Telugu Murli 10/08/20

10-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ – మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నిటికంటే పెద్ద పొరపాటు, ఇప్పుడు మీరు పొరపాట్లు చేయనివారిగా అవ్వాలి, మీ ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చెయ్యాలి”

ప్రశ్న:- పిల్లలైన మీ యొక్క ఏ స్థితి సమయం సమీపంగా వస్తుందని సూచిస్తుంది?

జవాబు:- ఎప్పుడైతే పిల్లలైన మీరు స్మృతియాత్రలో సదా ఆనందంగా ఉంటారో, బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుందో, వాణిలో స్మృతి యొక్క పదును వస్తుందో, అపారమైన సంతోషంలో ఉంటారో, క్షణ-క్షణము మీ సత్యయుగీ ప్రపంచ దృశ్యాలు ఎదురుగా వస్తూ ఉంటాయో, అప్పుడు సమయం సమీపంగా ఉందని అర్థము చేసుకోండి. వినాశనమయ్యేందుకు సమయం పట్టదు, దీని కోసం స్మృతి చార్టును పెంచాలి.

గీతము:- మిమ్మల్ని పొంది మేము విశ్వాన్నే పొందాము… (తుమ్ హే పాకే హమ్ నే జహాన్ పాలియా హై…)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఈ పాట అర్థం తెలిసి ఉంటుంది. ఇప్పుడు అనంతమైన తండ్రినైతే పొందారు. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది, ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు ఈ వారసత్వం యొక్క నషా దూరమైపోతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనే విషయంలో సృష్టి డ్రామా గురించిన జ్ఞానము కూడా ఉంది. దీనిని నాటకము అని కూడా అంటారు, డ్రామా అని కూడా అంటారు. తండ్రి తప్పకుండా వచ్చి సృష్టిచక్రాన్ని కూడా అర్థం చేయిస్తారని పిల్లలకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారిగా ఉంటారో, వారికే అర్థము చేయిస్తారు. పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను మీకు అర్థం చేయిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాత, ఒక మనుష్య జన్మ లభిస్తుందని ఇంతకుముందు మీరు వినేవారు. కానీ అలా జరగదు. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ నంబరువారుగా వస్తూ ఉంటారు. మొట్టమొదట మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన పూజ్యులుగా ఉండేవారము, ఆ తర్వాత మేమే పూజారులుగా అయ్యాము అని మీ బుద్ధిలో ఉంది. మీరే పూజ్యులు, మీరే పూజారులు – అని గాయనం కూడా ఉంది. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారని మనుష్యులు భగవంతుని కోసం భావిస్తారు. ఈ రూపాలన్నీ మీవే. అనేక అభిప్రాయాలున్నాయి కదా. మీరిప్పుడు శ్రీమతంపై నడుస్తున్నారు. విద్యార్థులమైన మాకు ఇంతకుముందు ఏమీ తెలియదు, మేము తర్వాత చదువుకుని ఉన్నతమైన పరీక్షలో ఉత్తీర్ణులవుతూ ఉంటామని మీకు తెలుసు. ఆ విద్యార్థులకు కూడా మొదట ఏమీ తెలియదు, తర్వాత పరీక్షలు పాస్ అవుతూ-అవుతూ ఇప్పుడు మేము బ్యారిస్టరీ పాస్ అయ్యామని భావిస్తారు. మేము చదువుకుని మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము, అది కూడా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని ఇప్పుడు మీకు కూడా తెలుసు. అక్కడ అయితే ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటుంది. మీ రాజ్యాన్ని ఎవరూ లాక్కోలేరు. అక్కడ మీకు పవిత్రత-శాంతి-సుఖము-సంపద అన్నీ ఉంటాయి. పాటలో కూడా విన్నారు కదా. ఇప్పుడు ఈ పాటను మీరైతే తయారుచేయలేదు. అనుకోకుండానే డ్రామా అనుసారంగా ఈ సమయం కోసమే ఇవి తయారయ్యాయి. మనుష్యుల ద్వారా తయారుచేయబడిన పాటల అర్థాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరిక్కడ శాంతిగా కూర్చుని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు, దీనిని ఎవ్వరూ లాక్కోలేరు. అర్థకల్పము సుఖ వారసత్వము ఉంటుంది. తండ్రి చెప్తున్నారు – మధురాతి-మధురమైన పిల్లలూ, అర్థకల్పము కంటే ఎక్కువగా మీరు సుఖాన్ని అనుభవిస్తారు, తర్వాత రావణ రాజ్యము ప్రారంభమౌతుంది. దేవతలు వామమార్గములోకి ఎలా వెళ్తారు అని చూపించే చిత్రాలు గల మందిరాలు కూడా ఉన్నాయి. వస్త్రాలు అవే ఉంటాయి. వస్త్రాలు తర్వాత మారుతాయి. ప్రతి ఒక్క రాజుకు తమ-తమ వస్త్రాలు, కిరీటాలు మొదలైనవన్నీ వేర్వేరుగా ఉంటాయి.

మనము శివబాబా నుండి బ్రహ్మా ద్వారా వారసత్వము తీసుకుంటున్నామని పిల్లలకిప్పుడు తెలుసు. బాబా అయితే పిల్లలూ-పిల్లలూ అనే పిలుస్తారు. పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు. వినేది ఆత్మయే కదా. మనం ఒక ఆత్మ, శరీరము కాదు. మిగిలిన మనుష్యమాత్రులందరికీ తమ శరీరాల యొక్క పేర్ల గురించి నషా ఉంటుంది ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. మేము ఒక ఆత్మ అన్న విషయమే తెలియదు. వారైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేస్తారు. ఆత్మలైన మీరు విశ్వానికి యజమానులుగా, దేవీ-దేవతలుగా తయారవుతున్నారు అని ఇప్పుడు తండ్రి మీకు అర్థము చేయించారు. మేమే దేవతలుగా అవుతాము, తర్వాత మేమే క్షత్రియ వంశములోకి వస్తాము అనే జ్ఞానము ఇప్పుడు ఉంది. 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరూ ఒకేసారి రారు. ఏ ధర్మము ఎలా వస్తూ ఉంటుందో మీకు తెలుసు. పాత చరిత్ర మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది. ఇప్పుడిది పతిత ప్రపంచము. అది పావన ప్రపంచము. తర్వాత వేర్వేరు ధర్మాలు వస్తాయి, ఇక్కడ కర్మక్షేత్రములో ఈ ఒక్క నాటకము మాత్రమే నడుస్తుంది. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. ఈ సంగమంలో తండ్రి వచ్చి బ్రాహ్మణ సంప్రదాయాన్ని స్థాపన చేస్తారు. విరాట రూప చిత్రాన్ని తయారుచేస్తారు కానీ అందులో ఈ తప్పు ఉంది. తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థము చేయించి పొరపాటు చేయనివారిగా తయారుచేస్తారు. తండ్రి ఎప్పుడూ శరీరములోకి రారు, పొరపాటు చేయరు. వారు పిల్లలైన మీకు సుఖధామానికి మరియు మీ ఇంటికి మార్గాన్ని తెలియజేసేందుకు కొద్ది సమయము కోసమే వీరి రథములోకి వస్తారు. కేవలం మార్గాన్ని తెలియజేయడమే కాక జీవితాన్ని కూడా తయారుచేస్తారు. కల్ప-కల్పము మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత సుఖం యొక్క పాత్రను కూడా అభినయిస్తారు. ఆత్మలైన మన స్వధర్మమే శాంతి అని పిల్లలు మర్చిపోయారు. ఈ దుఃఖపు ప్రపంచములో శాంతి ఎలా ఉంటుంది – ఈ విషయాలన్నీ మీరు అర్థము చేసుకున్నారు. మీరు అందరికీ అర్థము చేయిస్తారు కూడా. నెమ్మది-నెమ్మదిగా అందరూ వస్తూ ఉంటారు, ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, దీనికి ఎంత ఆయుష్షు ఉంటుంది అనే విషయము విదేశీయులకు కూడా తెలుస్తుంది. విదేశీయులు కూడా మీ వద్దకు వస్తారు లేక పిల్లలు అక్కడికి వెళ్ళి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థము చేయిస్తారు. క్రీస్తు భగవంతుని వద్దకు వెళ్ళి చేరుకున్నారని వారు భావిస్తారు. క్రీస్తును భగవంతుని పుత్రుడని భావిస్తారు. కొందరు క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు నిరుపేదగా అయ్యారని భావిస్తారు. ఏ విధంగా మీరు కూడా నిరుపేదలుగా అయ్యారు కదా. నిరుపేదలు అనగా తమోప్రధానమైనవారు. క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారని అనుకుంటారు, మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. మీ ధర్మస్థాపకుడు మళ్ళీ అతని సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని మీరు అర్థము చేయించవచ్చు. వారిని గురువు అని అనలేరు. వారు ధర్మ స్థాపన చేసేందుకు వస్తారు. సద్గతిదాత కేవలం ఒక్కరు మాత్రమే, ధర్మస్థాపన చేసేందుకు వచ్చే వారంతా పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. చివరిలో మొత్తం వృక్షము శిథిలావస్థను చేరుకుంది. ఇప్పుడు మొత్తం వృక్షం నిలబడి ఉంది కానీ దేవీ-దేవతా ధర్మము అనేటటువంటి పునాది లేదని మీకు తెలుసు (మర్రి చెట్టు ఉదాహరణ). ఈ విషయాలను తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. మేమే దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నామని మీకు తెలుసు. సత్యనారాయణ కథను వినడానికే మీరు ఇక్కడకు వస్తారు, ఈ కథతో మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. నారాయణుడిగా అయినప్పుడు తప్పకుండా లక్ష్మి కూడా ఉంటారు. లక్ష్మీ-నారాయణులు ఉన్నట్లయితే తప్పకుండా వారి రాజధాని కూడా ఉంటుంది కదా. ఒంటరిగా లక్ష్మీ-నారాయణులు మాత్రమే ఉండరు. లక్ష్మిగా అయ్యే కథ వేరుగా ఉండదు. నారాయణునితో పాటు లక్ష్మి కూడా తయారవుతారు. లక్ష్మి కూడా అప్పుడప్పుడు నారాయణునిగా అవుతారు. నారాయణుడు కూడా మళ్ళీ లక్ష్మిగా అవుతారు. కొన్ని-కొన్ని పాటలు చాలా బాగుంటాయి. మాయ ఆటంకాలు వచ్చినప్పుడు పాటలు వినడం ద్వారా హర్షితముగా అవుతారు. ఈత నేర్చుకునేటప్పుడు మొదట గుటకలు మింగుతారు, అప్పుడు వారిని పట్టుకుంటారు. ఇక్కడ కూడా చాలా మంది మాయ దెబ్బలు తింటారు. ఈదేవారు అయితే చాలా మంది ఉంటారు. వారి రేస్ కూడా జరుగుతుంది, అలాగే ఆ తీరానికి చేరేటటువంటి మీ రేస్ కూడా ఉంటుంది. నన్నొక్కరినే స్మృతి చేయాలి. స్మృతి చేయకపోతే గుటకలు మింగుతారు. స్మృతియాత్రతోనే నావ తీరానికి చేరుతుందని, మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారని తండ్రి చెప్తున్నారు. కొందరు ఈతగాళ్ళు చాలా చురుకుగా ఉంటారు, కొందరు అంత చురుకుగా ఉండరు. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు. బాబా వద్దకు చార్టు పంపుతారు. స్మృతి చార్టును వీరు సరిగ్గా అర్థము చేసుకున్నారా లేక తప్పుగా అర్థము చేసుకున్నారా అని బాబా పరిశీలిస్తారు. కొందరు, మేము రోజంతటిలో 5 గంటలు స్మృతిలో ఉన్నామని చూపిస్తారు. నేను నమ్మను, తప్పకుండా పొరపాటు జరిగి ఉంటుంది. మేము ఎంత సమయమైతే ఇక్కడ చదువుతామో, అంత సమయమైతే చార్టు బాగుంటుందని కొందరు భావిస్తారు. కానీ అలా ఉండదు. చాలామందికి ఇక్కడ కూర్చున్నా కూడా, వింటున్నా కూడా బుద్ధి ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళిపోతుంది. పూర్తిగా వినరు కూడా. భక్తి మార్గములో ఇలా జరుగుతుంది. సన్యాసులు కథను వినిపిస్తారు, మళ్ళీ మధ్య-మధ్యలో నేనేమి చెప్పాను అని అడుగుతారు. వీరు వెర్రివాని వలె కూర్చుని ఉన్నారని గ్రహించి ప్రశ్నిస్తారు, అటువంటివారు సమాధానము చెప్పలేరు. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక్క పదం కూడా వినరు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బాబా చూస్తూ ఉంటారు – వీరి బుద్ధి ఎక్కడో బయట భ్రమిస్తూ ఉందని అర్థము చేసుకుంటారు. అటూ-ఇటూ చూస్తూ ఉంటారు. అటువంటి క్రొత్తవారు కూడా కొందరు వస్తారు. వీరు పూర్తిగా అర్థము చేసుకోలేదని బాబా అర్థం చేసుకుంటారు కనుక క్రొత్త-క్రొత్త వారిని వెంటనే ఇక్కడ క్లాసులోకి వచ్చేందుకు అనుమతినివ్వకండి, లేకపోతే వారు వాయుమండలాన్ని పాడు చేస్తారని బాబా అంటారు. ఎవరైతే మంచి-మంచి పిల్లలుంటారో, వారు ఇక్కడ కూర్చుని-కూర్చుని వైకుంఠంలోకి వెళ్ళిపోవడాన్ని మున్ముందు మీరు చూస్తారు. చాలా సంతోషము కలుగుతూ ఉంటుంది. పదే-పదే వెళ్ళిపోతూ ఉంటారు – ఇప్పుడు సమయం సమీపముగా ఉంది. నంబరువారు పురుషార్థానుసారంగా మీ స్థితి ఈ విధంగా తయారవుతుంది. పదే-పదే స్వర్గములో మీ మహళ్ళను చూస్తూ ఉంటారు. ఏదైతే చెప్పవలసి ఉంటుందో, చేయవలసి ఉంటుందో, అది సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. సమయాన్నైతే చూస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్క సెకండులో మొత్తం ప్రపంచములోని మనుష్యులు ఏ విధంగా బూడిదలో కలిసిపోతారో చూడండి అని తండ్రి చెప్తున్నారు. బాంబు వేయగానే అంతమైపోతారు.

ఇప్పుడు మన రాజ్య స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్మృతి యాత్రలో ఆనందంగా ఉండాలి. ఎవ్వరికైనా దృష్టి ద్వారా బాణము తగిలే విధంగా, అటువంటి పదునును నింపుకోవాలి. అంతిమంలో భీష్మ పితామహుడు మొదలైనవారికి మీరే జ్ఞాన బాణాలు వేశారు. వీరు సత్యము చెప్తున్నారని వెంటనే అర్థము చేసుకుంటారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనడు అయితే నిరాకార భగవంతుడు. కృష్ణుడు కాదు. వారి జన్మను చూపిస్తారు. కృష్ణుడికున్న అవే రూపురేఖలు మళ్ళీ ఎప్పుడూ ఉండవు. మళ్ళీ సత్యయుగములో అవే రూపురేఖలు లభిస్తాయి. ప్రతి జన్మలో, ప్రతి ఒక్కరి రూపురేఖలు వేర్వేరుగా ఉంటాయి. ఈ డ్రామా పాత్ర ఆ విధంగా రచింపబడి ఉంది. అక్కడైతే సహజమైన, సుందరమైన రూపురేఖలుంటాయి. ఇప్పుడైతే రోజు-రోజుకూ తనువులు కూడా తమోప్రధానంగా అవుతూ ఉంటాయి. మొట్టమొదట సతోప్రధానంగా, ఆ తర్వాత సతో-రజో-తమోగా అయిపోతాయి. ఇక్కడ ఎటువంటి పిల్లలు జన్మిస్తారో చూడండి. కొందరికి కాళ్ళు ఉండవు, కొందరు మరుగుజ్జులుగా ఉంటారు. ఏ విధంగా ఉంటారో చూడండి. సత్యయుగంలో అలా ఉండరు. అక్కడ దేవతలకు గడ్డము మొదలైనవి కూడా ఉండవు. క్లీన్ షేవ్ ఉంటుంది. వీరు స్త్రీ, వీరు పురుషుడు అని నయనాలు-నడవడిక ద్వారా తెలుస్తుంది. మున్ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. బాబా కల్ప-కల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారని పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. ఇతర ధర్మాల వారందరూ వారి-వారి విభాగాలలోకి వెళ్ళిపోతారని కూడా పిల్లలైన మీకు తెలుసు. ఆత్మల వృక్షాన్ని కూడా చూపిస్తారు కదా. చిత్రాలలో చాలా కరక్షన్స్ చేస్తారు, మార్పులు జరుగుతూ ఉంటాయి. బాబా సూక్ష్మవతనము గురించి అర్థము చేయిస్తారు, సంశయబుద్ధి కలవారైతే ఇదేమిటి, మొదట ఇలా చెప్పేవారు, ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని అంటారు. లక్ష్మీ-నారాయణుల రెండు రూపాలను కలిపి విష్ణువు అని అంటారు. అంతేకానీ నాలుగు భుజాల మనుష్యులుండరు. రావణునికి పది తలలు చూపిస్తారు. అటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ప్రతి సంవత్సరము కాలుస్తారు, ఇది బొమ్మలాట వంటిది.

శాస్త్రాలు లేకుండా మేము జీవించలేము, శాస్త్రాలైతే మా ప్రాణము అని మనుష్యులు అంటారు. గీతకు ఎంతగా గౌరవముంటుందో చూడండి. ఇక్కడైతే మీ వద్ద అనేక మురళీలు పోగవుతాయి. మీరు ఉంచుకుని ఏమి చేస్తారు! రోజు-రోజుకూ మీరు క్రొత్త-క్రొత్త పాయింట్లు వింటూ ఉంటారు. అవును, పాయింట్లు నోట్ చేసుకోవడం మంచిదే. భాషణ చేసే సమయంలో ఈ-ఈ పాయింట్లు అర్థం చేయించాలని రిహార్సల్ చేస్తారు. టాపిక్స్ లిస్ట్ ఉండాలి. ఈ రోజు ఈ టాపిక్ గురించి అర్థం చేయిస్తాము, రావణుడు ఎవరు? రాముడు ఎవరు? సత్యమేమిటో మేము మీకు తెలియజేస్తాము. ఈ సమయంలో ప్రపంచమంతా రావణ రాజ్యముంది. అందరిలో 5 వికారాలున్నాయి. తండ్రి వచ్చి మళ్ళీ రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఇది గెలుపు-ఓటముల ఆట. 5 వికారాల రూపీ రావణుని వలన ఓటమి ఎలా కలుగుతుంది! ఒకప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమముండేది, అది ఇప్పుడు పతితంగా అయిపోయింది. లక్ష్మీ-నారాయణులే మళ్ళీ బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను అని తండ్రి కూడా చెప్తున్నారు. మేము కూడా అనేక జన్మల అంతిమంలో తండ్రి నుండి జ్ఞానము తీసుకుంటున్నామని మీరు చెప్తారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా మంద బుద్ధి కలిగి ఉంటే, వారు అర్థము చేసుకోరు. ఇక్కడైతే రాజధాని స్థాపన జరుగుతుంది. చాలా మంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, వారు మళ్ళీ వస్తారు. ప్రజలలో చాలా తక్కువ పదవిని పొందుతారు. వారు కూడా కావాలి కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేమిప్పుడు ఈ చదువును పూర్తి చేసుకుని మనుష్యుల నుండి దేవతలుగా అనగా విశ్వానికి యజమానులుగా అవుతాము, మా రాజ్యములో పవిత్రత-సుఖం-శాంతి అన్నీ ఉంటాయి, ఈ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అన్న నషా సదా ఉండాలి.

2. ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళేందుకు స్మృతియాత్రలో మంచి ఈతగాడిలా అవ్వాలి. మాయ ద్వారా గుటకలు మింగకూడదు. స్వయాన్ని పరిశీలించుకోవాలి, స్మృతి చార్టును యథార్థంగా అర్థము చేసుకుని వ్రాయాలి.

వరదానము:- శ్రేష్ఠమైన వేళ ఆధారముతో సర్వ ప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసే పదమాపదమ్ భాగ్యశాలీ భవ

శ్రేష్ఠమైన వేళలో జన్మ తీసుకునే భాగ్యశాలి పిల్లలు, కల్ప క్రితపు టచింగ్ ఆధారముతో జన్మిస్తూనే వీరంతా తమవారు అన్న అనుభవం చేస్తారు. వారు జన్మిస్తూనే ఆస్తినంతటికీ అధికారులుగా అవుతారు. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం ఇమిడి ఉంటుందో, అదే విధంగా నంబర్ వన్ వేళలోని ఆత్మలు, ఇక్కడకు రావడంతోనే సర్వ స్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాకు అనుభవజ్ఞులుగా అయిపోతారు. వారెప్పుడూ, సుఖం అనుభవమవుతుంది కానీ శాంతి అనుభవమవ్వడం లేదు, లేదా శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము మరియు శక్తి అనుభవమవ్వడం లేదు అని అనరు. అన్ని అనుభవాలతో సంపన్నంగా ఉంటారు.

స్లోగన్:- మీ ప్రసన్నతా ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మానచిత్తులుగా అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *