Telugu Murli 30/07/20

30-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మీరు ఆత్మిక పండాలుగా అయి అన్ని ధర్మాల వారికి శాంతిధామము మరియు సుఖధామముకు మార్గాన్ని తెలియజేయాలి, మీరు సత్యమైన పండాలు”

ప్రశ్న:- ఎటువంటి పిల్లలకు తండ్రి స్మృతి ద్వారా పూర్తి బలము ప్రాప్తిస్తుంది?

జవాబు:- ఎవరైతే స్మృతి చేయడంతో పాటు తండ్రితో పూర్తి నిజాయితీగా ఉంటారో, ఏదీ దాచిపెట్టరో, సత్యమైన తండ్రితో సత్యంగా ఉంటారో, ఎటువంటి పాపము చేయరో, వారికే స్మృతి ద్వారా బలము ప్రాప్తిస్తుంది. చాలా మంది పిల్లలు తప్పులు చేస్తూ మళ్ళీ క్షమించమని అడుగుతూ ఉంటారు. కానీ క్షమాపణ ఉండదు అని బాబా అంటారు. ప్రతి ఒక్క కర్మకు లెక్కాచారము ఉంటుంది.

గీతము:- మా తీర్థ స్థానాలు అతీతమైనవి….. (హమారే తీర్థ్ న్యారే హై…..)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు, పిల్లలు జ్ఞాన పాయింట్లను ఎంత వరకు అర్థము చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు ఇటువంటి పాటలను వినిపించి ప్రతి ఒక్కరి చేత వాటి అర్థాన్ని చెప్పించాలి. ఎందుకంటే ఈ పాటలను కూడా సరిదిద్దడం జరుగుతుంది కదా. ఎప్పుడైనా ఏదైనా చింతతో కూర్చున్నప్పుడు ఇటువంటి ఎన్నో మంచి పాటలు మిమ్మల్ని సంతోషంలోకి తీసుకొచ్చేందుకు చాలా సహయోగమిస్తాయి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇవి చాలా ఉపయోగపడేటటువంటివి, పాట విన్న వెంటనే స్మృతి వస్తుంది. మేము ఈ ధరిత్రి పై ఉన్న అదృష్ట సితారలమని పిల్లలైన మీకు తెలుసు. మన ఈ తీర్థ స్థానాలు భక్తి మార్గములోని తీర్థ స్థానాల కంటే పూర్తిగా అతీతమైనవని పిల్లలకు తెలుసు. మీరు పాండవ సైన్యము. ఆ తీర్థాలలో పండాల సైన్యముంటుంది. ఒక్కొక్క గ్రూపును తీసుకువెళ్ళేందుకు వేరు వేరు పండాలు ఉంటారు. వారి వద్ద పుస్తకాలుంటాయి. మీరు ఏ కులానికి చెందినవారు అని అడుగుతారు. ప్రతి ఒక్కరు తమ కులము వారినే తీసుకుంటారు. ఎంతమంది పండాలు తీసుకువెళ్తారు. మీరు కూడా ఆత్మిక పండాలు. మీ పేరే పాండవ సైన్యం. పాండవులకు రాజధాని లేదు. పండాలను పాండవులని అంటారు. తండ్రి కూడా అనంతమైన పండా. గైడ్ లను పండాలని అంటారు. పండాలు తీర్థస్థానాలకు తీసుకువెళ్తారు. ఈ పండాలు యాత్రికులను తీసుకొచ్చారని పూజారులకు తెలుసు. జ్ఞాన మార్గములో కూడా మీరు పండాలుగా అవుతారు. ఇందులో ఎక్కడకూ తీసుకువెళ్ళే మాటే లేదు. ఇంటిలో కూర్చుని ఉంటూ కూడా మీరు ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారు. ఎవరెవరికైతే తెలియజేస్తారో, వారు కూడా పండాలుగా అవుతారు. మన్మనాభవ అని ఒకరికొకరు మార్గాన్ని తెలియజేయాలి. మీలో కూడా తీర్థయాత్రలు చేసినవారు చాలామంది ఉంటారు. బద్రీనాథ్, అమరనాథ్ యాత్రలకు ఎలా వెళ్ళాలో బుద్ధిలోకి వస్తూ ఉండవచ్చు. పండాలకు కూడా మీరు ఆత్మిక పండాలని తెలుసు. మనము పురుషోత్తమ సంగమయుగ వాసులమని మీరు మర్చిపోకండి. మనము ముక్తి-జీవన్ముక్తులకు పండాలము అన్న ఈ ఒక్క విషయము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. స్వర్గానికి, ముక్తికి వేరు వేరు పండాలుంటారని భావించకండి. మనము ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తామని మీకు నిశ్చయముంది. మీరు నంబరువారు పురుషార్థానుసారముగా పండాలు. పండాలలో కూడా అనేక రకాలుంటారు. మీరు ఫస్ట్ క్లాస్ పండాలు. అందరికీ పవిత్రతా మార్గాన్నే తెలుపుతారు. అందరూ పవిత్రంగా ఉండాలి. దృష్టి పరివర్తనైపోతుంది. మేము ఒక్కరిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయమని మీరు ప్రతిజ్ఞ చేశారు. బాబా, మేము మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము. మేము మీ వారిగా అయినందుకు మా నావ తీరానికి చేరుతుంది. భవిష్యత్తులో అపారమైన సుఖముంటుంది. తండ్రి మనల్ని సుఖ సంబంధములోకి తీసుకువెళ్తారు. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. ఒకవేళ సుఖమున్నా, అది కాకిరెట్ట సమానంగా ఉంది. మీరు చదివేదే కొత్త ప్రపంచము కొరకు. ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తామని మీకు తెలుసు. ఇంటికైతే తప్పకుండా వెళ్తారు. ఇది స్మృతి శక్తితో చేసే యాత్ర. శాంతిధామాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రిని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రితో నిజాయితీగా కూడా ఉండాలి. నాకు మీ అంతరంగము తెలుసునని భావించకండి. అలా జరగదు. మీ నడవడికను బట్టి బాబా అర్థం చేయిస్తారు. పురుషార్థము చేయిస్తారు. మీరు ఏదైనా ఆజ్ఞను ఉల్లఘించినా లేదా పాపము చేసినా, ఏ పాపము చేయలేదు కదా అని ఇక్కడ ప్రశ్నించబడ్తుంది. కళ్ళు చాలా మోసము చేస్తాయని బాబా అర్థం చేయించారు. బాబా, ఈ రోజు కళ్ళు మమ్మల్ని చాలా మోసము చేశాయి, ఇక్కడైతే భయముంటుంది, ఇంటికి వెళ్ళినప్పుడు నా బుద్ధి చంచలమవుతుంది, బాబా, ఇది నేను చేసిన చాలా పెద్ద తప్పు, క్షమించండి అని కూడా బాబాకు చెప్పాలి. బాబా చెప్తారు – ఇందులో క్షమించే మాటే లేదు. ప్రపంచములోని మనుష్యులు అలా క్షమాపణ అడుగుతారు. ఎవరైనా చెంపదెబ్బ కొట్టారు, అచ్ఛా, క్షమాపణ అడిగారు, ఇది సరిపోతుంది. ఇలా క్షమించమని అడిగేందుకు సమయము పట్టదు. చెడు కర్మలు చేస్తూ ఉంటూ, ఐ యామ్ సారీ అని అంటే ఇది కుదరదు. ఈ పాపమంతా జమా అవుతుంది. ఏదైనా తప్పుడు కర్మ చేస్తే, అది జమా అవుతుంది, దాని మంచి-చెడు ఫలితాలు మరు జన్మలో తప్పకుండా లభిస్తాయి. క్షమించే మాటే లేదు. ఎవరు ఎలా చేస్తారో, అలా పొందుతారు.

బాబా పదే పదే అర్థం చేయిస్తారు – ఒకటి, కామము మహాశత్రువు. ఇది మీకు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. బాబాను పతితపావనులని అంటారు. వికారాల్లోకి వెళ్ళేవారినే పతితులని అంటారు. ఇక్కడ తండ్రి అర్థము చేయిస్తారు, ఇక్కడ నుండి మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు, అక్కడ అంతగా నియమాలను అనుసరించలేరు కనుక ఉన్నత పదవిని కూడా పొందలేరు. బాబా సమాచారమైతే వింటారు కదా. ఇక్కడైతే బాగుంది, బాగుంది అని అంటారు. మళ్ళీ బయటకు వెళ్ళగానే ధారణ ఉండదు. సత్యయుగములో అయితే వికారాల మాటలే ఉండవు. ఇప్పుడు భారతదేశము పరిస్థితి ఇలా ఉంది. అక్కడ పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు. అపారమైన సుఖముంటుంది. బాబా పిల్లల నుండి కూడా సమాచారమంతా సేకరిస్తారు. బాబాకు సమాచారాన్ని ఇవ్వాలి కదా. కొందరు అబద్ధం కూడా చెప్తారు. నేను ఎంతవరకు అబద్ధము చెప్తున్నాను అని ఆలోచించాలి. వీరికైతే అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. తండ్రి సత్యంగా తయారుచేసేవారు. అక్కడ అబద్ధము ఉండదు, అబద్ధము యొక్క నామ రూపాలే ఉండవు. ఇక్కడ సత్యానికి నామ రూపాలే లేవు. తేడా అయితే ఉంటుంది కదా. ఇది ముళ్ళ అడవి అని తండ్రి చెప్తారు కానీ స్వయాన్ని ముల్లుగా ఎవరూ భావించరు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడం అన్నింటికంటే పెద్ద ముల్లు అని తండ్రి చెప్తారు. దీని వల్లనే మీరు దుఃఖితులుగా అయ్యారు. బాబా ఇప్పుడు మీకు అపారమైన సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు. అక్కడ అపారమైన సుఖముండేదని మీకు తెలుసు. సత్యయుగాన్ని సుఖధామమని అంటారు. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. ఆసుపత్రులు, జైళ్ళు మొదలైనవి కూడా ఉండవు. సత్యయుగంలో దుఃఖమనే పేరే ఉండదు, త్రేతాయుగంలో రెండు కళలు తగ్గిపోతాయి కనుక కొద్దిగా ఏదో ఒకటి ఉంటుంది, అయినా స్వర్గమనే అంటారు కదా. మీరు అపారమైన అతీంద్రియ సుఖములో ఉండాలి అని తండ్రి చెప్తారు. చదివించేవారిని కూడా స్మృతి చేయాలి. భగవంతుడు మన టీచరు. టీచరును అందరూ స్మృతి చేస్తారు. ఇక్కడ ఉండే పిల్లలకైతే చాలా సులభము. ఇక్కడ ఏ బంధనమూ లేదు. పూర్తి బంధనముక్తులుగా ఉన్నారు. ప్రారంభంలో భట్టీ జరిగినప్పుడు బంధనముక్తులుగా అయిపోయారు. సేవ వృద్ధి చేయాలనే చింత మాత్రమే ఉంటుంది. సేవ ఎలా వృద్ధి చేయాలి? బాబా చాలా అర్థము చేయిస్తూ ఉంటారు. బాబా వద్దకు వస్తారు ఒకటి-ఒకటిన్నర నెల చాలా ఉల్లాసంగా ఉంటారు, తర్వాత చూస్తే చల్లబడిపోతారు. సెంటర్లకు రానే రారు. అచ్ఛా. మరి ఏం చేయాలి? ఎందుకు రావడం లేదు అని వ్రాసి ప్రశ్నించవచ్చు. బహుశా మాయ మీపై దాడి చేసి ఉండవచ్చు లేక ఎవరి సాంగత్యములోనైనా చిక్కుకొని ఉండవచ్చు లేక ఏ వికర్మను అయినా చేసి పడిపోయి ఉండవచ్చు అని మేము భావిస్తున్నాము. అయినా లేపవలసి ఉంటుంది కదా. పురుషార్థము చేయాలి. వారి మనసును గెలుచుకోవలసి ఉంటుంది. మీరు ఉత్తరం వ్రాయవచ్చు. చాలామంది సిగ్గుపడతారు, తర్వాత నిరాశపడతారు. ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంటిలో కూర్చొని ఉండిపోయారు అని తర్వాత సమాచారము వస్తుంది. నా మనస్సు మారిపోయిందని చెప్తారు. మీ జ్ఞానము అయితే చాలా బాగుంది కానీ నేను పవిత్రంగా ఉండలేను కనుక వదిలేశాను, నాలో అంత శక్తి లేదు అని కొందరు ఉత్తరం కూడా వ్రాస్తారు. కేవలం వ్రాస్తారు, అంతే. వికారాలు ఎలా పడేస్తాయో చూడండి. మేము సూర్యవంశీ నరుల నుండి నారాయణులుగా అవుతామని ఇక్కడ చేతులు కూడా ఎత్తుతారు. ఈ జ్ఞానము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకే ఉన్నది. బెల్లానికి మరియు బెల్లము సంచికే తెలుసు అని బాబా చెప్తారు. వీరు బాబా యొక్క సంచి కదా. వీరు బాగా ప్రశ్నిస్తారు. వీరి వద్దకు సమాచారము కూడా వస్తుంది. శివబాబా చెప్తారు – నేను చదివించేందుకు వస్తాను. ఎవరైతే బాగా చదువుతారో, వ్రాస్తారో, వారు నవాబులుగా అవుతారు. దృష్టిని చాలా పరివర్తన చేసుకోవాలి అని తండ్రి చెప్తారు. అడుగు అడుగులోనూ జాగ్రత్త అవసరము. స్మృతి ద్వారానే అడుగడుగులోనూ పదమము ఉంటుంది. చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు. సేవాధారులైన పండాలు కూడా ఫెయిల్ అవుతారు. ఎంతవరకు మీరు యాత్రలో ఉంటారో, అంతవరకు పవిత్రంగా ఉంటారు. కొంతమందికి ఎంత మక్కువ ఉంటుందంటే, యాత్రలలో కూడా మద్యము మొదలైనవి తమతోపాటు అక్కడకు తీసుకువెళ్తారు. దాచి పెట్టుకుంటారు. పెద్ద-పెద్ద వ్యక్తులు ఇది లేకుండా ఉండలేరు. అప్పుడు ఆ తీర్థయాత్రల వలన ఏమీ లాభముండదు. యుద్ధము చేసేవారు కూడా చాలా మద్యాన్ని సేవిస్తారు. మద్యము త్రాగి వెళ్ళి విమానం సహితంగా స్టీమరు పై పడిపోతారు. స్టీమరు కూడా సమాప్తమైపోతుంది, స్వయం కూడా సమాప్తమైపోతారు.

ఇప్పుడు మీకు జ్ఞానామృతము లభిస్తుంది. ఇకపోతే ముఖ్యమైన విషయము స్మృతి. దీని ద్వారానే మీరు 21 జన్మలకు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. 21 జన్మలకు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఎలా అవ్వవచ్చో వచ్చి తెలుసుకోండి అని కూడా వ్రాయమని బాబా చెప్తారు. భారతదేశములో ఎక్కువ ఆయువు ఉండేదని భారతవాసీయులకు తెలుసు. స్వర్గములో ఎప్పుడూ ఎవరు వ్యాధిగ్రస్తులుగా అవ్వరు. స్వర్గములో దేవీ దేవతల ఆయువు 150 సంవత్సరములుండేది. 16 కళా సంపూర్ణులుగా ఉంటారు. ఇది ఎలా సాధ్యమని అంటారు. అక్కడ 5 వికారాలు అనేవే ఉండవని చెప్పండి. అక్కడ కూడా ఈ వికారాలు ఉన్నట్లయితే అది రామరాజ్యమెలా అవుతుంది? దేవతలు వామమార్గములోకి వెళ్ళిన చిత్రాలు కూడా మీరు చూశారు. చాలా అశుద్ధమైన చిత్రాలు ఉంటాయి. నేను ఏం చూసానో అది చెప్తున్నాను అని ఈ బాబా చెప్తారు. నేను కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాను అని శివబాబా చెప్తారు. శివబాబా జ్ఞాన విషయాలను వినిపిస్తారు, వీరు తమ అనుభవము యొక్క విషయాలను వినిపిస్తూ ఉంటారు. ఇద్దరు కదా. వీరు కూడా తమ అనుభవాలను తెలియజేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికీ వారి జీవితము గురించి తెలుసు. అర్ధకల్పము నుండి పాపాలు చేస్తూ వచ్చామని మీకు తెలుసు. అక్కడ ఇక ఎవ్వరూ పాపము చేయరు. ఇక్కడ ఎవ్వరూ పావనంగా ఉండరు.

ఇప్పుడు నిజమైన భాగవతము నడుస్తోందని పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు కూర్చుని పిల్లలకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వాస్తవానికి ఒక్క గీత మాత్రమే ఉండాలి. శివబాబా జీవన చరిత్రను ఏమని వ్రాస్తారు! ఇది కూడా మీకు తెలుసు. పుస్తకాలు మొదలైనవి ఏవీ మిగలవు ఎందుకంటే వినాశనము ఎదురుగా నిలిచి ఉంది, తర్వాత ఈ పురుషార్థము చేసిన జ్ఞానము కూడా సమాప్తమైపోతుంది. మళ్ళీ ప్రారబ్ధము ప్రారంభమవుతుంది. డ్రామాలో పాత్ర ఏ విధంగా ఉంటుందో, రీలు అలా తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా ప్రారబ్ధము ప్రారంభమవుతుంది. ఇంతమంది ఆత్మలలో తమ-తమ డ్రామా పాత్ర ఇమిడి ఉంది. ఈ విషయాలు అర్థము చేసుకోగలిగినవారు అర్థము చేసుకుంటారు. ఇది అనంతమైన నాటకము. మేము మీకు అనంతమైన నాటకము యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తామని మీరు చెప్తారు. అది నిరాకార ప్రపంచము, ఇది సాకార ప్రపంచము. మేము మీకు పూర్తి రహస్యాన్ని తెలియజేస్తాము. ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉంది అనేది మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారికి చాలా ఆనందము కలుగుతుంది. ఎవ్వరూ వినరని భావించకండి. ప్రజలు చాలామంది తయారవ్వాలి. సేవలో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. మీరు అర్థం చేయిస్తూ ఉండండి. వ్యాపారుల వద్దకు చాలామంది కస్టమర్లు వస్తారు. రండి, మేము మీకు అనంతమైన బేరము ఇస్తాము. భారతదేశములో ఈ దేవతల రాజ్యముండేది, తర్వాత ఎక్కడకు వెళ్ళిపోయింది? 84 జన్మలు ఎలా తీసుకున్నారో మేము మీకు అర్థం చేయిస్తాము. భగవానువాచ – మీకు మీ జన్మల గురించి తెలియదు. చాలా సేవ చేయవచ్చు. సమయం లభించినప్పుడు మేము మీకు ఈ విశ్వము యొక్క చరిత్ర-భూగోళాలు అర్థము చేయిస్తాము అని చెప్పండి. తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు వచ్చినట్లయితే మీకు రచయిత, రచనల రహస్యాలను అర్థం చేయిస్తాము. ఇది మీ అంతిమ జన్మ. భవిష్యత్తు కొరకు ఇప్పుడే సంపాదన చేసుకోండి. పిల్లలూ! మీరు ఇలా-ఇలా సేవ చేయండి అని బాబా అర్థం చేయిస్తారు కదా. మీ కస్టమర్లు ఈ విషయాలను విని చాలా సంతోషిస్తారు. మీకు కూడా తల వంచి నమస్కరిస్తారు. కృతజ్ఞతలు తెలుపుతారు. వ్యాపారులైతే ఎక్కువ సేవను చేయగలరు. వ్యాపారులు ధర్మార్థం కొంత భాగాన్ని తీస్తారు. మీరు గొప్ప ధర్మాత్ములుగా అవుతారు. తండ్రి వచ్చి అవినాశీ జ్ఞాన రత్నాలతో మీ జోలెను నింపుతారు. ఇలా-ఇలా చేయండి అని బాబా అనేక రకాల సలహాలను ఇస్తూ ఉంటారు. సందేశాన్ని ఇస్తూ ఉండండి, అలసిపోకండి. అనేకమంది కళ్యాణము చేస్తూ ఉండండి. చల్లబడకండి. మీ దృష్టిని కూడా సరిగ్గా ఉంచుకోండి. క్రోధం కూడా చేయకూడదు. యుక్తిగా నడుచుకోవాలి. తండ్రి అనేక రకాల యుక్తులను అర్థం చేయిస్తుంటారు. వ్యాపారస్థులకు సేవ చేయడం చాలా సహజము. అది కూడా వ్యాపారమే, ఇది కూడా వ్యాపారమే. ఇది చాలా మంచి వ్యాపారము అని చెప్పండి. తక్షణమే కస్టమర్లు జమా అవుతారు. ఇటువంటి వ్యాపారము చేసే మహాపురుషునికి చాలా సహయోగము చేయాలని చెప్తారు. ఇది మీ అంతిమ జన్మ, మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వగలరని చెప్పండి. ఎవరు ఎంత చేస్తారో, అంత పొందుతారు. నా దృష్టి ఏ విధమైన చెడు పని చేయలేదు కదా, స్త్రీ వైపుకు మోహము లాగడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. సిగ్గు అనిపించినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. విశ్వానికి యజమానులుగా అవ్వడం చిన్న విషయమా? ఎంత పాత భక్తులు అయి ఉంటారో, వారు అంత సంతోషపడతారు. ఎవరైతే తక్కువ భక్తి చేసి ఉంటారో వారికి తక్కువ సంతోషం కలుగుతుంది. ఇది కూడా అర్థము చేసుకునేందుకు లెక్క. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత కొత్త ప్రపంచములో కొత్త వస్త్రము ధరించి పాత్రను అభినయిస్తాము, ఈ శరీరాన్ని వదలగానే నోటిలో బంగారు చెంచా ఉంటుందని బుద్ధి చెప్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1.దృష్టి ద్వారా ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. మొదట మీ దృష్టినే పరివర్తన చేసుకోవాలి. అడుగు-అడగులోనూ జాగ్రత్తగా ఉంటూ పదమాల సంపాదనను జమ చేసుకోవాలి.

2. సమయం లభించినప్పుడు అనంతమైన వ్యాపారము చేయాలి. సేవలో నిరాశ చెందకూడదు. అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి, అలసిపోకూడదు.

వరదానము:- స్నేహమనే ఒడిలో ఆంతరిక సుఖాన్ని మరియు సర్వ శక్తులను అనుభవం చేసే యథార్థ పురుషార్థీ భవ

ఎవరైతే యథార్థమైన పురుషార్థులుగా ఉంటారో, వారు ఎప్పుడూ శ్రమను గానీ, అలసటను గానీ అనుభవం చేయరు, సదా ప్రేమలో నిమగ్నమై ఉంటారు. వారు సంకల్పం ద్వారా కూడా సమర్పితమై ఉన్న కారణంగా తమను బాప్ దాదాయే నడిపిస్తున్నారని అనుభవం చేస్తారు. శ్రమతో కూడుకున్న కాళ్ళతో కాక, స్నేహమనే ఒడిలోకి వెళ్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. స్నేహమనే ఒడిలో సర్వ ప్రాప్తుల అనుభూతి ఉన్న కారణంగా వారు కేవలం నడవడం కాదు, సదా సంతోషంలో, ఆంతరిక సుఖంలో, సర్వ శక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు.

స్లోగన్:- నిశ్చయము రూపీ పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠమైన జీవితం యొక్క అనుభవం స్వతహాగా జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *