Telugu Murli 12/08/20

12-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైన పిల్లలూ – మీరు ఆసురీ మతాన్ని అనుసరించడం వలన చెల్లా చెదురైపోయారు, ఇప్పుడు ఈశ్వరీయ మతాన్ని అనుసరించినట్లయితే సుఖధామానికి వెళ్ళిపోతారు”

ప్రశ్న:- పిల్లలు తండ్రిపై ఏ ఆశను పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు?

జవాబు:- మేము తండ్రి ద్వారా పవిత్రంగా అయి మా ఇంటికి మరియు రాజధానికి వెళ్ళాలి అన్న ఆశను పెట్టుకోవాలి. పిల్లలూ, ఫలానావారు అనారోగ్యంతో ఉన్నారు, వారిని ఆశీర్వదించండి అనేటటువంటి ఆశను నాపై పెట్టుకోకండి అని బాబా చెప్తున్నారు. ఇక్కడ కృప లేక ఆశీర్వాదాల విషయమే లేదు. పిల్లలైన మిమ్మల్ని పతితం నుండి పావనంగా తయారుచేసేందుకు నేను వచ్చాను. వికర్మలుగా అవ్వనటువంటి కర్మలను ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను.

గీతము:- ఈ రోజు కాకపోతే రేపు ఈ మేఘాలు చెదిరిపోతాయి….. (ఆజ్ నహీ తో కల్ బిఖరేంగే యే బాదల్…..)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. తండ్రి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. ఈ స్మృతి కూడా ఆత్మాభిమానులుగా ఉన్నప్పుడే ఉంటుంది. దేహాభిమానములో ఉంటే స్మృతి కూడా ఉండదు. తండ్రి యాత్రికునిగా అయి వచ్చారని పిల్లలకు తెలుసు. మీరు కూడా యాత్రికులుగా అయి వచ్చారు. ఇప్పుడు మీ ఇంటిని మర్చిపోయారు. తండ్రి మళ్ళీ ఇంటి స్మృతినిప్పించారు మరియు సతోప్రధానంగా అవ్వనంతవరకు ఇంటికి వెళ్ళలేరని ప్రతి రోజూ అర్థము చేయిస్తున్నారు. బాబా చెప్తున్నది సరియైనదని పిల్లలు భావిస్తారు. తండ్రి పిల్లలకు శ్రీమతాన్ని ఇచ్చినప్పుడు, సుపుత్రులైన పిల్లలు ఆ శ్రీమతాన్ని వెంటనే అనుసరిస్తారు. ఈ సమయంలో మంచి మతాన్నిచ్చే ఇటువంటి తండ్రి ఎవ్వరూ ఉండరు, అందుకే చెల్లా చెదురైపోయారు. శ్రీమతాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ మతాన్ని కూడా పిల్లలెవ్వరూ అనుసరించరు. ఇది ఆశ్చర్యము. లౌకిక తండ్రి మతాన్ని అనుసరిస్తారు. అది ఆసురీ మతము. ఇది కూడా డ్రామా. మీరు ఆసురీ మతాన్ని అనుసరించి ఈ గతిని పొందారని పిల్లలకు అర్థము చేయిస్తారు. ఇప్పుడు ఈశ్వరీయ మతాన్ని అనుసరించడం వలన మీరు సుఖధామానికి వెళ్ళిపోతారు. అది అనంతమైన వారసత్వము. ప్రతిరోజు అర్థము చేయిస్తారు. కావున పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి. అందరినీ ఇక్కడే కూర్చోబెట్టలేరు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయాలి. ఇప్పుడు పాత్ర పూర్తవ్వనున్నది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనుష్యులు ఎంతగా మర్చిపోయారు. వీరు తమ ఇళ్ళు-వాకిళ్ళను కూడా మర్చిపోయారు అని అంటారు కదా. ఇంటిని కూడా స్మృతి చేయండి, మీ రాజధానిని కూడా స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పాత్ర పూర్తవ్వనున్నది, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు మర్చిపోయారా?

బాబా, డ్రామానుసారంగా మా పాత్రయే అటువంటిది, మేము ఇళ్ళు-వాకిళ్ళను మర్చిపోయి పూర్తిగా భ్రమిస్తున్నాము అని పిల్లలైన మీరు చెప్పవచ్చు. భారతవాసులే తమ శ్రేష్ఠ ధర్మాన్ని, కర్మలను మర్చిపోయి దైవీ ధర్మభ్రష్ఠులుగా, దైవీ కర్మభ్రష్ఠులుగా అయిపోయారు. మీ ధర్మము-కర్మ ఈ విధంగా ఉండేవి అని ఇప్పుడు తండ్రి సావధానపరుస్తున్నారు. అక్కడ మీరు చేసే కర్మలు అకర్మలుగా ఉండేవి. కర్మ, అకర్మ, వికర్మల గతులను తండ్రియే మీకు అర్థం చేయించారు. సత్యయుగంలో కర్మ, అకర్మగా అవుతుంది. రావణరాజ్యంలో కర్మ, వికర్మగా అవుతుంది. ఇప్పుడు తండ్రి ధర్మ శ్రేష్ఠులుగా, కర్మ శ్రేష్ఠులుగా తయారుచేసేందుకు వచ్చారు. కనుక ఇప్పుడు శ్రీమతానుసారంగా శ్రేష్ఠ కర్మలు చేయాలి. భ్రష్ఠ కర్మలు చేసి ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఇది ఈశ్వరీయ పిల్లలు చేసే పని కాదు. ఏ డైరక్షన్ అయితే లభిస్తుందో దానిని అనుసరించాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. శుద్ధమైన భోజనాన్నే స్వీకరించాలి, ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఇక లభించకపోతే, సలహా అడగండి. ఉద్యోగాలు మొదలైనవాటిలో ఎక్కడైనా కొద్దిగా తినవలసి వస్తుంది అని బాబా అర్థం చేసుకుంటారు. యోగబలముతో మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నప్పుడు, ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా చేస్తున్నప్పుడు, ఇక భోజనాన్ని శుద్ధంగా తయారుచేయడం పెద్ద విషయమేమీ కాదు. ఉద్యోగమైతే చేయాల్సిందే. తండ్రికి చెందినవారిగా అయ్యాము కనుక అన్నీ వదిలి వచ్చి ఇక్కడ కూర్చోవాలని కాదు. ఎంత లెక్కలేనంత మంది పిల్లలున్నారు, ఇక్కడ ఇంతమంది ఉండడానికైతే అవ్వదు. అందరూ గృహస్థ వ్యవహారములోనే ఉండాలి. నేను ఒక ఆత్మను, బాబా వచ్చి ఉన్నారు, మమ్మల్ని పవిత్రంగా తయారుచేసి మా ఇంటికి తీసుకువెళ్తారు, మళ్ళీ రాజధానిలోకి వస్తాము అని భావించాలి. ఇది రావణుని ఛీ-ఛీ పరాయి రాజ్యము. మీరు డ్రామా ప్లాను అనుసారంగా, పూర్తిగా పతితంగా అయిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చాను కనుక శ్రీమతాన్ని అనుసరించండి, ఎంతగా అనుసరిస్తారో, అంతగా శ్రేష్ఠంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు.

ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, ఆ తండ్రిని మర్చిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బాబా సరిదిద్దడానికి వచ్చారు కనుక బాగా పరివర్తనవ్వాలి కదా. సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి లభించారు, ఆత్మలైన మీరు పరస్పరములో మాట్లాడుకున్నట్లుగా వారు పిల్లలతో మాట్లాడుతారు. వారు కూడా ఆత్మనే. వారు పరమ ఆత్మ, వారికి కూడా పాత్ర ఉంది. ఆత్మలైన మీరు పాత్రధారులు. ఉన్నతాతి ఉన్నతమైన పాత్రల నుండి మొదలుకొని నీచాతి నీచమైన పాత్రల వరకు ఉన్నాయి. అంతా ఈశ్వరుడే చేస్తారని భక్తిమార్గములో మనుష్యులు పాడుతారు. అనారోగ్యంతో ఉన్నవారిని బాగు చేసేటటువంటి పాత్ర నాకు లేదు. మీరు పవిత్రంగా ఎలా అవ్వాలి అన్న మార్గాన్ని చూపించడమే నా పాత్ర అని తండ్రి చెప్తున్నారు. పవిత్రంగా అవ్వడంతోనే మీరు ఇంటికి కూడా వెళ్ళగలరు. రాజధానికి కూడా వెళ్ళగలరు. ఫలానావారు అనారోగ్యముతో ఉన్నారు, ఆశీర్వదించండి అని ఇంకెటువంటి ఆశనూ పెట్టుకోకండి. అలా జరగదు. ఆశీర్వాదము, కృప మొదలైన విషయాలు నా వద్ద ఏమీ లేవు. వాటి కోసం సాధు-సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్ళండి. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి, పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని మీరే పిలుస్తారు. మరి నేను మిమ్మల్ని విషయ సాగరము నుండి బయటకు తీసి తీరానికి తీసుకువెళ్తాను, మీరు మళ్ళీ విషయ సాగరములో ఎందుకు చిక్కుకుంటారు అని తండ్రి అడుగుతున్నారు. భక్తిమార్గములో మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. జ్ఞానము, భక్తి మీ కోసమే ఉన్నాయి. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని సన్యాసులు కూడా చెప్తారు. కానీ దాని అర్థము వారికి తెలియదు. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. కనుక అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించేవారు కావాలి. ఇది శ్మశానము, దీని తర్వాత స్వర్గం తయారవుతుంది. అక్కడ ప్రతి కర్మ, అకర్మ అవుతుంది అని తండ్రి అర్థము చేయించారు. ఎటువంటి వికర్మ అవ్వనటువంటి కర్మలను ఇప్పుడు బాబా మీకు నేర్పిస్తున్నారు. ఎవ్వరికీ దుఃఖాన్నివ్వకండి. పతితుల భోజనాన్ని తినకండి. వికారాల్లోకి వెళ్ళకండి. దీని కోసమే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. మాయ విఘ్నాలు ఏ విధంగా వస్తాయో మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ గుప్తమైనవి. దేవతలకు మరియు అసురులకు యుద్ధము జరిగిందని చెప్తారు. మళ్ళీ పాండవులకు మరియు కౌరవులకు యుద్ధము జరిగిందని చెప్తారు. ఇప్పుడు యుద్ధము అయితే ఒక్కటే ఉంది. నేను మీకు భవిష్యత్తు 21 జన్మల కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది మృత్యులోకము. మనుష్యులు సత్య నారాయణుని కథను వింటూ వచ్చారు, లాభమేమీ లేదు. ఇప్పుడు మీరు సత్యమైన గీతను వినిపిస్తారు. రామాయణం కూడా మీరు సత్యమైనదే వినిపిస్తారు. ఒక్క సీతారాముల విషయం కాదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా లంకగా ఉంది. నలువైపులా నీరు ఉంది కదా. ఇది అనంతమైన లంక, ఇందులో రావణ రాజ్యముంది. తండ్రి ఒక్కరే వరుడు. మిగిలినవారందరూ వధువులు. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి రావణ రాజ్యము నుండి విడిపిస్తున్నారు. ఇది శోకవాటిక. సత్యయుగాన్ని అశోకవాటిక అని అంటారు. అక్కడ ఎటువంటి శోకము ఉండదు. ఈ సమయములో శోకమే శోకము. అశోకుడు (శోకము లేనివారు) ఒక్కరు కూడా ఉండరు. అశోకా హోటల్ అని పేరును పెడతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతటినీ అనంతమైన హోటల్ గా భావించండి అని తండ్రి చెప్తున్నారు. ఇది శోకమునిచ్చే హోటల్. మనుష్యుల ఆహార-పానీయాలు జంతువుల వలె ఉన్నాయి. మిమ్మల్ని తండ్రి ఎక్కడకు తీసుకువెళ్తున్నారో చూడండి. సత్యాతి-సత్యమైన అశోకవాటిక సత్యయుగములో ఉంది. హద్దు మరియు అనంతము మధ్యన ఉన్న తేడాను తండ్రియే తెలియజేస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. తండ్రి మనల్ని చదివిస్తున్నారని తెలుసు. అందరికీ మార్గము తెలియజేయడం, అంధులకు చేతికర్రగా అవ్వడము – ఇదే మన కర్తవ్యం. చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఇది ఫలానా దేశము అని పాఠశాలలో కూడా చిత్రాల (మ్యాప్) ద్వారా అర్థము చేయిస్తారు. నీవు ఆత్మ, శరీరము కాదు అని మీరు అర్థం చేయిస్తారు. ఆత్మలు సోదరులు. ఎంత సహజమైన విషయాలను వినిపిస్తారు. మేమంతా సోదరులమని కూడా చెప్తారు. ఆత్మలైన మీరందరూ సోదరులే కదా, గాడ్ ఫాదర్ అని అంటారు కదా, కనుక ఎప్పుడూ పరస్పరములో కొట్లాడుకోకూడదు-గొడవపడకూడదు అని తండ్రి చెప్తున్నారు. శరీరధారులైనప్పుడు మళ్ళీ సోదరీ-సోదురులుగా అవుతారు. శివబాబా సంతానమైన మనమందరము సోదరులము. ప్రజాపిత బ్రహ్మా సంతానముగా సోదరీ-సోదరులము, మనము తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కావున తాతగారినే స్మృతి చేస్తాము. ఈ బిడ్డను (బ్రహ్మాను) కూడా నేను నావాడిగా చేసుకున్నాను మరియు వీరిలో ప్రవేశించాను. ఈ విషయాలన్నీ మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. పిల్లలూ, ఇప్పుడు కొత్త దైవీ ప్రవృత్తి మార్గము స్థాపన అవుతుంది అని తండ్రి చెప్తున్నారు. బి.కె.లైన మీరందరూ శివబాబా మతాన్ని అనుసరిస్తారు. బ్రహ్మా కూడా వారి మతమునే అనుసరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు సర్వ సంబంధాలను తేలిక చేసుకుంటూ వెళ్ళండి అని తండ్రి చెప్తున్నారు. 8 గంటలు స్మృతి చేయాలి, మిగిలిన 16 గంటలలో విశ్రాంతి లేదా వ్యాపారాలు మొదలైనవి ఏవి చేయాలనుకుంటే అవి చేసుకోండి. నేను తండ్రి బిడ్డను అన్నది మర్చిపోకండి. అలాగని ఇక్కడకొచ్చి హాస్టల్ లో ఉండిపోకూడదు. గృహస్థ వ్యవహారంలో పిల్లా-పాపలతోపాటు ఉండాలి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకే వస్తారు. మధుబన్ సాక్షాత్కారము పొందేందుకు మథుర, బృందావనం కు వెళ్తారు. చిన్న మోడల్ రూపంలో తయారుచేసి ఉంచారు. ఇప్పుడిది అర్థం చేసుకోవలసిన అనంతమైన విషయం. శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచిస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మా సంతానమైన బి.కె.లైన మనలో వికారాల విషయం ఉండకూడదు. సన్యాసులకు శిష్యులుగా అవుతారు, ఒకవేళ వారు సన్యాసి దుస్తులను ధరించినట్లయితే, వారి పేరు మారిపోతుంది. ఇక్కడ కూడా మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక బాబా కూడా పేరు పెట్టారు కదా. భట్టీలో ఎంతమంది ఉండేవారు. ఈ భట్టీ గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఏవేవో విషయాలు రాసేశారు, మళ్ళీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది. తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. వారికి సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. బాబాకైతే శరీరము కూడా లేదు. మీకైతే స్థూల శరీరముంది. వారు పరమ ఆత్మ. స్వదర్శన చక్రధారి, ఆత్మనే కదా. ఇప్పుడు ఆత్మను ఎలా అలంకరించాలి? ఇది అర్థం చేసుకునే విషయం కదా. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. వాస్తవానికి నేను స్వదర్శన చక్రధారిని అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలో మొత్తం సృష్టిచక్ర జ్ఞానం వచ్చేస్తుందని మీకు తెలుసు. బాబా కూడా పరంధామములో ఉండేవారు, మనము కూడా అక్కడి నివాసులమే. పిల్లలూ, నేను కూడా స్వదర్శన చక్రధారిని, పతిత-పావనుడినైన నేను మీ వద్దకు వచ్చాను అని తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు, పతితం నుండి పావనంగా చేయండి, ముక్తినివ్వండి అని నన్నే పిలిచారు. వారికి శరీరమైతే లేదు. వారు అజన్మ. జన్మ కూడా తీసుకుంటారు కానీ అది దివ్యమైనది. శివజయంతిని లేక శివరాత్రిని జరుపుకుంటారు. రాత్రి పూర్తైనప్పుడు పగలుగా చేసేందుకు నేనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. 21 జన్మలు పగలు, తర్వాత 63 జన్మలు రాత్రి, ఆత్మయే రకరకాల జన్మలు తీసుకుంటుంది. ఇప్పుడు పగలు నుండి రాత్రిలోకి వచ్చారు, మళ్ళీ పగలులోకి వెళ్ళాలి. మిమ్మల్నే స్వదర్శన చక్రధారులుగా కూడా తయారుచేశాను. ఈ సమయంలో నా పాత్ర ఉంది. మిమ్మల్ని కూడా స్వదర్శన చక్రధారులుగా చేస్తాను. మీరు మళ్ళీ ఇతరులను తయారుచేయండి. 84 జన్మలు ఎలా తీసుకున్నారో, ఆ 84 జన్మల చక్రాన్ని అర్థము చేయించారు. ఇంతకుముందు మీకు ఈ జ్ఞానము ఉందా? అస్సలు లేదు. అజ్ఞానులుగా ఉండేవారు. బాబా స్వదర్శన చక్రధారి, వారిని జ్ఞాన సాగరుడని అంటారు, వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు అన్న ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థము చేయిస్తున్నారు. పిల్లలైన మీకు వారసత్వాన్నిస్తున్నారు. పరస్పరం కొట్లాడుకోకండి-గొడవపడకండి, ఉప్పు నీరుగా అవ్వకండి, సదా హర్షితంగా ఉండాలి మరియు అందరికీ తండ్రి పరిచయాన్నివ్వాలి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ తండ్రినే మర్చిపోయారు. ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నిరాకారి ఆత్మల కోసం నిరాకార భగవానువాచ. మీరు వాస్తవానికి నిరాకారులు, తర్వాత సాకారులుగా అవుతారు. సాకారము లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఆత్మ శరీరము నుండి బయటకు వెళ్తే ఏ మాత్రమూ కదలికలుండవు. ఆత్మ వెంటనే వెళ్ళి వేరొక శరీరములో తన పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి, లోపల మననము చేస్తూ ఉండండి. ఆత్మలైన మనము బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సత్యయుగ వారసత్వం లభిస్తుంది. తప్పకుండా తండ్రియే భారత్ కు వారసత్వాన్నిచ్చి ఉంటారు. వారసత్వాన్ని ఎప్పుడిచ్చారు, తర్వాత ఏమయ్యింది అనేది మనుష్యులకు ఏమాత్రం తెలియదు. ఇప్పుడు తండ్రి అంతా తెలియజేస్తున్నారు. పిల్లలైన మిమ్మల్నే స్వదర్శన చక్రధారులుగా చేశారు, ఆ తర్వాత మీరు 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాను, ఎంత సహజంగా అర్థము చేయిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేయండి మరియు మధురంగా అవ్వండి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి న్యాయవాదులకే న్యాయవాది, అన్ని గొడవల నుండి విడిపిస్తారు. మేము బాబాకు పిల్లలుగా అయ్యాము అని పిల్లలైన మీకు చాలా ఆంతరిక సంతోషం ఉండాలి. వారసత్వం ఇచ్చేందుకు తండ్రి మమ్మల్ని దత్తత తీసుకున్నారు. మీరిక్కడకు వారసత్వం తీసుకోవడానికే వస్తారు. పిల్లా-పాపలు మొదలైనవారిని చూసుకుంటూ బుద్ధి తండ్రివైపు మరియు రాజధాని వైపు ఉండాలి అని తండ్రి చెప్తున్నారు. చదువు ఎంత సహజమైనది. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రినే మీరు మర్చిపోతున్నారు. మొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి సంగమయుగములోనే ఇస్తారు ఎందుకంటే సంగమంలోనే మీరు పతితం నుండి పావనంగా అవ్వాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులు, ఇది దేవతల కంటే కూడా ఉన్నతమైన కులము. మీరు భారత్ కు చాలా ఉన్నతమైన సేవ చేస్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ పూజ్యులుగా అవుతారు. ఇప్పుడు పూజారులను పూజ్యులుగా, గవ్వలను వజ్రాల వలె తయారుచేస్తున్నారు. అటువంటి ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు శ్రీమతంపై ప్రతి కర్మ శ్రేష్ఠంగా చేయాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు, దైవీ గుణాలను ధారణ చేయాలి. తండ్రి డైరెక్షన్ పైనే నడుచుకోవాలి.

2. సదా హర్షితంగా ఉండేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వకూడదు. అందరికీ తండ్రి పరిచయాన్నివ్వాలి. చాలా-చాలా మధురంగా అవ్వాలి.

వరదానము:- సదా సుఖాల సాగరంలో లవలీనంగా ఉండే అంతర్ముఖీ భవ

అంతర్ముఖీ సదా సుఖీ అని అంటారు. ఏ పిల్లలైతే “సదా అంతర్ముఖీ భవ” అనే వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటారో, వారు తండ్రి సమానంగా సదా సుఖసాగరంలో లవలీనమై ఉంటారు. సుఖదాత పిల్లలు స్వయం కూడా సుఖదాతలుగా అయిపోతారు. సర్వాత్మలకు సుఖపు ఖజానానే పంచుతారు. కనుక ఇప్పుడు అంతర్ముఖులుగా అయి ఎటువంటి సంపన్న మూర్తులుగా అవ్వాలంటే, మీ వద్దకు ఎవరు ఎటువంటి భావనతో వచ్చినా, తమ భావనను సంపన్నం చేసుకుని వెళ్ళాలి. ఏ విధంగా తండ్రి ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదో, అదే విధంగా మీరు కూడా తండ్రి సమానంగా నిండుగా అవ్వండి.

స్లోగన్:- ఆత్మిక గౌరవంలో ఉన్నట్లయితే ఎప్పుడూ అభిమానపు ఫీలింగ్ రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *