Telugu Murli 01/08/2020

01-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – మీరు చదువు ద్వారా మీ కర్మాతీత స్థితిని తయారుచేసుకోవాలి, దీనితో పాటు ఇతరులకు పతితుల నుండి పావనంగా తయారయ్యే మార్గాన్ని కూడా తెలియజేయాలి, ఆత్మిక సేవను చేయాలి”

ప్రశ్న:– ఏ మంత్రమును గుర్తుంచుకున్నట్లైతే పాప కర్మల నుండి రక్షింపబడతారు?

జవాబు:– “చెడు వినకండి, చెడు చూడకండి”….. అనే మంత్రమును తండ్రి ఇచ్చారు. ఈ మంత్రమును గుర్తుంచుకోండి. మీరు మీ కర్మేంద్రియాలతో ఎటువంటి పాపమూ చేయకూడదు. కలియుగములో అందరి ద్వారా పాప కర్మలే జరుగుతూ ఉంటాయి, అందుకే బాబా ఈ యుక్తిని తెలియజేస్తూ ఉంటారు – పవిత్రతా గుణాన్ని ధారణ చేయండి, ఇదే నంబర్ వన్ గుణము.

ఓంశాంతి. పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? మేము పతితపావనుడు, సర్వుల సద్గతిదాత అయిన మా అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలో తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మా తనువులో ఉన్నా, వారినే (శివబాబానే) స్మృతి చేయాలి. మనుష్యులెవ్వరూ సర్వుల సద్గతిని చేయలేరు. మనుష్యులను పతితపావనులని అనడం జరగదు. పిల్లలు తమను తాము ఆత్మ అని అర్థము చేసుకోవాలి. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. ఆ తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారని పిల్లలు అర్థం చేసుకుని సంతోషంగా కూడా ఉండాలి. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని కూడా పిల్లలకు తెలుసు. చాలా సహజమైన మార్గము లభిస్తుంది. కేవలం స్మృతి చేయాలి మరియు స్వయంలో దైవీగుణాలను ధారణ చేయాలి. స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. ఈ ఉదాహరణలన్నీ జ్ఞానసాగరుడైన తండ్రియే ఇచ్చారు. సన్యాసులు ఇచ్చే ఉదాహరణలన్నీ తండ్రి ఇచ్చినవే. భక్తిమార్గంలో కేవలం పాడుతూ ఉంటారు. తాబేలు, సర్పము, భ్రమరముల యొక్క ఉదాహరణలు ఇస్తారు. కానీ వారు స్వయంగా ఏమీ చేయలేరు. తండ్రి ద్వారా ఇవ్వబడిన ఉదాహరణలను భక్తిమార్గంలో రిపీట్ చేస్తారు. భక్తి మార్గము గతించినదానికి స్మృతి చిహ్నము. ఈ సమయంలో ఏదైతే ప్రాక్టికల్ గా జరుగుతూ ఉందో, అదే తర్వాత గాయనం చేయబడుతుంది. దేవతల జన్మదినాన్ని లేక భగవంతుని జన్మదినాన్ని జరుపుకుంటారు కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకుంటూ ఉన్నారు. తండ్రి ద్వారా శిక్షణను తీసుకుని పతితుల నుండి పావనంగా కూడా అవుతారు, అంతేకాక పతితులకు పావనమయ్యే మార్గాన్ని కూడా తెలియజేస్తారు. ఇదే మీ ముఖ్యమైన ఆత్మిక సేవ. మొట్టమొదట ఎవరికైనా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. మీరు ఆత్మలు. ఆత్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అవినాశి. సమయము వచ్చినప్పుడు ఆత్మ శరీరములో ప్రవేశిస్తుంది కావున క్షణ-క్షణము స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మలైన మనకు తండ్రి పరమపిత పరమాత్మ. వారు పరమ శిక్షకుడు కూడా. ఇది కూడా ప్రతి క్షణము పిల్లలకు గుర్తుండాలి. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగంలో దైవీ పరివారము చాలా చిన్నదిగా ఉంటుంది. కలియుగంలో అనేకమంది మనుష్యులున్నారు. అనేక ధర్మాలు, అనేక మతాలున్నాయి. సత్యయుగంలో ఇవేమీ ఉండవు. పిల్లలు రోజంతా తమ బుద్ధిలోకి ఈ విషయాలను తీసుకురావాలి. ఇది చదువు కదా. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి ఉంటాయి. ప్రతి తరగతిలో కొత్త-కొత్త పుస్తకాలను కొనవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పుస్తకాలు, శాస్త్రాలు మొదలైనవాటి విషయమే లేదు. ఇందులో ఒకే విషయము, ఒకే చదువు ఉంది. ఇక్కడ బ్రిటీష్ ప్రభుత్వము ఉన్నప్పుడు, రాజుల రాజ్యముండేది, అప్పుడు స్టాంపులపై కూడా రాజా-రాణులది తప్ప ఇంకెవ్వరి చిత్రాలనూ వేసేవారు కాదు. ఈ రోజుల్లో భక్తులు మొదలైన వారెవరైతే వచ్చి వెళ్ళారో, వారి స్టాంపులను కూడా తయారుచేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు, చిత్రం కూడా ఒక్క మహారాజు-మహారాణులది మాత్రమే ఉంటుంది. అలాగని గతించిన దేవతల చిత్రాలు తొలగిపోతాయని కాదు. అతి పురాతనమైన దేవతల చిత్రాలను చాలా మనస్ఫూర్తిగా తీసుకుంటారు, ఎందుకంటే శివబాబా తర్వాత ముఖ్యమైనవారు దేవతలే. ఇతరులకు మార్గాన్ని తెలియజేసేందుకు మీరు ఈ విషయాలన్నీ ధారణ చేస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. దీనిని మీరు మాత్రమే విని పదవిని కూడా పొందారు, ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు పరమపిత పరమాత్మ రాజయోగమును నేర్పిస్తున్నారు. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనది. ఏమవుతుందో ముందు-ముందు చూస్తాము. ఒకరు ఒకటి చెప్తే, మరొకరు మరొకటి చెప్తారు. రోజురోజుకూ మనుష్యులకు ఈ విషయాలు టచ్ అవుతూ ఉంటాయి. ప్రపంచ యుద్ధము జరగబోతుందని కూడా చెప్తారు. దానికంటే ముందు పిల్లలైన మీరు చదువు ద్వారా కర్మాతీత స్థితిని ప్రాప్తించుకోవాలి. అంతేకానీ అసురులు మరియు దేవతల యుద్ధమేదీ జరగదు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు, తర్వాత వెళ్ళి దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతారు, అందుకే ఈ జన్మలో దైవీగుణాలను ధారణ చేస్తున్నారు. పవిత్రతయే నంబరువన్ దైవీ గుణము. మీరు ఈ శరీరము ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ వచ్చారు. ఆత్మనే పాపాత్మ అని అంటారు, ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చెడు వినవద్దు….. అని ఎవరికి చెప్పడం జరుగుతుంది? ఆత్మకు. ఆత్మనే చెవుల ద్వారా వింటుంది. మీరు ఆదిసనాతన దేవీదేవతా ధర్మము వారని, చక్రములో తిరుగుతూ ఇప్పుడు మళ్ళీ అలాగే తయారవ్వాలని తండ్రి మీకు స్మృతిని కలిగించారు. ఈ మధురమైన స్మృతి కలగగానే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యము వస్తుంది. మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయించామో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట మనమిలా ఉండేవారము. ఇది కథ కదా. 5 వేల సంవత్సరాల క్రితము మేము దేవతలుగా ఉండేవారమని బుద్ధిలోకి రావాలి. ఆత్మలమైన మనము మూలవతనంలో నివసించేవారము. ఆత్మలమైన మనకు అది ఇల్లు అని ఇంతకుముందు కొద్దిగా కూడా తెలియదు. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాము. సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా…. అయ్యాము. ఇప్పుడు బ్రహ్మా సంతానమైన మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు కూర్చుని మీకు శిక్షణనిస్తున్నారు. వీరు ఉన్నతోన్నతుడైన తండ్రి, శిక్షకుడు, గురువు కూడా. మనము వారి మతం ద్వారా మనుష్యులందరినీ శ్రేష్ఠంగా చేస్తున్నాము. ముక్తి-జీవన్ముక్తి రెండూ శ్రేష్ఠమైనవే. మనము మన ఇంటికి వెళ్తాము, తరువాత పవిత్ర ఆత్మలుగా తయారై ఇక్కడకు వచ్చి రాజ్యపాలన చేస్తాము. ఇది చక్రము కదా. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. ఇవి జ్ఞానపు విషయాలు. మీరు తిప్పే ఈ స్వదర్శన చక్రము ఆగకూడదని తండ్రి చెప్తున్నారు. తిరుగుతూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఈ రావణునిపై విజయము పొందుతారు. పాపాలు తొలగిపోతాయి. స్మరించేందుకు ఇప్పుడు స్మృతి కలిగింది. అలాగని కూర్చుని మాలను స్మరించడం కాదు. ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని పిల్లలైన మీరు ఇతర సోదరీ-సోదరులకు అర్థం చేయించాలి. పిల్లలు కూడా సహయోగులుగా అవుతారు కదా. పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. ఈ జ్ఞానము నాలో ఉంది కావుననే నన్ను జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని అంటారు. వారిని తోట యజమాని అని అంటారు. దేవీదేవతా ధర్మము యొక్క బీజాన్ని శివబాబాయే నాటారు. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. ఇది రోజంతా స్మరణ చేస్తూ ఉన్నా కూడా మీకు ఎంతో కళ్యాణమౌతుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పవిత్రంగా కూడా అవ్వాలి. స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ, పవిత్రంగా అవుతారు. ఇటువంటి ధర్మము మరేదీ ఉండదు. పురుషులు మాత్రమే నివృత్తి మార్గానికి చెందినవారిగా అవుతారు. స్త్రీ-పురుషులు ఇరువురూ కలిసి పవిత్రంగా ఉండడం కష్టమని అంటారు కదా. సత్యయుగంలో ఉండేవారు కదా. లక్ష్మీనారాయణుల మహిమను కూడా పాడ్తారు.

బాబా మమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. మళ్ళీ వామమార్గములోకి వెళ్ళినప్పుడు శివుని మందిరాలను తయారుచేసి పూజలు చేస్తాము. పిల్లలైన మీకు మీ 84 జన్మల జ్ఞానముంది. మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియజేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇలా ఇతర ఏ మనుష్యులూ కూడా చెప్పలేరు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా తయారుచేస్తారు. ఆత్మలైన మీరు పవిత్రంగా అవుతున్నారు. శరీరమైతే ఇక్కడ పవిత్రంగా అవ్వలేదు. ఆత్మ పవిత్రంగా అయినప్పుడు అపవిత్ర శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. ఆత్మలన్నీ పవిత్రంగా అయి వెళ్ళాలి. ఇప్పుడు పవిత్ర ప్రపంచము స్థాపనవుతుంది. మిగిలినవారంతా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది గుర్తుంచుకోవాలి.

బాబా స్మృతితో పాటు ఇంటి స్మృతి కూడా తప్పకుండా కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. తండ్రిని ఇంట్లోనే స్మృతి చేయాలి. బాబా ఈ తనువులో ప్రవేశించి వినిపిస్తున్నారని మీకు తెలిసినా, బుద్ధి మధురమైన ఇల్లు అయిన పరంధామము నుండి తొలగిపోకూడదు. ఇంటిని వదిలి టీచర్ మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. చదివించి మళ్ళీ చాలా దూరము వెళ్ళిపోతారు. వారు క్షణములో ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆత్మ ఎంత చిన్న బిందువు, ఆశ్చర్యపోవాలి. ఆత్మ జ్ఞానాన్ని కూడా తండ్రి ఇచ్చారు. స్వర్గములో కాళ్ళు-చేతులు లేక బట్టలు మురికిపట్టే విధంగా ఏ వస్తువూ ఉండదని మీకు తెలుసు. దేవతలకు స్వర్గములో ఎంత మంచి పాలన ఉంటుంది. ఎంత ఫస్ట్ క్లాస్ వస్త్రాలు ఉంటాయి. ఉతికే అవసరము కూడా ఉండదు. వీరిని చూసి ఎంత సంతోషము కలగాలి. భవిష్య 21 జన్మలకు మనమిలా అవుతామని ఆత్మకు తెలుసు. అలా చూస్తూనే ఉండిపోవాలి. ఈ చిత్రము అందరి వద్దా ఉండాలి. మమ్మల్ని బాబా ఇలా తయారుచేస్తున్నారని చాలా సంతోషముండాలి. అటువంటి తండ్రికి పిల్లలైన మనము ఎందుకు ఏడవాలి! మనకు ఎటువంటి చింతా ఉండకూడదు. దేవతల మందిరాల్లోకి వెళ్ళి – సర్వగుణ సంపన్నులు….. అచ్యుతమ్ కేశవమ్….. ఎన్నో పేర్లు చెప్తూ వారి మహిమను గానము చేస్తూ ఉంటారు. ఇవన్నీ శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు, వాటినే స్మృతి చేస్తూ ఉంటారు. శాస్త్రాలలో ఎవరు వ్రాశారు? వ్యాసుడు. లేకపోతే ఇంకా కొత్త-కొత్తవారు కూడా శాస్త్రాలు తయారుచేస్తూ ఉంటారు. గ్రంథము చేతితో వ్రాయబడి ఎంతో చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఎంత పెద్దదిగా చేసేశారు. తప్పకుండా ఏదో ఒకటి చేర్చి ఉంటారు. గురునానక్ ధర్మస్థాపనను చేసేందుకే వస్తారు. జ్ఞానమును ఇచ్చేవారైతే ఒక్కరే. క్రీస్తు కూడా కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇంటికి పంపించేవారెవరు? క్రీస్తు పంపుతారా? లేదు. వారు వేరే నామ-రూపాలతో తమోప్రధాన స్థితిలో ఉన్నారు. సతో, రజో, తమోలలోకి వస్తారు కదా. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. అందరూ శిథిలావస్థలో ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అన్ని ధర్మాల వారు ఈ సమయంలోకి వచ్చి తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు తప్పకుండా అందరూ తిరిగి వెళ్ళాలి. చక్రము మళ్ళీ తిరగాల్సిందే. మొట్టమొదట సత్యయుగంలో ఉన్న కొత్త ధర్మము స్థాపనవ్వాలి. తండ్రియే స్వయంగా వచ్చి ఆదిసనాతన దేవీదేవతా ధర్మమును స్థాపన చేస్తారు. మళ్ళీ వినాశనము కూడా జరగాలి. స్థాపన, వినాశనము, ఆ తర్వాత పాలన. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. ఇది స్మృతిలోకి వస్తుంది కదా. పూర్తి చక్రమంతటినీ స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి తిరిగి మన ఇంటికి వెళ్తాము. మీరు మాట్లాడుతూ, తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు. దీనినే వారు కృష్ణుడి చేతిలో స్వదర్శన చక్రముండేదని, దానితో అందరినీ సంహరించారని అంటారు. అకాసురుడు, బకాసురుడు మొదలైనవారి చిత్రాలను చూపిస్తారు. కానీ అటువంటి విషయమేమీ లేదు.

పిల్లలైన మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అయి ఉండాలి. స్వదర్శన చక్రము ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. అసురత్వము సమాప్తమౌతుంది. దేవతలు మరియు అసురుల యుద్ధం జరగదు. అసురులు కలియుగములో, దేవతలు సత్యయుగములో ఉంటారు. మధ్యలో సంగమయుగం ఉంది. శాస్త్రాలు భక్తిమార్గములోనివి. జ్ఞానము యొక్క నామ-రూపాలే లేవు. అందరికీ జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే. తండ్రి లేకుండా ఏ ఆత్మ కూడా పవిత్రంగా అయి తిరిగి వెళ్ళలేదు. పాత్రను తప్పకుండా అభినయించాల్సిందే, కావున ఇప్పుడు మీ 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. మనమిప్పుడు సత్యయుగంలో కొత్త జన్మలోకి వెళ్తాము. ఇటువంటి జన్మ మరెప్పుడూ లభించదు. శివబాబా, తర్వాత బ్రహ్మాబాబా. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు వీరు అలౌకిక తండ్రి. ఈ విషయాలు ఇప్పటివే, వీరిని అలౌకిక తండ్రి అని అంటారు. పిల్లలైన మీరు ఆ శివబాబాను స్మరిస్తూ ఉంటారు. బ్రహ్మాను స్మృతి చేయరు. బ్రహ్మా మందిరంలోకి వెళ్ళి పూజిస్తారు కానీ అది కూడా సూక్ష్మవతనానికి వెళ్ళి సంపూర్ణ అవ్యక్తమూర్తి అయినప్పుడే పూజిస్తారు. ఈ శరీరధారి పూజకు యోగ్యులు కాదు. వీరు మనిషి కదా. మనుష్యులకు పూజ జరగదు. బ్రహ్మా ఇక్కడకు చెందినవారు అన్నదానికి గుర్తుగా గడ్డమును కూడా చూపిస్తారు. దేవతలకు గడ్డము ఉండదు. ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయించబడినవి. మీ పేరు ప్రసిద్ధమయ్యింది, కావున మీ మందిరాలు కూడా తయారుచేయబడ్డాయి. సోమనాథ మందిరము ఎంత ఉన్నతాతి-ఉన్నతమైనది! సోమ రసమును త్రాగించారు, ఆ తర్వాత ఏమయింది? మళ్ళీ ఇక్కడ కూడా దిల్వాడా మందిరాన్ని చూడండి. మందిరము పూర్తిగా స్మృతి చిహ్నంగా తయారయింది. క్రింద మీరు తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గముంది. మందిరములో కూడా క్రింద స్వర్గమును తయారుచేయలేరు కావుననే పైన చూపించారు. తయారుచేసేవారు ఏమీ అర్థం చేసుకోరు. గొప్ప-గొప్ప కోటీశ్వరులు ఉన్నారు, వారికి ఇవి అర్థం చేయించాలి. మీకిప్పుడు జ్ఞానము లభించింది కావున అనేకులకు ఇవ్వవచ్చు. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపల ఉన్న ఆసురీతనాన్ని సమాప్తము చేసేందుకు నడుస్తూ-తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా అయి ఉండాలి. పూర్తి చక్రమంతా స్మృతిలోకి తీసుకురావాలి.

2. తండ్రి స్మృతితో పాటు బుద్ధి మన ఇల్లైన పరంధామము వైపు కూడా జోడించబడి ఉండాలి. తండ్రి ఏవైతే స్మృతులను కలిగించారో, వాటిని స్మరించుకుంటూ తమ కళ్యాణాన్ని చేసుకోవాలి.

వరదానము:- సంపూర్ణ ఆహుతి ద్వారా పరివర్తన సమారోహాన్ని జరుపుకునే దృఢ సంకల్పధారీ భవ

“ధరణి బద్దలైనా ధర్మాన్ని విడవకండి” అనే సామెత ఉంది కదా. కనుక ఎటువంటి పరిస్థితులొచ్చినా, మాయ మహావీర రూపంలో మీ ముందుకొచ్చినా, ధారణలను విడవకండి. సంకల్పము ద్వారా త్యాగము చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించవద్దు. సదా తమ శ్రేష్ఠ స్వమానము, శ్రేష్ఠ స్మృతి మరియు శ్రేష్ఠ జీవితము యొక్క సమర్థ స్వరూపము ద్వారా శ్రేష్ఠ పాత్రధారులుగా అయి శ్రేష్ఠత యొక్క ఆటను ఆడుతూ ఉండండి. బలహీనతల ఆటలన్నీ సమాప్తమైపోవాలి. ఎప్పుడైతే ఇటువంటి సంపూర్ణ ఆహుతి చేసే సంకల్పము దృఢంగా ఉంటుందో, అప్పుడు పరివర్తన సమారోహం జరుగుతుంది. ఈ సమారోహము జరిగే తేదీని ఇప్పుడు సంగఠిత రూపంలో నిశ్చితం చేయండి.

స్లోగన్:- రియల్ (సత్యమైన) వజ్రంగా అయి మీ వైబ్రేషన్ల మెరుపును విశ్వంలో వ్యాపింపజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *