Telugu Murli 27/07/20

27-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – మీపై మీరే దయ చూపించుకోండి, తండ్రి ఏదైతే శ్రీమతము ఇస్తారో దానిపై నడుస్తూ ఉండండి, తండ్రి యొక్క శ్రీమతము – పిల్లలూ, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, మంచి కార్యాలే చేయండి”

ప్రశ్న:- భాగ్యశాలి పిల్లల ముఖ్యమైన ధారణ ఏమిటి?

జవాబు:- భాగ్యశాలి పిల్లలు ఉదయము-ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడుతారు. ఎప్పుడూ స్వయం పట్ల నిర్దయులుగా ఉండరు. వారు పాస్ విత్ హానర్ గా అయ్యే పురుషార్థము చేసి స్వయాన్ని రాజ్యానికి అర్హులుగా తయారుచేసుకుంటారు.

ఓంశాంతి. పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చున్నప్పుడు, వీరు మా అనంతమైన తండ్రి మరియు మాకు అనంతమైన సుఖమునిచ్చేందుకు శ్రీమతమునిస్తున్నారని పిల్లలకు తెలుసు. వారి కోసమే దయాహృదయుడు, ముక్తిదాత….. అన్న గాయనం ఉంది. వారిని ఎంతో మహిమ చేస్తారు. తండ్రి చెప్తున్నారు – కేవలం మహిమ విషయమే కాదు, పిల్లలకు మతమునివ్వడం తండ్రి బాధ్యత. అలాగే అనంతమైన తండ్రి కూడా మతమునిస్తున్నారు. వారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి కనుక వారి మతము కూడా తప్పకుండా ఉన్నతాతి ఉన్నతంగానే ఉంటుంది. ఆత్మనే మతాన్ని తీసుకుంటుంది, మంచి లేక చెడు కర్మలను ఆత్మనే చేస్తుంది. ఈ సమయంలో ప్రపంచానికి రావణుని మతము లభిస్తుంది. పిల్లలైన మీకు రాముని మతము లభిస్తుంది. రావణుని మతము వలన నిర్దయులుగా అయ్యి తప్పుడు పనులు చేస్తారు. సరైన మంచి కార్యాలే చేయండి అని తండ్రి మతమునిస్తున్నారు. తమపై తాము దయ చూపించుకోవడం అన్నిటికంటే మంచి కార్యము. ఆత్మలైన మీరు సతోప్రధానంగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు, మళ్ళీ రావణుని మతము లభించడంతో తమోప్రధానంగా అయిపోయారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మతమునిస్తున్నారు – ఒకటి, తండ్రి స్మృతిలో ఉండండి. ఇప్పుడు మీపై మీరు దయ చూపించుకోండి అని మతమునిస్తున్నారు. తండ్రి దయ చూపించరు, ఇలా-ఇలా చేయండి అని తండ్రి శ్రీమతమునిస్తారు. మీపై మీరే దయ చూపుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, పతిత-పావనుడైన మీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. మీరు పావనంగా ఎలా అవుతారు అన్న సలహాను తండ్రి ఇస్తారు. తండ్రినే పతితులను పావనంగా తయారుచేసేవారు. వారు శ్రీమతమునిస్తారు. ఒకవేళ వారి మతంపై నడుచుకోకపోతే మీపట్ల మీరే నిర్దయులుగా అవుతారు. పిల్లలూ, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని తండ్రి శ్రీమతమునిస్తున్నారు. నేను ఒక ఆత్మను అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి, కానీ సమయం తీసి యుక్తులను రచించండి. కర్మలు చేస్తూ కూడా ఆత్మ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. ఏ విధంగా ప్రేయసీ-ప్రియులు కూడా పనులు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ అలా లేదు. మీరు భక్తిమార్గములో కూడా స్మృతి చేస్తారు. ఏ విధంగా స్మృతి చేయాలి, స్మృతి చేయడానికి ఆత్మ, పరమాత్మల రూపము ఏమిటి అని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే పరమాత్మ నామ-రూపాలకు అతీతమైనవారు అని భక్తి మార్గములో గాయనం చేయబడింది కానీ అలా కాదు. ఆత్మ భృకుటి మధ్యలో నక్షత్రంలా ఉంటుంది అని కూడా అంటారు, మరి ఆత్మ అంటే ఏమిటి అని మళ్ళీ ఎందుకు అంటారు. ఆత్మను చూడలేరు, అది తెలుసుకునేటటువంటిది. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది. మిణుగురు పురుగు కంటే కూడా సూక్ష్మమైనది. శరీరము నుండి ఎలా వెళ్ళిపోతుందో తెలియనే తెలియదు. ఆత్మ ఉన్నది, అది సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం జరిగితే లాభమేముంటుంది. అది నక్షత్రము వలె సూక్ష్మమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ విధంగా ఆత్మ ఉంటుందో, అలాగే పరమాత్మ కూడా ఆత్మనే. కానీ పరమాత్మను సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు జనన-మరణాలలోకి రారు. ఆత్మ జనన-మరణ రహితంగా ఉన్నప్పుడే సుప్రీమ్ అని అనడం జరుగుతుంది. ముక్తిధామానికైతే అందరూ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. హీరో – హీరోయిన్ల పాత్రలో ఉన్నవారు కూడా నంబరువారుగా ఉంటారు. ఆత్మలు నంబరువారుగా ఉంటాయి కదా. నాటకంలో కూడా కొందరు ఎక్కువ జీతము కలవారు, కొందరు తక్కువ జీతము కలవారు ఉంటారు. లక్ష్మీ-నారాయణుల ఆత్మలను మనుష్యాత్మలలో సుప్రీమ్ అని అంటారు. పవిత్రంగా అయితే అందరూ అవుతారు కానీ పాత్ర నంబరువారుగా ఉంటుంది. కొందరు మహారాజులు, కొందరు దాసీలు, కొందరు ప్రజలుగా అవుతారు. మీరు పాత్రధారులు. ఇంతమంది దేవతలందరూ నంబరువారుగా ఉన్నారని మీకు తెలుసు. మంచి పురుషార్థము చేస్తే, ఉన్నతమైన ఆత్మగా అవుతారు, ఉన్నత పదవిని పొందుతారు. మనం 84 జన్మలు ఎలా తీసుకున్నామో మీకు స్మృతి కలిగింది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి. పిల్లలకు ఈ సంతోషం కూడా ఉంది, అలాగే నషా కూడా ఉంది. మేము నరుని నుండి నారాయణునిగా, విశ్వానికి యజమానులుగా అవుతాము అని అందరూ అంటారు. మరి అటువంటి పురుషార్థము చేయవలసి ఉంటుంది. పురుషార్థానుసారంగా నంబరువారు పదవిని పొందుతారు. అందరికీ నంబరువారుగా పాత్ర లభించింది. ఇది రచింపబడియున్న డ్రామా.

ఇప్పుడు తండ్రి మీకు శ్రేష్ఠమైన మతానిస్తున్నారు. ఎలాగైనాసరే తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనము అవుతాయి, అప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు. తలపై పాపాల భారము చాలా ఉంది. ఎలాగైనా దానిని ఇక్కడే సమాప్తం చేయాలి, అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మలైన మీరే తమోప్రధానంగా అయ్యారు కనుక సతోప్రధానంగా కూడా ఆత్మనే అవ్వాలి. ఈ సమయంలో భారత్ చాలా నిరుపేదగా ఉంది. ఈ ఆట భారత్ పైనే ఉంది. మిగిలినవారంతా కేవలం ధర్మస్థాపన చేయడానికి వస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ చివర్లో అందరూ తమోప్రధానంగా అవుతారు. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. భారత్ చాలా ఉన్నతమైన దేశంగా ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది, పేదవారికే అందరూ సహాయము చేస్తారు. ప్రతి విషయములోనూ భిక్ష అడుగుతూనే ఉంది. ఒకప్పుడు ఇక్కడి నుండే చాలా ధాన్యము వెళ్ళేది. ఇప్పుడు పేదదిగా అయిపోయింది కనుక రిటర్న్ సర్వీసు జరుగుతుంది. ఏదైతే తీసుకువెళ్ళారో, అది అప్పుగా లభిస్తుంది. కృష్ణుడు మరియు క్రిస్టియన్ల రాశి ఒక్కటే. క్రిస్టియన్లే భారత్ ను మింగేశారు. ఇప్పుడు మళ్ళీ డ్రామానుసారంగా వారు పరస్పరములో కొట్లాడుకుంటారు, పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది. అంతేకానీ కృష్ణుని నోటిలో వెన్న ఉండేదని కాదు. శాస్త్రాలలో అలా వ్రాసేశారు. మొత్తం ప్రపంచం కృష్ణుని చేతిలోకి వచ్చేస్తుంది. మొత్తం విశ్వానికి మీరు యజమానులుగా అవుతారు. మనము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. మీ అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయి. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణుల రాజ్యమే కాదు, వారి వంశము ఉండేది కదా. యథా రాజా-రాణి తథా ప్రజా – అందరి పాదాలలో పదమాలు ఉంటాయి. అక్కడ లెక్కలేనంత ధనముంటుంది. ధనము కోసం పాపాలు మొదలైనవేవీ చేయరు, లెక్కలేనంత ధనముంటుంది. అల్లాహ్ అవల్దీన్ ఆటను చూపిస్తారు కదా. అల్లాహ్ అవల్దీన్ అనగా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసేవారు. క్షణంలో జీవన్ముక్తినిస్తారు. క్షణంలో సాక్షాత్కారము జరుగుతుంది. అపారమైన ఖజానాను చూపిస్తారు. మీరా సాక్షాత్కారములో కృష్ణునితో నాట్యం చేసేవారు. అది భక్తిమార్గము. ఇక్కడ భక్తిమార్గము యొక్క విషయం కాదు. మీరు ప్రాక్టికల్ గా వైకుంఠానికి వెళ్ళి రాజ్య-భాగ్యాన్ని పొందుతారు. భక్తిమార్గములో కేవలం సాక్షాత్కారాలు జరుగుతాయి. ఈ సమయంలో పిల్లలైన మీకు లక్ష్యము, ఉద్దేశ్యము సాక్షాత్కారం జరుగుతుంది, మేము ఈ విధంగా అవుతామని మీకు తెలుసు. పిల్లలు మర్చిపోతారు, అందుకే బ్యాడ్జ్ లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాము. ఎంత సంతోషముండాలి. ఇది క్షణ-క్షణము పక్కా చేసుకోవాలి. కానీ మాయ అపోజిషన్ లో ఉండడంతో ఆ సంతోషం కూడా ఎగిరిపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు అన్న నషా ఉంటుంది. కానీ మాయ మరిపింపజేస్తుంది, అప్పుడు మళ్ళీ ఏదో ఒక వికర్మ జరుగుతుంది. మేము 84 జన్మలు తీసుకున్నాము అని పిల్లలైన మీకు స్మృతి కలిగింది, ఇంకెవ్వరూ 84 జన్మలు తీసుకోరు. మనము ఎంతగా స్మృతి చేస్తామో, అంత ఉనతమైన పదవిని పొందుతాము అని కూడా అర్థము చేసుకోవాలి, అంతేకాక తమ సమానంగా కూడా తయారుచేయాలి, ప్రజలను తయారుచేయాలి. దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. తీర్థ యాత్రలకు కూడా మొదట స్వయం వెళ్తారు, తర్వాత మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరినీ కూడా తీసుకువెళ్తారు. కావున మీరు కూడా ప్రేమగా అందరికీ అర్థము చేయించండి. అందరూ అర్థము చేసుకోరు. ఒకే ఇంటిలో తండ్రి అర్థము చేసుకుంటే కొడుకు అర్థము చేసుకోడు. పాత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకండి అని తల్లి-తండ్రులు పిల్లలకు ఎంతగా చెప్పినా కూడా ఒప్పుకోరు. విసిగించేస్తారు. ఇక్కడి అంటుగా ఎవరైతే ఉంటారో, వారే వచ్చి మళ్ళీ అర్థము చేసుకుంటారు. ఈ ధర్మస్థాపన ఎలా జరుగుతుందో చూడండి, ఇతర ధర్మాలలో అంటుకట్టడం అనేది ఉండదు. వారు పై నుండి వస్తారు. వారి అనుచరులు కూడా వస్తూ ఉంటారు. తండ్రి స్థాపన చేస్తారు, ఆ తర్వాత అందరినీ పావనంగా చేసి తీసుకువెళ్తారు, అందుకే వారిని సద్గురువు, ముక్తిదాత అని అంటారు. సత్యమైన గురువు ఒక్కరే. మనుష్యులు ఎప్పుడూ ఎవ్వరికీ సద్గతి చేయరు. సద్గతిదాత ఒక్కరే, వారినే సద్గురువు అని అంటారు. భారత్ ను కూడా వారే సత్యఖండంగా తయారుచేస్తారు. రావణుడు అసత్య ఖండంగా తయారుచేస్తాడు. తండ్రి గురించి కూడా అసత్యమే చెప్తారు, దేవతల గురించి కూడా అసత్యమే చెప్తారు. అందుకే చెడు వినవద్దు అని తండ్రి చెప్తారు….. దీనిని వేశ్యాలయము అని అంటారు. సత్యయుగము శివాలయము. మనుష్యులేమీ అర్థము చేసుకోరు. వారు తమ మతము పైనే నడుచుకుంటారు. ఎంతగా గొడవలు-కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు తల్లిని, పతి స్త్రీని కొట్టడానికి కూడా వెనుకాడరు. ఒకరినొకరు హత్య చేసుకుంటూ ఉంటారు. తండ్రి వద్ద చాలా ధనము ఉంది, కానీ ఇవ్వడం లేదు అని కొడుకు గమనిస్తే హత్య చేయడానికి కూడా ఆలస్యము చేయడు. ఎంత అశుద్ధమైన ప్రపంచము. మీరిప్పుడు ఏ విధంగా అవుతున్నారు. మీ లక్ష్యము ఉద్దేశ్యం నిలబడి ఉంది. మీరు కేవలం, ఓ పతిత-పావనా, వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని పిలిచేవారు, విశ్వానికి యజమానులుగా తయారుచేయండి అని అనేవారు కాదు. గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్ని స్థాపన చేస్తారు, మరి మనమెందుకు స్వర్గములో లేము. మళ్ళీ రావణుడు మిమ్మల్ని నరకవాసులుగా చేస్తాడు. కల్పం ఆయుష్షు లక్షల సంవత్సరాలు అని అనడంతో మర్చిపోయారు. మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ చక్రం తిరిగి నరకానికి యజమానులుగా అయ్యారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారు. మధురమైన ఆత్మలూ, పిల్లలూ, తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. తమోప్రధానంగా అవ్వడానికి అర్థకల్పము పట్టింది, లేక మొత్తం కల్పం అని కూడా అనవచ్చు ఎందుకంటే కళలైతే తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయంలో ఏ కళలూ లేవు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని అంటారు, దీని అర్థము ఎంత స్పష్టంగా ఉంది. ఇక్కడ నిర్గుణ బాలకుల సంస్థ కూడా ఉంది, అంటే పిల్లల్లో ఏ గుణమూ లేదు అని అర్థం. కానీ పిల్లలను మహాత్ముల కంటే ఉన్నతమైనవారని అంటారు, వారికి వికారాల గురించే తెలియదు. మహాత్ములకు వికారాల గురించి తెలుసు కనుక చాలా తప్పుడు పదాలు మాట్లాడుతారు. మాయ పూర్తిగా అధర్మయుక్తంగా చేస్తుంది. గీతను కూడా చదువుతారు, భగవానువాచ – కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది అని కూడా అంటారు, అయినా పవిత్రంగా అవ్వడంలో ఎన్నో విఘ్నాలు కలిగిస్తారు. కొడుకు వివాహము చేసుకోకపోతే ఎంత గొడవ చేస్తారు. పిల్లలైన మీరు శ్రీమతంపై నడవాలి అని తండ్రి చెప్తున్నారు. ఎవరైతే పుష్పాలుగా అవ్వరో, ఎంతగా అర్థము చేయించినా ఎప్పుడూ అంగీకరించరు. కొన్ని చోట్ల మేము వివాహము చేసుకోము అని పిల్లలు అంటే తల్లి-తండ్రులు ఎంతగా శిక్షిస్తారు.

జ్ఞాన యజ్ఞము రచించినప్పుడు అనేక రకాల విఘ్నాలు వస్తాయి అని తండ్రి చెప్తున్నారు. మూడు అడుగుల నేలను కూడా ఇవ్వరు. మీరు కేవలం తండ్రి మతానుసారముగా స్మృతి చేసి పవిత్రంగా అవుతారు, ఇంకెటువంటి కష్టమూ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ విధంగా ఆత్మలైన మీరు ఈ శరీరములో అవతరిస్తారో, అదే విధంగా తండ్రి కూడా అవతరిస్తారు. మరి కూర్మావతారము, మత్స్యావతారము ఎలా అవుతాయి! ఎంతగా నిందిస్తారు! కణ-కణములో భగవంతుడు ఉన్నారని అంటారు. నన్ను మరియు దేవతలను నిందిస్తారు అని తండ్రి చెప్తున్నారు. నేను రావలసి వస్తుంది, వచ్చి పిల్లలైన మీకు మళ్ళీ వారసత్వాన్నిస్తాను. నేను వారసత్వాన్నిస్తాను, రావణుడు శాపమునిస్తాడు. ఇది ఆట. ఎవరైతే శ్రీమతంపై నడవరో, వారి భాగ్యం అంత ఉన్నతంగా లేదు అని అర్థం చేసుకోబడుతుంది. భాగ్యశాలి పిల్లలు ఉదయము-ఉదయమే లేచి స్మృతి చేస్తారు, బాబాతో మాట్లాడుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. ఎవరైతే పాస్ విత్ ఆనర్ గా అవుతారో వారే రాజ్యానికి యోగ్యులుగా అవ్వగలరు. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులు మాత్రమే రాజ్యం చేయరు, వారి వంశముంటుంది. ఇప్పుడు మీరెంత స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతున్నారు అని తండ్రి చెప్తున్నారు. దీనిని సత్సంగము అని అంటారు. సత్సంగము ఒక్కటే ఉంటుంది. తండ్రి సత్యాతి-సత్యమైన జ్ఞానాన్నిచ్చి సత్య ఖండానికి యజమానులుగా తయారుచేస్తారు. కల్పం యొక్క సంగమంలోనే సత్యమైన సాంగత్యం లభిస్తుంది. స్వర్గములో ఏ రకమైన సత్సంగము ఉండదు.

ఇప్పుడు మీరు ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ. మీరు విశ్వం అనే నావను తీరానికి చేరుస్తారు. మీకు ముక్తినిచ్చేవారు, శ్రీమతానిచ్చేవారు తండ్రి. మీ మహిమ చాలా గొప్పది. తండ్రి మహిమ, భారత్ మహిమ అపారమైనది. పిల్లలైన మీ మహిమ కూడా అపారమైనది. మీరు బ్రహ్మాండానికి మరియు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికి యజమానిగా అవుతాను. మీకే డబల్ పూజ జరుగుతుంది. డబల్ పూజ జరిగేందుకు నేను దేవతగా అవ్వను. మీలో కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు మరియు సంతోషంగా పురుషార్థము చేస్తారు. చదువులో ఎంత తేడా ఉంది. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యము నడుస్తుంది. అక్కడ మంత్రి ఉండరు. ఏ లక్ష్మీ-నారాయణులనైతే, భగవాన్-భగవతి అని అంటారో, వారు మళ్ళీ మంత్రి సలహాను తీసుకుంటారా! రాజులు పతితంగా అయినప్పుడు మళ్ళీ మంత్రులు మొదలైనవారిని పెట్టుకుంటారు. ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యం ఉన్నది. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. జ్ఞానం, భక్తి, వైరాగ్యము. జ్ఞానాన్ని కేవలం ఆత్మిక తండ్రి నేర్పిస్తారు, ఇంకెవ్వరూ నేర్పించలేరు. తండ్రియే పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతితో పాటు తమ సమానంగా తయారుచేసే సేవను కూడా చేయాలి. దానం ఇంటి నుండి ప్రారంభమౌతుంది….. అందరికీ ప్రేమగా అర్థము చేయించాలి.

2. ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యం కలవారిగా అవ్వాలి. చెడు వినవద్దు, చెడు చూడవద్దు…. ఆ అనంతమైన తండ్రికి పిల్లలము, వారు మనకు అపారమైన ఖజానాను ఇస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి.

వరదానము:- ఒక్క క్షణపు ఆట ద్వారా మొత్తం కల్పానికి భాగ్యాన్ని తయారుచేసుకునే శ్రేష్ఠ భాగ్యశాలీ భవ

ఈ సంగమ సమయానికి, ఏది కావాలంటే అది, ఎలా కావాలనుకుంటే అలా, ఎంత కావాలనుకుంటే అంత భాగ్యాన్ని తయారుచేసుకోగల వరదానం లభించింది, ఎందుకంటే భాగ్యవిధాత అయిన తండ్రి భాగ్యం తయారుచేసుకునే తాళంచెవిని పిల్లల చేతికిచ్చేసారు. లాస్ట్ లో ఉన్నవారు కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ రావచ్చు. కేవలం సేవల విస్తారంలో, సెకండులో స్వస్థితిని సారస్వరూపంగా చేసుకునే అభ్యాసము చేయండి. ఇప్పటికిప్పుడే ఒక సెకండులో మాస్టర్ బీజరూపులుగా అవ్వండి అని డైరెక్షన్ లభిస్తే, సమయం పట్టకూడదు. ఈ ఒక్క సెకండు ఆట ద్వారా మొత్తం కల్పానికి భాగ్యాన్ని తయారుచేసుకోవచ్చు.

స్లోగన్:- డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసినట్లయితే ప్రకృతి దాసీగా అయిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *