Telugu Murli 31/07/20

31-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – ఇది అద్భుతమైన పాఠశాల, దీనిలో చదువుకునే ఆత్మలూ కనిపించరు, చదివించేవారు కూడా కనిపించరు, ఇది కొత్త విషయము”

ప్రశ్న:- ఈ పాఠశాలలో మీకు ముఖ్యంగా లభించే ఏ శిక్షణ ఇతర ఏ పాఠశాలలోనూ ఇవ్వడం జరగదు?

జవాబు:- పిల్లలూ! మీ కర్మేంద్రియాలను ఆధీనములో ఉంచుకోవాలని ఇక్కడ తండ్రి తన పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఎప్పుడూ ఏ సోదరి పట్ల అశుద్ధమైన దృష్టి ఉండకూడదు. మీరు ఆత్మ రూపములో సోదరులు మరియు ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా, పరస్పరములో సోదరీ-సోదరులు. మీకు చెడు ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు. ఇటువంటి శిక్షణ ఈ విశ్వవిద్యాలయములో తప్ప మరెక్కడా ఇవ్వడం జరగదు.

గీతము:- దూరదేశములో నివసించేవారు….. (దూర్ దేశ్ కా రెహ్నే వాలా…..)

ఓంశాంతి. దూరదేశములో ఉండే ఆత్మా కనిపించదు, దూరదేశములో ఉండే పరమాత్మ కూడా కనిపించరు. ఒక్క పరమాత్మ మరియు ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము. మిగిలిన వస్తువులన్నీ కనిపిస్తాయి. నేను ఆత్మను అనేది అర్థమవుతుంది. ఆత్మ వేరు, శరీరము వేరు అని మనుష్యులు అర్థము చేసుకుంటారు. ఆత్మ దూరదేశము నుండి వచ్చి శరీరములోకి ప్రవేశిస్తుంది. మీరు ప్రతి విషయాన్ని బాగా అర్థము చేసుకుంటున్నారు. ఆత్మలమైన మనము దూరదేశము నుండి ఎలా వస్తాము. ఆత్మ కూడా కనిపించదు, చదివించే తండ్రి అయిన పరమాత్మ కూడా కనిపించరు. ఈ విధంగా ఎప్పుడూ ఏ సత్సంగాలలోనూ, ఏ శాస్త్రాలలోనూ వినలేదు. ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చూడలేదు. ఆత్మలమైన మనము కనిపించము అని మీకిప్పుడు తెలుసు. ఆత్మనే చదువుకోవాలి. అన్నీ ఆత్మనే చేస్తుంది కదా. ఇది కొత్త విషయం కదా. దీనిని ఎవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ కూడా కనిపించరు. నిరాకారుడు ఎలా చదివిస్తారు? ఆత్మ కూడా శరీరములోకి వస్తుంది కదా. అదే విధంగా పరమపిత పరమాత్మ అయిన తండ్రి కూడా భాగ్యశాలి రథము లేక భగీరథునిలోకి వస్తారు. ఈ రథానికి కూడా వారి ఆత్మ ఉంది. అతను కూడా తన ఆత్మను చూడలేరు. ఈ రథం యొక్క ఆధారముతో తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ యొక్క పరిచయముంది కానీ చూడలేము. ఏ తండ్రి అయితే కనిపించరో, వారే మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త విషయం. నేను కూడా డ్రామా ప్లాను అనుసారముగా నా సమయము వచ్చినప్పుడు శరీరాన్ని ధారణ చేస్తానని తండ్రి చెప్తున్నారు. లేకపోతే మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుండి ఎలా విడిపించను. ఇప్పుడు పిల్లలైన మీరు మేల్కొన్నారు. ప్రపంచములోని మనుష్యులందరూ నిద్రిస్తున్నారు. మీ వద్దకు వచ్చి అర్థం చేసుకున్నప్పుడు బ్రాహ్మణులుగా అవుతారు. ఇతర సత్సంగాలలో ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ ఆ విధంగా ఎవరూ రాలేరు, ఎందుకంటే ఇది పాఠశాల కదా. బ్యారిష్టరి పరీక్షలలో మీరు వెళ్ళి కూర్చున్నట్లయితే ఏమీ అర్థము చేసుకోలేరు. ఇది పూర్తిగా కొత్త విషయము. చదివించేవారు కూడా కనిపించరు. చదివేవారు కూడా కనిపించరు. ఆత్మ ఆంతరికంగా వింటుంది, ధారణ చేస్తుంది. ఈ విషయము సత్యమేనని ఆంతరికంగా నిశ్చయము కలుగుతూ ఉంటుంది. పరమాత్మ మరియు ఆత్మ ఇరువురూ కనిపించరు. నేను ఆత్మను అని బుద్ధి ద్వారా అర్థమవుతుంది. కొందరు ఇది కూడా అంగీకరించరు. నా నేచర్ అని అనేస్తారు. ఆ తరువాత వర్ణన కూడా చేస్తారు. అనేక మతాలున్నాయి కదా. పిల్లలైన మీరు ఈ జ్ఞానములో బిజీగా ఉండాలి. కర్మేంద్రియాలు ఏవైతే మోసము చేస్తాయో, వాటిని కూడా వశము చేసుకోవాలి. ముఖ్యమైనవి కళ్ళు, అవి అన్నింటినీ చూస్తూ ఉంటాయి. కళ్ళ ద్వారానే పిల్లలను చూసి, వీరు మా పిల్లలు అని చెప్తారు. లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు! కొందరు జన్మిస్తూనే అంధులుగా ఉంటే, ఇతడు నీ సోదరుడని వారికి అర్థం చేయిస్తారు. వారు చూడలేరు, బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. వాస్తవానికి ఎవరైనా అంధుడైన సూరదాసునిలా ఉంటే, వారు జ్ఞానాన్ని బాగా గ్రహించగలరు, ఎందుకంటే మోసము చేసేటటువంటి కళ్ళు వారికి లేవు. వారు వేరే పనులేవీ చేయలేకపోయినా, జ్ఞానాన్ని బాగా గ్రహిస్తారు. స్త్రీని కూడా చూడరు. ఇతరులను చూసినట్లయితే బుద్ధి అటువైపుకు వెళ్తుంది. వారిని ముట్టుకోవాలనిపిస్తుంది. అసలు చూడనే చూడకపోతే ఎలా ముట్టుకోగలరు? కావున కర్మేంద్రియాలను పక్కా చేసుకోవాలి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్రిమినల్ అనగా చెడు దృష్టితో ఏ సోదరినీ చూడకూడదు. మీరు కూడా పరస్పరములో సోదరీ-సోదరులే కదా. చెడు దృష్టి గురించి కొద్దిగా కూడా ఆలోచన రాకూడదు. ఇది కలియుగము, సోదరీ-సోదరులు కూడా పాడైపోతారు, కానీ న్యాయబద్ధంగా సోదరీ-సోదరులకు చెడు దృష్టి ఉండదు.

మనము ఒక్క తండ్రి పిల్లలము. మీరు బ్రహ్మాకుమార్-కుమారీలైతే, మేము సోదరీ-సోదరులమనే జ్ఞానం పక్కా చేసుకోవాలని బాబా డైరెక్షన్ ఇస్తున్నారు. ఆత్మలమైన మేము, భగవంతుని పిల్లలము, సోదరులము, తర్వాత శరీరపరంగా ప్రజాపిత బ్రహ్మా ద్వారా సోదరీ-సోదరులుగా అవుతాము ఎందుకంటే దత్తత తీసుకోబడతాము కదా! చెడు దృష్టి ఉండకూడదు. మేము ఆత్మలము అని పక్కాగా అర్థము చేసుకోండి. బాబా మనల్ని చదివిస్తున్నారు, ఆత్మలమైన మేము ఈ శరీరము ద్వారా చదువుతున్నాము. ఇవి కర్మేంద్రియాలు. ఆత్మలమైన మేము వీటి నుండి వేరుగా ఉన్నాము, ఈ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తున్నాము. నేను కర్మేంద్రియాలు కాను. నేను వీటికి అతీతంగా ఉన్న ఆత్మను. ఈ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తున్నాను, అది కూడా అలౌకికమైనది. ఇతర మానవమాత్రులెవ్వరూ ఈ పాత్రను అభినయించరు. మీరు అభినయిస్తున్నారు. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. వారే మనకు టీచరు మరియు గురువు కూడా. సాకారములో తండ్రి, టీచరు, గురువు వేరు వేరుగా ఉంటారు. ఈ నిరాకారుడు ఒక్కరు మాత్రమే తండ్రి, టీచరు, గురువుగా ఉన్నారు. ఇక్కడ పిల్లలకిప్పుడు కొత్త శిక్షణ లభిస్తుంది. తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ నిరాకారులే. నిరాకార ఆత్మలమైన మనము కూడా చదువుకుంటున్నాము, అందుకే ఆత్మ, పరమాత్మ చాలాకాలము నుండి వేరుగా ఉన్నారని భావిస్తారు. తండ్రి వచ్చి పావనంగా చేయవలసి వచ్చినప్పుడే, ఇక్కడ వారిని కలుసుకోవడం జరుగుతుంది. మూలవతనానికి ఆత్మలు వెళ్ళి కలుస్తాయి. అక్కడ ఏ ఆటా ఉండదు, అది మన ఇల్లు. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. అంతిమంలో ఆత్మలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి ఆత్మలెవరైతే వస్తారో, వారు మధ్యలో తిరిగి వెళ్ళలేరు. చివరివరకు పాత్రను అభినయించవలసిందే. ఆత్మలన్నీ పై నుండి క్రిందికి వచ్చినంతవరకు పునర్జన్మలు తీసుకుంటూ ఉండాలి. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి రావాలి. మళ్ళీ అంతిమంలో నాటకము పూర్తైనప్పుడు, తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి అన్ని విషయాలనూ బాగా అర్థము చేయిస్తారు కదా. జ్ఞాన మార్గము ఉన్నదే సత్యమైనది. సత్యం, శివం, సుందరం అని అంటారు కదా. సత్యము చెప్పేవారు ఒక్క తండ్రి మాత్రమే, ఈ సంగమంలో పురుషార్థులుగా అయ్యేందుకు సత్సంగము ఇది ఒక్కటే. తండ్రి వచ్చి పిల్లలను కలిసినప్పుడే, దానిని సత్సంగము అని అంటారు. మిగిలినవన్నీ చెడు సాంగత్యాలు. సత్యమైన సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుందని గాయనము చేస్తారు… చెడు సాంగత్యము రావణునిది. నేను మిమ్మల్ని తీరానికి తీసుకువెళ్తాను అని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని ముంచేదెవరు? తమోప్రధానంగా ఎలా అయ్యారో కూడా అర్థం చేయించవలసి వస్తుంది. మాయ మీ ముందు శత్రువై ఉంది. శివబాబా మన మిత్రుడు. వారిని పతులకే పతి అని అంటారు. ఈ మహిమ రావణునిది కాదు. కేవలం రావణుడు ఉన్నాడు అని అంటారు, ఇంకేమీ అనరు. రావణుడిని ఎందుకు కాలుస్తారు? అక్కడ కూడా మీరు ఎంతో సేవ చేయగలరు. రావణుడు ఎవరో, ఎప్పుడు వస్తాడో, ఎందుకు కాలుస్తారో కూడా ఏ మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. గ్రుడ్డినమ్మకము కదా. పిల్లలైన మీకు అర్థం చేయించే అథారిటీ ఉంది. వారు శాస్త్రాలను అథారిటీతో వినిపిస్తారు కదా! వినేవారు కూడా చాలా ఆనందంగా వింటూ ఉంటారు. ధనము ఇస్తూ ఉంటారు. సంస్కృతాన్ని నేర్పించండి, గీతను నేర్పించండి అని కూడా చాలా ధనాన్నిస్తారు. పిల్లలూ, మీరు ఎంతో సమయాన్ని, ధనాన్ని వ్యర్థము చేస్తూ వచ్చారు అని తండ్రి అర్థము చేయిస్తున్నారు.

ఈ బ్రాహ్మణ కులానికి చెందినవారు మీ వద్దకు వస్తూ ఉంటారు కావున మీరు ప్రదర్శనీ మొదలైనవి చేస్తారు. ఇక్కడకు చెందిన పుష్పాలైతే తప్పకుండా వస్తారు. ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి బీజాన్ని వేసారు, ఒకరు బ్రహ్మా, తరువాత వారి నుండి బ్రాహ్మణ కులము వెలువడుతుంది. ఒక్కరి ద్వారా వృద్ధి చెందుతూ వచ్చింది. మొదట ఇంటివారు, తర్వాత మిత్ర-సంబంధీకులు, సమీపంలో ఉండేవారు రావడం ప్రారంభించారు. అలా వింటూ-వింటూ ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇది కూడా ఒక సత్సంగమని భావిస్తారు. కానీ ఇందులో పవిత్రంగా ఉండే విషయంలో శ్రమ ఉన్న కారణంగా గొడవలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి కావున నిందిస్తూ ఉంటారు. అందరినీ ఎత్తుకువెళ్ళి పట్టపురాణులుగా చేసేవారు అని చెప్తారు. పట్టపురాణులుగా అయితే స్వర్గములో అవుతారు. తప్పకుండా వారిని ఇక్కడ పవిత్రంగా తయారుచేసి ఉంటారు. ఇది మహారాజా-మహారాణులుగా తయారయ్యేందుకు జ్ఞానమని మీరు అందరికీ వినిపిస్తారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యాతి-సత్యమైన కథను మీరు సత్యమైన భగవంతుని ద్వారా వింటున్నారు. ఈ లక్ష్మీనారాయణులను భగవాన్-భగవతి అని ఎవ్వరూ అనలేరు. కానీ పూజారులు కృష్ణుడిని గౌరవించినంతగా నారాయణుడిని గౌరవించరు. కృష్ణుడి చిత్రాలను చాలామంది కొంటూ ఉంటారు. కృష్ణుడికి ఇంత గౌరవమెందుకుంది? ఎందుకంటే చిన్న బాలుడు కదా. మహాత్ముల కంటే పిల్లలను ఉన్నతంగా భావిస్తారు, ఎందుకంటే మహాత్ములు ఇళ్ళు-వాకిళ్ళు అన్నింటినీ తయారుచేసుకుని తర్వాత వదిలేస్తారు. కొందరు బాలబ్రహ్మచారులుగా కూడా ఉంటారు. కానీ వారికి కామము, క్రోధము అంటే ఏమిటో తెలుసు. చిన్న పిల్లలకు తెలియదు కావున వారిని మహాత్ముల కంటే ఉన్నతమైనవారని అంటారు. అందుకే కృష్ణుడిని ఎక్కువగా గౌరవిస్తారు. కృష్ణుడిని చూసి చాలా సంతోషిస్తారు. కృష్ణుడే భారత్ కు భగవంతుడు. కన్యలు కూడా కృష్ణుడిని ఎంతో ప్రేమిస్తారు. కృష్ణునివంటి పతి లభించాలని, కృష్ణునివంటి పుత్రుడు కలగాలని కోరుకుంటారు. కృష్ణునిలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. సతోప్రధానమైనవారు కదా! ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా తమోప్రధానము నుండి తమో, రజోలోకి వస్తారు మరియు సంతోషం కూడా ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. మొదట మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. మీరు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా సుఖము కూడా అనుభవమవుతూ ఉంటుంది మరియు మీరు బదిలీ అవుతూ ఉంటారు. తమో నుండి రజో, సతోలోకి వస్తూ ఉంటే మీలో శక్తి, సంతోషము, ధారణ పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీది ఎక్కే కళ. మీ ద్వారా అందరూ లాభం పొందుతారని సిక్కులు గానము కూడా చేస్తారు. ఇప్పుడు స్మృతి ద్వారా ఎక్కేకళలోకి వెళ్తారని మీరు తెలుసుకున్నారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ఉన్నతమైన ఎక్కేకళ ఉంటుంది. సంపూర్ణంగా తయారవ్వాలి కదా! చంద్రునికి కూడా ఒక చిన్న గీత మిగిలిపోతుంది, మళ్ళీ కళలు పెరుగుతూ-పెరుగుతూ సంపూర్ణంగా అవుతుంది. మీది కూడా ఇదే విధంగా ఉంటుంది. చంద్రునికి కూడా గ్రహణము పట్టినప్పుడు దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది అని అంటారు. మీరు వెంటనే 5 వికారాలను దానము ఇవ్వలేరు. కళ్ళు కూడా ఎంతో మోసము చేస్తాయి. నాకు చెడు దృష్టి ఉందని కూడా అర్థము చేసుకోలేరు. మనము ఎప్పుడైతే బ్రహ్మాకుమార్-కుమారీలుగా అయ్యామో, అప్పుడే సోదరీ-సోదరులుగా అయ్యాము. అయినా ఒకవేళ ముట్టుకోవాలని మనసుకు అనిపించినట్లయితే, సోదర ప్రేమ దూరమై స్త్రీ భావంతో క్రిమినల్ ప్రేమ ఏర్పడుతుంది. మేము తండ్రికి చెందినవారిగా అయ్యాక ఎవ్వరూ మాపై చెడు దృష్టితో చేయి వేయడానికి వీల్లేదు అని భావిస్తారు, వారికి లోలోపల మనసు తింటూ ఉంటుంది. బాబా, ఇతను నాపై చేయి వేస్తున్నాడు, నాకు నచ్చడం లేదు అని చెప్తారు. దీని వలన మీ స్థితి బాగుండదని బాబా దానిపై మురళీ నడిపిస్తారు. అటువంటివారు మురళీని చాలా బాగా వినిపిస్తారు, చాలామందికి అర్థం చేయిస్తారు కానీ స్థితి బాగుండదు. చెడు దృష్టి ఉంటుంది. ఈ ప్రపంచం ఎంత అశుద్ధంగా ఉంది. గమ్యం చాలా ఉన్నతమైనదని పిల్లలకు తెలుసు. తండ్రి స్మృతిలో వివేకవంతులై ఉండాలి. మేము బ్రహ్మాకుమార్-కుమారీలము. మాది ఆత్మిక సంబంధము, రక్త సంబంధము కాదు. వాస్తవానికి అందరూ రక్తము ద్వారానే జన్మిస్తారు. సత్యయుగంలో కూడా రక్త సంబంధముంటుంది కానీ ఆ శరీరము యోగబలము ద్వారా లభిస్తుంది. వికారాలు లేకపోతే పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. అది ఉన్నదే నిర్వికారి ప్రపంచము అని తండ్రి చెప్తున్నారు. అక్కడ వికారాలు ఉండనే ఉండవు. అక్కడ కూడా నగ్నంగా ఉంటే, అది కూడా రావణరాజ్యంగా అయిపోతుంది. మరి ఇక అక్కడకు, ఇక్కడకు తేడా ఏముంది! ఇవి అర్థము చేసుకునే విషయాలు. చెడు దృష్టిని తొలగించుకునేందుకు చాలా కష్టపడాలి. కాలేజీలో ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకున్నప్పుడు చాలామందికి చెడు దృష్టి కలుగుతుంది. మేము భగవంతుని పిల్లలము కావున పరస్పరములో సోదరీ-సోదరులమని పిల్లలు అర్థం చేసుకోవాలి. మరి చెడు దృష్టి ఎందుకు పెట్టుకుంటారు. మేము ఈశ్వరుని సంతానమని కూడా అందరూ అంటారు. ఆత్మలు నిరాకారీ సంతానము. మళ్ళీ తండ్రి రచిస్తే, తప్పకుండా సాకార బ్రాహ్మణులనే రచిస్తారు. ప్రజాపిత బ్రహ్మా సాకారంలో ఉంటారు కదా. అది దత్తత తీసుకోవడం అవుతుంది. వారు ఒడిలోని పిల్లలు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా సృష్టిని ఏ విధంగా రచించారో మానవుల బుద్ధిలోకి ఏ మాత్రమూ రాదు.

ప్రజాపిత బ్రహ్మా సంతానమైన మీరు బ్రహ్మాకుమార్-కుమారీలు, సోదరీ-సోదరులు. చెడు దృష్టి ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో చాలామందకి ఇబ్బంది కలుగుతుంది. ఉన్నతోన్నతమైన పదవిని పొందాలంటే కష్టపడాలి. పవిత్రంగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. వీరిని కూడా కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. ఎంతో శ్రమ ఉంది. శ్రమ లేకుండా ఉన్నతంగా ఎలా అవుతారు? పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సోదర-సోదరీలు అంటే ఒక్క తండ్రి పిల్లలు అని అర్థము. మరి చెడు దృష్టి ఎందుకు వెళ్ళాలి? బాబా సరిగ్గా చెప్పారు, మాకు చెడు దృష్టి కలుగుతుందని పిల్లలు అర్థము చేసుకుంటారు. స్త్రీలకు కూడా కలుగుతుంది, పురుషులకు కూడా కలుగుతుంది. ఇది గమ్యము కదా! జ్ఞానమైతే చాలా వినిపిస్తారు, కానీ నడవడిక కూడా పవిత్రంగా ఉండాలి, కావున అన్నింటికంటే ఎక్కువగా మోసము చేసేవి కళ్ళు అని బాబా చెప్తారు. కళ్ళు వస్తువులను చూసినప్పుడు నోరు కూడా మ్యావ్-మ్యావ్ అని అంటుంది, అప్పుడు ఇది తినాలని మనసులో అనిపిస్తుంది, కావున ఈ కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పవిత్రమైన నడవడికను అలవరచుకోవాలి. చెడు దృష్టి, చెడు ఆలోచనలను సమాప్తం చేసుకునేందుకు స్వయాన్ని కర్మేంద్రియాల నుండి అతీతమైన ఆత్మనని భావించాలి.

2. పరస్పరంలో ఆత్మిక సంబంధాన్ని ఉంచుకోవాలి, రక్త సంబంధాన్ని కాదు. మీ అమూల్యమైన సమయాన్ని, ధనాన్ని వ్యర్థము చేయకూడదు. సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.

వరదానము:- బ్రహ్మ-ముహూర్త సమయంలో వరదానాలను తీసుకునే మరియు దానమునిచ్చే తండ్రి సమానమైన వరదాని, మహాదాని భవ

బ్రహ్మముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి అయిన తండ్రి, జ్ఞానసూర్యుని యొక్క లైట్-మైట్ కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు. వాటితో పాటు బ్రహ్మాబాబా భాగ్యవిధాత రూపంలో భాగ్యమనే అమృతాన్ని పంచుతారు, కేవలం బుద్ధి రూపి కలశం అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి. ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండకూడదు కావున మొత్తం రోజంతటికీ శ్రేష్ఠమైన స్థితిని తయారుచేసుకుని శ్రేష్ఠమైన కర్మలను చేసేందుకు ముహూర్తము తీయవచ్చు, ఎందుకంటే అమృతవేళలో వాతావరణమే వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది, అందువలన ఆ సమయంలో వరదానాలను తీసుకుంటూ దానమివ్వండి అనగా వరదానులుగా మరియు మహాదానులుగా అవ్వండి.

స్లోగన్:- క్రోధుల పని క్రోధము చేయడం మరియు మీ పని స్నేహమునివ్వడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *