతే తండ్రి లైటుగా ఉన్నారో, అలాగే మేము డబల్ లైట్ అనే లక్ష్యము సదా గుర్తుండాలి. ఇతరులను చూస్తే బలహీనంగా అవుతారు. సీ ఫాదర్, ఫాలో ఫాదర్ చేయండి (బాబాను చూడండి, బాబాను అనుసరించండి). ఎగిరేకళకు శ్రేష్ఠమైన సాధనము కేవలం ఒకే పదము – ‘అంతా నీదే’. ‘నాది’ అనే మాటను మార్చి ‘నీది’ గా చేయండి. నీ వాడిని అని భావిస్తే ఆత్మ తేలికగా ఉంటుంది. అంతా నీదే అన్నప్పుడు తేలికగా అవుతారు. ఎలాగైతే ప్రారంభంలో ఈ అభ్యాసం చేసేవారు – నడుస్తూ ఉంటారు కానీ స్థితి ఎలా ఉండేదంటే ఇతరులు ఇదేదో లైటు వెళ్తోంది అని అనుకునేవారు. వారికి శరీరము కనిపించేది కాదు. ఈ అభ్యాసంతోనే అన్ని రకాల పరీక్షల్లో పాస్ అయ్యారు. మరి ఇప్పుడు సమయము చాలా చెడుగా రానున్నది కనుక డబల్ లైట్ గా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇతరులకు సదా మీ లైటు రూపము కనిపించాలి – ఇదే మీకు రక్షణ. లోపలకు వస్తూనే లైటు కోటను చూడాలి.

లైటు కనెక్షన్ ద్వారా పెద్ద పెద్ద మెషీన్లు నడుస్తాయి. మీరందరూ ప్రతి కర్మ చేస్తూ కనెక్షన్ ఆధారంతో స్వయం కూడా డబల్ లైట్ గా అయి నడుస్తూ ఉండండి. ఎక్కడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో, అక్కడ శ్రమ మరియు కష్టము అనే మాటలు సమాప్తమైపోతాయి. నాది అనే భావాన్ని సమాప్తం చేసి ట్రస్టీని అనే భావము మరియు ఈశ్వరీయ సేవా భావము ఉన్నట్లయితే డబల్ లైట్ గా అవుతారు. ఎవరైనా మీ సమీప సంపర్కంలోకి వస్తే, వీరు ఆత్మికమైనవారు, అలౌకికమైనవారు అని వారు అనుభూతి చెయ్యాలి. వారికి మీ ఫరిస్తా రూపమే కనిపించాలి. ఫరిస్తాలు సదా ఉన్నతంగా ఉంటారు. ఫరిస్తాలను చిత్రాల రూపంలో చూపించినప్పుడు రెక్కలను చూపిస్తారు ఎందుకంటే వారు ఎగిరే పక్షులు.

ఎప్పుడైతే మీ సంకల్పాలలో దృఢత ఉంటుందో మరియు స్థితిలో డబల్ లైట్ గా ఉంటారో, అప్పుడు సదా సంతోషంలో ఊయలలు ఊగేవారిగా, అందరి విఘ్నాలను హరించేవారిగా మరియు అందరి కష్టాలను సహజం చేసేవారిగా అవుతారు. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాదే. భారాన్ని మీ మీద ఉంచుకున్నప్పుడు అన్ని రకాలైన విఘ్నాలు వస్తాయి. నాది కాదు అనుకుంటే నిర్విఘ్నంగా ఉంటారు. సదా స్వయాన్ని డబల్ లైట్ గా భావించి సేవ చేస్తూ ఉండండి. ఎంతగా సేవలో తేలికదనము ఉంటుందో, అంత సహజంగా ఎగురుతారు, ఎగిరిస్తారు. డబల్ లైట్ గా అయి సేవ చేయడం, స్మృతిలో ఉంటూ సేవ చేయడం – ఇదే సఫలతకు ఆధారము.

బాధ్యతను నెరవేర్చడం కూడా అవసరమే కానీ ఎంత పెద్ద బాధ్యతనో, అంతే డబల్ లైట్. బాధ్యతను నెరవేరుస్తూ బాధ్యత యొక్క భారము నుండి అతీతంగా ఉండండి – దీనినే బాబాకు ప్రియంగా అవ్వడమని అంటారు. ఏమి చేయాలి, చాలా బాధ్యత ఉంది అని గాభరా పడకండి. ఇది చేయాలా, వద్దా….. ఇది చాలా కష్టము అని ఫీల్ అవ్వడమనగా భారము! డబల్ లైట్ అనగా దీని నుండి కూడా అతీతము. ఏదైనా బాధ్యతతో కూడిన పనిలో, అలజడి అనే భారము ఉండకూడదు. సదా డబల్ లైట్ స్థితిలో ఉండేవారు నిశ్చయబుద్ధి, నిశ్చింతులుగా ఉంటారు. ఎగిరేకళలో ఉంటారు. ఎగిరేకళ అనగా అత్యంత ఉన్నతమైన స్థితి. వారి బుద్ధి రూపీ పాదము భూమిపై ఉండదు. భూమి అనగా దేహభానము నుండి పైకి. ఎవరైతే దేహభానమనే భూమి నుండి పైన ఉంటారో, వారు సదా ఫరిస్తాలుగా ఉంటారు.

ఇప్పుడు డబల్ లైట్ గా అయి దివ్యబుద్ధి అనే విమానము ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన శిఖరము వంటి స్థితిలో స్థితియై విశ్వంలోని ఆత్మలందరికీ లైట్ మైట్ యొక్క శుభ భావన మరియు శ్రేష్ఠ కామనల సహయోగమనే అలను వ్యాపింపజేయండి. ఈ విమానంలో బాప్ దాదా ఇచ్చిన రిఫైన్ శ్రేష్ఠ మతము యొక్క సాధనము ఉండాలి. అందులో కొద్దిగా కూడా మన్మతము, పరమతము అనే చెత్త ఉండకూడదు.

వరదానము:- ప్రతి సెకండు, ప్రతి సంకల్పము యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్య ఖాతాను జమ చేసుకునే పదమాపదమ్ పతి భవ

పుణ్యాత్మలైన మీ సంకల్పంలో ఎంత విశేషమైన శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా అసంభవాన్ని సంభవంగా చేయగలరు. ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారిని సస్యశ్యామలంగా చేస్తున్నారో, పర్వతాలపై పుష్పాలు పూసేలా చేస్తున్నారో, అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరాశావాదులను ఆశావాదులుగా చేయగలరు. కేవలం ప్రతి సెకండు, ప్రతి సంకల్పము యొక్క విలువను తెలుసుకొని, సంకల్పము, సెకండును ఉపయోగించి పుణ్య ఖాతాను జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్ఠమైనదంటే ఒక్క సంకల్పము కూడా పదమాపదమ్ పతులుగా చేసేస్తుంది.

స్లోగన్:- ప్రతి కర్మను అధికారిని అనే నిశ్చయము మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *