Telugu Murli 29/07/20

29-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మొట్టమొదట అందరికీ తండ్రి యొక్క యథార్థ పరిచయాన్నిచ్చి గీతా భగవంతుడిని నిరూపించండి, అప్పుడు మీ పేరు ప్రసిద్ధమౌతుంది”

ప్రశ్న:- పిల్లలైన మీరు 4 యుగాల చక్రమును తిరిగినందుకు గుర్తుగా భక్తిలో ఏ ఆచారం నడుస్తుంది, అది ఏమిటి?

జవాబు:- మీరు నాలుగు యుగాల చక్రములో తిరిగారు, దీనికి వారు శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటినన్నిటినీ రథంలో పెట్టి నలువైపులా తిప్పుతారు. తర్వాత ఇంటికొచ్చి పడుకోబెడతారు. మీరు బ్రాహ్మణులుగా, దేవతలుగా, క్షత్రియులుగా….. అవుతారు. ఈ చక్రానికి బదులుగా వారు ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఇది కూడా ఒక ఆచారం.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఎప్పుడైనా ఎవరికైనా అర్థము చేయించేటప్పుడు తండ్రి ఒక్కరే అని మొదట స్పష్టము చేయండి, తండ్రి ఒక్కరా లేక అనేకమందా అని అడగకండి. అలా అడిగితే మళ్ళీ అనేకమంది అని చెప్తారు. తండ్రి, రచయిత, గాడ్ ఫాదర్ ఒక్కరే అని చెప్పాల్సిందే. వారు ఆత్మలందరికీ తండ్రి. వారు బిందువు అని మొట్టమొదటే చెప్పకూడదు, అలా చెప్తే తికమకపడిపోతారు. లౌకిక మరియు పారలౌకిక – ఇద్దరు తండ్రులున్నారని మొట్టమొదట ఇది మంచి రీతిగా అర్థం చేయించండి. లౌకిక తండ్రి అయితే ప్రతి ఒక్కరికీ ఉంటారు కానీ ఆ తండ్రిని కొందరు ఖుదా అని, కొందరు గాడ్ అని పిలుస్తారు. వారు ఒక్కరే. అందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. తండ్రి స్వర్గాన్ని రచించేవారని మొట్టమొదట ఇది పక్కాగా నిశ్చయము కలిగించాలి. వారు ఇక్కడకు స్వర్గానికి యజమానులుగా తయారుచేసేందుకు వస్తారు, దీనినే శివజయంతి అని కూడా అంటారు. స్వర్గ రచయిత భారత్ లోనే స్వర్గాన్ని రచిస్తారని, అందులో దేవీ-దేవతల రాజ్యమే ఉంటుందని కూడా పిల్లలైన మీకు తెలుసు. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. వారి పేరు శివ. గీతలో భగవానువాచ అని ఉంది కదా. మొట్టమొదట ఇది నిశ్చయము కలిగించి వ్రాయించాలి. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అనగా నరుని నుండి నారాయణునిగా చేస్తాను అని గీతలో భగవానువాచ ఉంది. ఆ విధంగా ఎవరు చేయగలరు? ఇది తప్పకుండా అర్థం చేయించాలి. భగవంతుడు ఎవరు అన్నది కూడా తప్పకుండా అర్థము చేయించడం జరుగుతుంది. సత్యయుగంలో మొదటి నంబరులో ఉన్న లక్ష్మీ-నారాయణులే తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు. ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. వారికిన్ని జన్మలుండవు. మొదట వచ్చే వారికి మాత్రమే 84 జన్మలుంటాయి. సత్యయుగంలో ఏమీ నేర్చుకోరు. తప్పకుండా సంగమంలోనే నేర్చుకుంటూ ఉంటారు. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వాలి. ఏ విధంగా అయితే ఆత్మ కనిపించదు కానీ అర్థం చేసుకోగలమో, అదే విధంగా పరమాత్మను కూడా చూడలేము. వారు ఆత్మలైన మనకు తండ్రి అని బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటాము. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారు సదా పావనంగా ఉంటారు. వారు వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా చేయవలసి ఉంటుంది. కనుక తండ్రి ఒక్కరే అని మొదట ఇది నిరూపించి చెప్పడం ద్వారా గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అనేది కూడా నిరూపించబడుతుంది. ఒక్క తండ్రినే ట్రూత్ (సత్యము) అని అంటారు అని పిల్లలైన మీరు నిరూపించి తెలియజేయాలి. మిగిలిన ఈ కర్మకాండలు లేదా తీర్థ స్థానాలు మొదలైన విషయాలన్నీ భక్తిమార్గపు శాస్త్రాలలో ఉన్నాయి. జ్ఞానములో వీటి వర్ణనే లేదు. ఇక్కడ శాస్త్రాలేవీ లేవు. తండ్రి వచ్చి రహస్యాలన్నీ అర్థము చేయిస్తారు. ఒక్క నిరాకారుడే భగవంతుడు, సాకారుడు కారు అనే విషయంపై మొట్టమొదట పిల్లలైన మీరు విజయాన్ని పొందుతారు. పరమపిత పరమాత్మ శివ భగవానువాచ, వారు జ్ఞానసాగరుడు, వారే అందరికీ తండ్రి. శ్రీ కృష్ణుడు అందరికీ తండ్రి కాలేరు, దేహం యొక్క ధర్మాలన్నిటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారు ఎవ్వరికీ చెప్పలేరు. ఇది చాలా సహజమైన విషయము. కానీ మనుష్యులు శాస్త్రాలు మొదలైనవి చదివి, భక్తిలో పక్కా అయిపోయారు. ఈ రోజుల్లో శాస్త్రాలు మొదలైనవాటిని రథంలో పెట్టి ప్రదక్షిణ చేయిస్తారు. చిత్రాలను, గ్రంథాలను కూడా ప్రదక్షిణ చేయిస్తారు, ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతారు. మనము దేవతల నుండి క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని, ఈ చక్రములో తిరగుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. చక్రానికి బదులుగా వారు ప్రదక్షిణ చేయించి ఇంటికి తీసుకొచ్చి పెడతారు. వారు ప్రదక్షిణ చేయించడానికి ఒక రోజును నిర్ణయించుకుంటారు. శ్రీ కృష్ణ భగవానువాచ కాదు, శివభగవానువాచ అని మొట్టమొదట ఈ విషయం నిరూపించి చెప్పాలి. శివుడే పునర్జన్మ రహితుడు. వారు తప్పకుండా వస్తారు, కానీ వారిది దివ్య జన్మ. భగీరథుడిపై వచ్చి స్వారీ చేస్తారు. వారు వచ్చి పతితులను పావనంగా చేస్తారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థము చేయిస్తారు, ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. స్వయంగా తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి పరిచయమే ముఖ్యమైన విషయము. వారే గీతా భగవంతుడు అని మీరు నిరూపించి చెప్పినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. కనుక ఇటువంటి కరపత్రాలు తయారుచేసి అందులో చిత్రాలు మొదలైనవి కూడా ముద్రించి, విమానము నుండి క్రిందికి వేయాలి. తండ్రి చాలా ముఖ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ముఖ్యంగా ఒక్క విషయములో విజయము పొందితే చాలు, మీరు విజయం పొందినట్లే. ఇందులో మీ పేరు చాలా ప్రసిద్ధి చెందింది, ఇందులో ఎవ్వరూ గొడవ చేయరు. ఇది చాలా స్పష్టమైన విషయము. నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను అని తండ్రి అంటారు. నేను వచ్చి పిల్లలకు జ్ఞానము వినిపిస్తాను. మీరు వచ్చి పావనంగా తయారుచేయండి, రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపించండి అని పిలుస్తారు కూడా. తండ్రి మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. అలాగని శివబాబా వచ్చి కృష్ణుడిగా లేక నారాయణుడిగా అవుతారు, 84 జన్మలలోకి వస్తారు అని కాదు. ఈ విషయాలను అర్థం చేయించడంలోనే మీ బుద్ధి పూర్తిగా నిమగ్నమై ఉండాలి. గీతయే ముఖ్యమైనది. భగవానువాచ అన్నప్పుడు తప్పకుండా భగవంతుడికి నోరు కావాలి కదా. భగవంతుడు నిరాకారుడు. ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడగలదు. అందుకే నేను సాధారణ తనువును ఆధారంగా తీసుకుంటాను అని చెప్తారు. ఎవరైతే మొట్టమొదట లక్ష్మీ-నారాయణులుగా అవుతారో, వారే 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అంతిమంలోకి వస్తారు, అప్పుడు వారి శరీరంలోకే వస్తారు. కృష్ణుని అనేక జన్మల అంతిమంలో వస్తారు. ఎవరికి ఎలా అర్థము చేయించాలి అని ఈ విధంగా విచార సాగర మథనము చేయండి. ఈ ఒక్క విషయము ద్వారానే మీ పేరు ప్రసిద్ధమవుతుంది. రచయిత అయిన తండ్రి గురించి అందరికీ తెలుస్తుంది. అప్పుడు మీ వద్దకు చాలామంది వస్తారు. ఇక్కడకు వచ్చి భాషణ చేయండి అని మిమ్మల్ని పిలుస్తారు కావున మొట్టమొదట అల్ఫ్ (తండ్రిని) నిరూపించి అర్థము చేయించండి. బాబా ద్వారా మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత భారత్ లోనే భాగ్యశాలీ రథములో వస్తారు. భగవంతుడు వచ్చి కూర్చున్నటువంటి రథం సౌభాగ్యశాలి రథం. ఇదేమైనా చిన్న విషయమా. నేను అనేక జన్మల అంతిమంలో వీరిలో ప్రవేశిస్తాను అని భగవంతుడు వీరిలో కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. శ్రీకృష్ణుని ఆత్మ యొక్క రథం కదా. వారు స్వయం కృష్ణుడు కాదు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ప్రతి జన్మలో ముఖకవళికలు, కర్తవ్యాలు మొదలైనవి మారుతూ ఉంటాయి. అనేక జన్మల అంతిమంలో ఎవరిలోనైతే ప్రవేశిస్తానో, వారు మళ్ళీ కృష్ణుడిగా అవుతారు. సంగమయుగములోనే వస్తారు. మనము కూడా తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాము. తండ్రి చదివించి తమతో పాటు తీసుకువెళ్తారు, ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. కనుక ఈ విషయాన్ని ఏ విధంగా వ్రాయాలి అని బాగా ఆలోచించాలి. ఈ ముఖ్యమైన పొరపాటు కారణంగానే భారత్ అసత్యంగా, అధర్మయుక్తంగా, నిరుపేదగా అయిపోయింది. తండ్రి మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భారత్ ను ధర్మయుక్తంగా, సంపన్నంగా తయారుచేస్తారు. మొత్తం ప్రపంచాన్ని ధర్మయుక్తంగా చేస్తారు. ఆ సమయములో మొత్తం విశ్వానికి మీరే యజమానులు. విష్ యూ లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీ (మీరు దీర్ఘాయుష్షువంతులుగా మరియు సంపన్నంగా జీవించాలని ఆశిస్తున్నాను) – అని అంటారు కదా. సదా జీవిస్తూ ఉండండి అని తండ్రి ఆశీర్వాదాన్ని ఇవ్వరు. అమరులుగా ఉండండి అని ఈ సాధువులు అంటారు. అమరపురిలో మాత్రమే అమరులుగా ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. మృత్యులోకంలో అమరులు అని ఎలా అంటారు. పిల్లలు మీటింగులు మొదలైనవి చేసినప్పుడు తండ్రిని సలహా అడుగుతారు. అందరూ తమ-తమ సలహాలను వ్రాసి పంపండి, ఆ తర్వాత కలిసి మాట్లాడవచ్చు అని బాబా అడ్వాన్సుగా సలహానిస్తారు. సలహాను మురళీలో వ్రాయడం వలన అందరి వద్దకు చేరుకుంటుంది. 2-3 వేల రూపాయల ఖర్చు మిగులుతుంది. ఈ 2-3 వేలతో, 2-3 సెంటర్లను తెరవచ్చు. చిత్రాలు మొదలైనవి తీసుకుని గ్రామ-గ్రామానికి వెళ్ళాలి.

సూక్ష్మవతనము విషయాలలో పిల్లలైన మీకు ఎక్కువగా ఆసక్తి ఉండకూడదు. బ్రహ్మా, విష్ణు, శంకరుడు మొదలైనవారి చిత్రాలు ఉన్నాయి కనుక వాటిపై కొద్దిగా అర్థము చేయించడం జరుగుతుంది. మధ్యలో వీరి పాత్ర కొద్దిగా ఉంటుంది. మీరు వెళ్తారు, కలుస్తారు, ఇది తప్ప ఇంకేమీ లేదు కనుక ఇందులో ఎక్కువగా ఆసక్తిని చూపించకూడదు. ఇక్కడ ఆత్మను పిలవడం జరుగుతుంది, వారికి చూపిస్తారు. కొందరు వచ్చి ఏడుస్తారు కూడా. కొందరు ప్రేమగా కలుస్తారు. కొందరు దుఃఖముతో కన్నీరు కారుస్తారు. ఇదంతా డ్రామాలో ఉన్న పాత్ర, దీన్ని చిట్ చాట్ అని అంటారు. వారు బ్రాహ్మణులలోకి ఎవరి ఆత్మనైనా పిలుస్తారు, ఆ తర్వాత వారికి బట్టలు మొదలైనవి ధరింపజేస్తారు. ఇప్పుడు ఆ శరీరము సమాప్తమైపోయింది, ఇక ఎవరు ధరిస్తారు? మీ వద్ద ఆ ఆచారం లేదు. ఏడ్వడం మొదలైనవాటి విషయమే లేదు. కనుక ఉన్నతాతి ఉన్నతంగా తయారవ్వాలి, మరి ఎలా అవ్వాలి. తప్పకుండా మధ్యలో సంగమయుగం ఉన్నప్పుడే పవిత్రంగా అవుతారు. మీరు ఒక్క విషయాన్ని నిరూపించినా వీరు పూర్తిగా సత్యమే చెప్తున్నారని అంటారు. భగవంతుడు ఎప్పుడూ అసత్యము చెప్పరు. అప్పుడు చాలా మందికి ప్రేమ కూడా కలుగుతుంది, చాలా మంది వస్తారు. సమయానుసారముగా పిల్లలకు అన్ని పాయింట్లు కూడా లభిస్తూ ఉంటాయి. అంతిమంలో ఏమేమి జరగాల్సి ఉందో, అది కూడా చూస్తారు. యుద్ధము జరుగుతుంది, బాంబులు వేస్తారు. మొదట మృత్యువు అటువైపు ఉంటుంది. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహించాలి, ఆ తర్వాత నేతి-పాల నదులు ప్రవహిస్తాయి. మొట్టమొదట విదేశాల నుంది పొగ వెలువడుతుంది. భయము కూడా అక్కడే ఉంటుంది. ఎంతో పెద్ద-పెద్ద బాంబులు తయారుచేస్తారు. అందులో ఏమేమి వేస్తారంటే, అవి పట్టణాలను ఒక్కసారిగా సమాప్తం చేసేస్తాయి. స్వర్గ రాజ్యాన్ని ఎవరు స్థాపన చేస్తారో కూడా తెలియజేయాలి. స్వర్గ రచయిత తప్పకుండా సంగమంలోనే వస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగము అని మీకు తెలుసు. తండ్రి స్మృతియే ముఖ్యమైన విషయం అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది, దాని ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. భగవంతుడు వచ్చినప్పుడు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా అయిపోతారు, ముక్తిధామానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. మళ్ళీ మొదటి నుండి చక్రము పునరావృతమవుతుంది. దైవీధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము….. విద్యార్థులైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి కదా. మేము ఎంతగా సంపాదిస్తున్నాము అని సంతోషం ఉంటుంది, అమరుడైన బాబా ఈ అమరకథను మీకు వినిపిస్తున్నారు. మీకు అనేక పేర్లు పెట్టారు. మొట్టమొదట ముఖ్యమైన దేవతా ధర్మము, ఆ తర్వాత అన్నీ వృద్ధి చెందుతూ-చెందుతూ వృక్షము పెరుగుతూ ఉంటుంది. అనేకానేక ధర్మాలు, అనేక మతాలు ఏర్పడతాయి. ఈ ఒక్క ధర్మమే ఒక్క శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది. ద్వైతము విషయమే ఉండదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. పిల్లలైన మీరు సంతోషంగా కూడా ఉండాలి.

తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు, మీరు అనుభవంతో చెప్తారు, కనుక భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న శుద్ధ అహంకారం ఉండాలి, ఇంకేమి కావాలి! మనము విశ్వానికి యజమానులుగా అవుతున్నప్పుడు సంతోషము ఎందుకుండదు లేక నిశ్చయంలో ఎమైనా సంశయముందా. తండ్రిపై సంశయము రాకూడదు. మాయ సంశయంలోకి తీసుకొచ్చి మరిపింపజేస్తుంది. మాయ కళ్ళ ద్వారా చాలా మోసము చేస్తుందని తండ్రి అర్థము చేయించారు. మంచి పదార్థాన్ని చూసినప్పుడు తినాలి అని మనస్సు లాగుతూ ఉంటుంది, కళ్ళతో చూసినప్పుడు కొట్టాలి అని కోపము వస్తుంది. అసలు చూడనే చూడకపోతే ఎలా కొట్టగలరు. కళ్ళతో చూసినప్పుడే లోభము, మోహము కూడా కలుగుతాయి. ముఖ్యంగా కళ్ళే మోసము చేస్తాయి. వీటి పైన పూర్తి ధ్యానముంచాలి. ఆత్మకు జ్ఞానము లభించినప్పుడు క్రిమినల్(వికారి) తనము తొలగిపోతుంది. అలాగని కళ్ళను తొలగించాలని కాదు. మీ అశుద్ధమైన దృష్టిని శుద్ధంగా చేసుకోవాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న ఇదే నషా లేక సంతోషంలో సదా ఉండాలి. ఏ విషయములోనూ సంశయబుద్ధి కలవారిగా అవ్వకూడదు. శుద్ధ అహంకారము ఉండాలి.

2. సూక్ష్మవతనం యొక్క విషయాలలో ఎక్కువగా ఆసక్తిని చూపించకూడదు. ఆత్మను సతోప్రధానంగా తయారుచేసుకునేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. పరస్పరం సలహాలు తీసుకొని అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్నివ్వాలి.

వరదానము:- సంగమయుగ మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ ప్రాప్తి పొందే సర్వ ప్రాప్తి సంపన్న భవ

సంగమయుగములో బాప్ దాదా ప్రతిజ్ఞ – ఒకటి ఇవ్వండి, లక్ష తీసుకోండి. ఏ విధంగా సర్వ శ్రేష్ఠమైన సమయం, సర్వ శ్రేష్ఠమైన జన్మ, సర్వ శ్రేష్ఠమైన టైటిల్ ఈ సమయానికి చెందినవో అదే విధంగా సర్వ ప్రాప్పుల అనుభవము కూడా ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఒకటికి లక్ష రెట్లు కాదు కానీ ఎప్పుడు కావాలనుకుంటే, ఎలా కావాలనుకుంటే, ఏది కావాలనుకుంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుని రూపంలో బంధింపబడి ఉన్నారు. ఒకటికి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో వరదాతయే మీ వారిగా ఉన్నారు. బీజమే మీ చేతిలో ఉన్నప్పుడు మరి బీజం ద్వారా ఏది కావాలనుకుంటే అది క్షణంలో తీసుకుని సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలరు.

స్లోగన్:- సఫలతా సంపన్నులుగా అవ్వాలనుకుంటే, ఒకరి విషయాలను ఒకరు స్వీకరించండి మరియు సత్కరించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *