Telugu Murli 20/07/20

20-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – బంధనముక్తులుగా అయ్యి సేవలో తత్పరులవ్వండి, ఎందుకంటే ఈ సేవలో చాలా ఉన్నతమైన సంపాదన ఉంది, 21 జన్మలకు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు”

ప్రశ్న:- పిల్లలు ప్రతి ఒక్కరూ ఏ అలవాటును అలవరచుకోవాలి?

జవాబు:- మురళి పాయింట్లపై అర్థం చేయించడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ బ్రాహ్మణి (టీచరు) ఎక్కడికైనా వెళ్తే పరస్పరము కలుసుకుని క్లాసు చేసుకోవాలి. ఒకవేళ మురళి వినపించడము నేర్చుకోలేదంటే తమ సమానంగా ఎలా తయారుచేస్తారు. బ్రాహ్మణి లేకపోతే తికమకపడకూడదు. ఈ చదువు అయితే సహజమైనది. క్లాసు చేస్తూ ఉండండి, ఈ అభ్యాసము కూడా చేయాలి.

గీతము:- ముఖము చూసుకో ఓ ప్రాణి!… (ముఖడా – దేఖ్ లో ప్రాణీ…)

ఓం శాంతి. పిల్లలు ఇక్కడ వినేటప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోవాలి మరియు తండ్రి అయిన పరమాత్మ మాకు వినిపిస్తున్నారు అని నిశ్చయం ఏర్పరుచుకోవాలి. ఈ డైరక్షన్ ను లేక ఈ మతమును ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు, దీనినే శ్రీమతము అని అంటారు. శ్రీ అంటే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన అని అర్థము. వారు అనంతమైన తండ్రి, వారిని ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని అంటారు. చాలామంది మనుష్యులు భగవంతుడిని తండ్రిగా భావిస్తూ ప్రేమగా స్మృతి చేయరు. శివుని భక్తి చేస్తారు, చాలా ప్రేమతో తలుచుకుంటారు కానీ మనుష్యులు అందరిలో పరమాత్మ ఉన్నారని చెప్పడంతో ఇక ఆ ప్రేమను ఎవరితో జోడించాలి, కావున తండ్రి పట్ల విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. భక్తిలో ఏదైనా దుఃఖము లేక రోగము మొదలైనవి వచ్చినప్పుడు ప్రీతిని చూపిస్తారు. భగవంతుడా, రక్షించు అని అంటారు. గీత అంటే శ్రీమతము, భగవంతుని నోటి నుండి వెలువడినదని పిల్లలకు తెలుసు. మరి ఇంకే శాస్త్రాలలోనూ భగవంతుడు రాజయోగాన్ని నేర్పించడము గానీ, శ్రీమతమునివ్వడం గానీ జరగలేదు. భారత్ కు సంబంధించిన ఒక్క గీతకు మాత్రమే అంత ఎక్కువ ప్రభావము ఉంటుంది. ఒక్క గీత మాత్రమే భగవంతుని ద్వారా గాయనము చేయబడింది, భగవంతుడు అని అనగానే దృష్టి ఒక్క నిరాకారుని వైపే వెళ్తుంది. వ్రేలితో పైకి చూపిస్తారు. కృష్ణుడి గురించి ఈ విధంగా ఎప్పుడూ చెప్పరు ఎందుకంటే వారు దేహధారి కదా. మీకిప్పుడు వారితో గల సంబంధము గురించి తెలిసింది, కావుననే తండ్రిని స్మృతి చేయండి, వారిపై ప్రీతినుంచండి అని చెప్పడం జరుగుతుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఆ భగవంతుడు పిల్లలను చదివిస్తున్నారు. కావున ఆ నషా ఎంతగానో ఎక్కి ఉండాలి. ఆ నషా స్థిరంగా కూడా ఉండాలి. బ్రాహ్మణి ఎదురుగా ఉంటే నషా ఎక్కడం, బ్రాహ్మణి లేకపోతే నషా మాయమైపోవడం కాదు. బ్రాహ్మణి లేకపోతే మేము క్లాసు నడిపించలేము అని భావించకూడదు. కొన్ని-కొన్ని సెంటర్ల గురించి బాబా అర్థం చేయిస్తున్నారు, అక్కడ బ్రాహ్మణి 5-6 మాసాలు బయటకు వెళ్ళినా పరస్పరము సెంటరు సంభాళిస్తారు ఎందుకంటే చదువు అయితే సహజమైనది. కొందరైతే బ్రాహ్మణి లేకపోతే గ్రుడ్డివారుగా, కుంటివారుగా అయిపోతారు. బ్రాహ్మణి వెళ్ళిపోతే సెంటరుకు వెళ్ళడమే మానేస్తారు. అరే, ఇంతమంది కూర్చున్నారు, క్లాసు నడిపించలేరా. గురువు బయటకు వెళ్ళినట్లయితే వారి వెనుక శిష్యులు సంభాళిస్తారు కదా. పిల్లలు సేవ చేయాలి. విద్యార్థుల్లో నంబరువారీగా ఉండనే ఉంటారు. ఫస్టుక్లాస్ గా ఉన్నవారిని ఎక్కడికి పంపించాలో బాప్ దాదాకు తెలుసు. పిల్లలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు, ఎంతో కొంత ధారణ జరిగి ఉంటుంది, కనుక పరస్పరము కలిసి సెంటరు నడిపించాలి. మురళీ ఎలాగైనా లభిస్తుంది. పాయింట్ల ఆధారంగానే అర్థం చేయిస్తారు. కేవలం వినే అభ్యాసం ఏర్పడింది, తిరిగి వినిపించే అభ్యాసము ఏర్పడలేదు. స్మృతిలో ఉన్నట్లయితే ధారణ కూడా జరుగుతుంది. బ్రాహ్మణి వెళ్ళినా మేము సెంటరును సంభాళిస్తాము అని చెప్పేటటువంటివారు కూడా సెంటరులో ఉండాలి. సేవార్థం బాబా బ్రాహ్మణిని ఇంకొక మంచి సెంటరుకు పంపిస్తారు, అప్పుడు బ్రాహ్మణి లేకపోతే తికమకపడకూడదు. బ్రాహ్మణిలా తయారవ్వకపోతే ఇతరులను మీ సమానంగా ఎలా తయారుచేస్తారు, ప్రజలను ఎలా తయారుచేస్తారు. మురళీ అయితే అందరికీ లభిస్తుంది. మేము గద్దెపై కూర్చుని అర్థం చేయించాలని పిల్లలకు సంతోషముండాలి. అభ్యాసము చేస్తే సేవాధారులుగా అయిపోతారు. సేవాధారులుగా అయ్యారా అని బాబా అడుగుతారు. అప్పుడు ఎవ్వరూ రారు. సేవ కోసము శెలవు తీసుకోవాలి. ఎక్కడైనా సేవ కోసం ఆహ్వానము లభిస్తే, శెలవు తీసుకుని అక్కడకు వెళ్ళిపోవాలి. బంధనముక్త పిల్లలుగా ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి సేవను చేయగలరు. ఆ గవర్నమంట్ కన్నా ఈ గవర్నమంట్ సంపాదన చాలా ఉన్నతమైనది. భగవంతుడు చదివిస్తున్నారు, దీని ద్వారా మీరు 21 జన్మలకు వైకుంఠానికి యజమానులుగా అవుతున్నారు. ఇది ఎంత గొప్ప సంపాదన, ఆ సంపాదన ద్వారా ఏమి లభిస్తుంది? అక్కడ అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. ఇక్కడైతే మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎవరికైతే పక్కా నిశ్చయముంటుందో, వారు మేము ఈ సేవలోనే నిమగ్నమైపోతాము అని అంటారు. కానీ పూర్తి నషా ఉండాలి. మేము ఎవరికైనా అర్థం చేయించగలమా అని పరిశీలించుకోవాలి. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. కలియుగాంతములో ఇన్ని కోట్ల మంది మనుష్యులున్నారు కావున సత్యయుగంలో తప్పకుండా చాలా కొద్దిమందే ఉంటారు. దానిని స్థాపించేందుకు తండ్రి తప్పకుండా సంగమయుగములోనే వస్తారు. పాత ప్రపంచము వినాశనం జరగాలి. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనది. భగవంతుడు వచ్చి, సత్యయుగము కోసం రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేసినప్పుడే ఈ యుద్ధం జరుగుతుంది. కర్మాతీత స్థితిని చేరుకునేలా చేస్తారు. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నీ విడిచి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడమే శ్రమ. యోగానికి అర్థము మనుష్యులు ఒక్కరికి కూడా తెలియదు.

భక్తిమార్గము కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తిమార్గము కొనసాగవలసిందే. ఇది ఒక ఆటగా రచించబడి ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. వైరాగ్యము కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులోని వైరాగ్యము, రెండవది అనంతమైన వైరాగ్యము. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం పాత ప్రపంచాన్ని మర్చిపోయే పురుషార్థము చేస్తున్నారు ఎందుకంటే మనమిప్పుడు శివాలయమైన పావన ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీరందరూ సోదరీ-సోదరులు. మీకు వికారీ దృష్టి కలగదు. ఈ రోజుల్లోనైతే అందరి దృష్టి అశుద్ధంగా అయిపోయింది. ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నారు కదా. దీని పేరే నరకము కానీ స్వయాన్ని నరకవాసులుగా భావించరు. స్వయం గురించే తెలియదు కనుక స్వర్గం-నరకం ఇక్కడే ఉన్నాయి అని అంటారు. ఎవరి మనసులోకి ఏది వస్తే అది అనేసారు. ఇదేమీ స్వర్గము కాదు. స్వర్గములోనైతే రాజ్యముండేది. అక్కడ ధర్మయుక్తంగా, సత్యంగా ఉండేవారు. ఎంతటి శక్తి ఉండేది. ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు. విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అయిన శివపరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. కావున పిల్లలకు ఎంతటి నషా ఉండాలి. ఇది పూర్తిగా సహజమైన జ్ఞానము. పిల్లలైన మీలో ఏవైతే పాత అలవాట్లున్నాయో, వాటిని వదిలేయాలి. ఈర్ష్య పడే అలవాటు కూడా చాలా నష్టపరుస్తుంది. మీ ఆధారమంతా మురళీపైనే ఉంది, మీరు ఎవరికైనా మురళీపై అర్థం చేయించవచ్చు. కానీ వీరేమీ బ్రాహ్మణి కాదు, వీరికేమి తెలుసు అని లోలోపల ఈర్ష్య కలుగుతుంది. దానితో వారు మరుసటి రోజు రానే రారు. ఇటువంటి పాత అలవాట్లు ఉంటాయి, వీటి కారణంగా డిస్ సర్వీస్ కూడా జరుగుతుంది. జ్ఞానమైతే చాలా సహజమైనది. కుమారీలకైతే వేరే బాధ్యతలు మొదలైనవి ఉండవు. ఆ చదువు బాగుందా లేక ఈ చదువు బాగుందా అని వారిని అడగడం జరుగుతుంది. అప్పుడు వారు ఇదే చాలా బాగుంది అని చెప్తారు. బాబా, మేమిప్పుడు ఆ చదువును చదవము, దానిపై మనసు లేదు అని అంటారు. లౌకిక తండ్రి జ్ఞానంలో లేకపోతే దెబ్బలు తింటారు. కొంతమంది కుమారీలు బలహీనంగా కూడా ఉంటారు. ఈ చదువు ద్వారా నేను మహారాణిగా అవుతాను, ఆ చదువు ద్వారా ఎందుకూ విలువ లేని ఉద్యోగము ఏమి చేస్తాను అని వారికి అర్థం చేయించాలి కదా. ఈ చదువైతే భవిష్య 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తుంది. ప్రజలు కూడా స్వర్గవాసులుగా అవుతారు కదా. ఇప్పుడు అందరూ నరకవాసులుగానే ఉన్నారు.

మీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, ఇప్పుడు మీరెంత తమోప్రధానంగా అయ్యారు, మెట్లు దిగుతూ వచ్చారు అని బాబా ఇప్పుడు చెప్తున్నారు. బంగారు పిచ్చుక అని పిలవబడే భారత్, ఇప్పుడు రాయి లాగా కూడా లేదు. భారత్ 100 శాతము సంపన్నంగా ఉండేది. ఇప్పుడు 100 శాతము నిరుపేదగా అయిపోయింది. మనము విశ్వానికి యజమానులుగా పారసనాథులుగా ఉండేవారము అని మీకు తెలుసు, ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు రాతినాథులుగా అయిపోయము. ఇరువురూ మనుష్యలే కానీ వారిని పారసనాథులని మరియు వీరిని రాతినాథులని అంటారు. నేను ఎంతవరకు యోగ్యంగా అయ్యాను అని మిమ్మల్ని మీరే చూసుకోండి – అని పాట కూడా విన్నారు. నారదుని ఉదాహరణ ఉంది కదా. రోజు-రోజుకూ పడిపోతూనే ఉంటారు. అలా పడిపోతూ-పడిపోతూ ఒక్కసారిగా ఊబిలో గొంతు వరకు చిక్కుకుపోయారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు అందరినీ పిలకతో పట్టుకుని ఊబి నుండి బయటకు తీస్తారు. మరి పట్టుకునేందుకు ఇంకే స్థానమూ లేదు. కనుక పిలక పట్టుకోవడమే సులభము. ఊబి నుండి బయటకు తీసేందుకు పిలకను పట్టుకోవలసి ఉంటుంది. ఊబిలో ఎంతగా చిక్కుకుపోయారంటే, ఇక చెప్పడానికి వీల్లేదు. ఇది భక్తి రాజ్యము కదా. బాబా, రాజ్యభాగ్యం పొందడానికి కల్పక్రితము కూడా మీ వద్దకు వచ్చాము అని మీరిప్పుడు అంటారు. లక్ష్మీ-నారాయణుల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు కానీ వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో వారికి తెలియదు. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. వీరు రాజ్య-భాగ్యాన్ని ఎలా పొందారో, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. బిర్లా ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. బొమ్మలను తయారుచేసినట్లుగా తయారుచేస్తారు. అవి చిన్న-చిన్న బొమ్మలు, వీరు (బిర్లా) పెద్ద బొమ్మలను తయారుచేస్తారు. చిత్రాలను తయారుచేసి పూజిస్తారు. వారి చరిత్ర గురించి తెలియకపోవడం బొమ్మలను పూజించడం వంటిదే కదా. తండ్రి మనల్ని ఎంత షావుకార్లుగా తయారుచేశారో, మళ్ళీ మనమెంత నిరుపేదలుగా అయిపోయామో మీకిప్పుడు తెలుసు. పూజ్యులుగా ఉన్నవారే, ఇప్పుడు పూజారులుగా అయిపోయారు. భక్తులు భగవంతుడి గురించి మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారు. మీరే సుఖమునిస్తారు, మీరే దుఃఖమునిస్తారు, అంతా మీరే చేస్తారు అని అంటారు. వారు ఇందులోనే నిమగ్నమైపోతారు. ఆత్మ నిర్లేపి, ఏమైనా తినండి త్రాగండి, ఆనందించండి, శరీరానికే అంటుతాయి, అది గంగా స్నానము ద్వారా శుద్ధమైపోతుంది, కావున ఏది కావాలనుకుంటే అది తినండి అని వారు అంటారు. ఎన్నెన్ని ఫ్యాషన్లున్నాయి. ఎవరైనా ఏదైనా ఆచారాన్ని మొదలుపెడితే, అది అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు విషయసాగరము నుండి శివాలయంలోకి వెళ్ళండి అని తండ్రి చెప్తున్నారు. సత్యయుగాన్ని క్షీరసాగరం అని అంటారు. ఇది విషయసాగరము. మనము 84 జన్మలను తీసుకుంటూ పతితులుగా అయ్యామని, అందుకే పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తాము అని మీకు తెలుసు. చిత్రాలపై అర్థం చేయించడం ద్వారా మనుష్యులు సహజంగా అర్థము చేసుకుంటారు. మెట్ల చిత్రములో మొత్తం 84 జన్మల కథ ఉంది. ఇంత సహజమైన విషయము కూడా ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అప్పుడు వీరు పూర్తిగా చదవడం లేదు, ఉన్నతిని చెందడం లేదు అని తండ్రి భావిస్తారు.

భ్రమరము వలె భూ-భూ చేసి పురుగుల వంటివారిని తమ సమానంగా చేయడమే బ్రాహ్మణులైన మీ కర్తవ్యము. మరియు సర్పము వలె పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకోవడమే మీ పురుషార్థము. ఇది పాత కుళ్ళిపోయిన శరీరం, దీనిని విడిచిపెట్టాలి అని మీకు తెలుసు. ఈ ప్రపంచమే పాతదిగా ఉంది. శరీరము కూడా పాతదే. ఇప్పుడు దీనిని వదిలి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచమైన స్వర్గము కోసం ఉంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. సముద్రపు ఒక్క అల ద్వారా అంతా అల్లకల్లోలమైపోతుంది. వినాశనమైతే జరగాల్సిందే కదా. ప్రకృతి వైపరీత్యాలు ఎవ్వరినీ విడిచిపెట్టవు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈర్ష్య మొదలైన పాత అలవాట్లు ఏవైతే లోపలున్నాయో వాటిని వదిలి పరస్పరము చాలా ప్రేమగా కలిసిమెలసి ఉండాలి. ఈర్ష్య కారణంగా చదువును విడిచిపెట్టకూడదు.

2. ఈ కుళ్ళిపోయిన పాత శరీరం యొక్క భానాన్ని వదిలేయాలి. భ్రమరము వలె జ్ఞానాన్ని భూ-భూ చేసి పురుగుల వంటివారిని తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. ఈ ఆత్మిక వ్యాపారములో నిమగ్నమవ్వాలి.

వరదానము:- ఆల్ మైటీ శక్తి యొక్క ఆధారముతో ఆత్మలను సుసంపన్నంగా తయారుచేసే పుణ్యాత్మా భవ

ఏ విధంగా దాన పుణ్యాల శక్తి గల ఒకప్పటి రాజులలో సత్తా (పదవి) యొక్క పూర్తి శక్తి ఉండేది, ఆ శక్తి ఆధారంగా వారు ఎవరినైనా ఏమైనా చేయగలిగేవారు. అదే విధంగా మహాదానీ పుణ్యాత్మలైన మీకు డైరెక్టు తండ్రి ద్వారా ప్రకృతిజీత్, మాయాజీత్ లుగా అయ్యే విశేషమైన శక్తి లభించింది. మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంతో ఎటువంటి ఆత్మనైనా తండ్రితో సంబంధాన్ని జోడింపజేసి వారిని సుసంపన్నంగా చేయగలరు. కేవలం ఈ శక్తిని యథార్థ రీతిగా ఉపయోగించండి.

స్లోగన్:- ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలను జరుపుకుంటారో అప్పుడు సమయం, ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *