Telugu Murli 15/08/20

15-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైన పిల్లలూ – అడుగడుగునా ఏదైతే జరుగుతుందో, అదంతా కళ్యాణకారి, ఎవరైతే తండ్రి స్మృతిలో ఉంటారో, ఈ డ్రామాలో వారికి అందరికంటే ఎక్కువ కళ్యాణము జరుగుతుంది”

ప్రశ్న:- డ్రామాలో రచింపబడిన ఏ విషయాన్ని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషములో ఉండగలరు?

జవాబు:- డ్రామానుసారంగా ఇప్పుడీ పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి, కానీ మా రాజధాని అయితే స్థాపన జరిగి తీరుతుంది, ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు అని తెలుసుకున్న పిల్లలు అపారమైన సంతోషంలో ఉంటారు. స్థితిలో హెచ్చు-తగ్గులు అవుతూ ఉంటాయి, కాసేపు చాలా ఉత్సాహంగా ఉంటారు, కాసేపు చల్లబడిపోతారు, ఇందులో తికమకపడకూడదు. ఆత్మలందరికీ తండ్రి అయిన ఆ భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి.

గీతము:- సభలో జ్యోతి వెలిగింది….. (మహ్ ఫిల్ మే జల్ ఉఠీ శమా…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన నంబరువారు పురుషార్థానుసారంగా ఉన్న చైతన్య దీపపు పురుగులకు బాబా ప్రియస్మృతులను అందజేస్తున్నారు. మీరందరూ చైతన్య దీపపు పురుగులు. బాబాను దీపం అని కూడా అంటారు, కాని వారి గురించి ఏ మాత్రము తెలియదు. దీపం పెద్దదేమీ ఉండదు, అది ఒక బిందువు. ఆత్మనైన నేను ఒక బిందువు అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆత్మనైన నాలో మొత్తం పాత్ర ఉంది. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. పిల్లలైన మీకు మాత్రమే తండ్రి వచ్చి అర్థం చేయించారు, ఆత్మ యొక్క అనుభవము చేయించారు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఇంతకుముందు తెలియదు! అందుకే, దేహాభిమానము కారణంగా పిల్లలలో మోహము కూడా ఉంది, వికారాలు కూడా చాలా ఉన్నాయి. భారత్ ఎంత ఉన్నతంగా ఉండేది. వికారాల పేరే ఉండేది కాదు. అప్పుడు నిర్వికారీ భారత్ ఉండేది, ఇప్పుడు వికారీ భారత్ గా ఉంది. తండ్రి అర్థము చేయించినట్లుగా మనుష్యులెవ్వరూ చెప్పలేరు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము నేను దీనిని శివాలయంగా చేశాను. నేనే శివాలయాన్ని స్థాపించాను. ఎలా అన్నది కూడా మీరిప్పుడు అర్థము చేసుకుంటున్నారు. అడుగడుగులోనూ ఏదైతే జరుగుతుందో, అది కళ్యాణకారియేనని మీకు తెలుసు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేసి స్వయం యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకుంటూ ఉంటారో, వారికి ప్రతిరోజూ చాలా కళ్యాణకారిగానే ఉంటుంది. ఇది కళ్యాణకారీ పురుషోత్తములుగా అయ్యే యుగము. బాబాకు ఎంత మహిమ ఉంది. ఇప్పుడు సత్యాతి-సత్యమైన భాగవతము నడుస్తూ ఉందని మీకు తెలుసు. ద్వాపరంలో భక్తిమార్గము ప్రారంభమైనప్పుడు మొట్టమొదట మీరు కూడా వజ్రం యొక్క లింగాన్ని తయారుచేసి పూజిస్తారు. మనము పూజారులుగా అయినప్పుడు మందిరాలను నిర్మించామని, అవి వజ్రాలు, మాణిక్యాలతో నిర్మించామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఆ చిత్రాలు ఇప్పుడు లభించవు. ఇక్కడి వారైతే వెండి మొదలైనవాటితో తయారుచేసి పూజిస్తారు. అటువంటి పూజారులకు కూడా ఎంత గౌరవముంటుందో చూడండి. శివుడిని అందరూ పూజిస్తారు. కాని అవ్యభిచారి పూజ అయితే లేనే లేదు.

వినాశనము కూడా తప్పకుండా జరిగేదే ఉంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి అని కూడా పిల్లలకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎవరు ఎంత తల బాదుకున్నా సరే, మీ రాజధాని అయితే స్థాపన అవ్వాల్సిందే. ఇందులో ఏదైనా చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. అయితే స్థితులు హెచ్చు-తగ్గులు అవుతూనే ఉంటాయి. ఇది చాలా గొప్ప సంపాదన. ఒక్కోసారి మీరు చాలా సంతోషంగా మంచి ఆలోచనలతో ఉంటారు, ఒక్కోసారి చల్లబడిపోతారు. యాత్రలో కూడా కింద-మీద అవుతూ ఉంటాయి, ఇందులో కూడా అలాగే జరుగుతుంది. కొన్నిసార్లు ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయడం వలన చాలా సంతోషము కలుగుతుంది. ఓహో! బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. అద్భుతము. ఆత్మలందరి తండ్రి అయిన భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. వారు మళ్ళీ కృష్ణుడిని భగవంతునిగా భావించారు. మొత్తం ప్రపంచములో గీతకు చాలా గౌరవముంది, ఎందుకంటే అది భగవానువాచ కదా. కాని భగవంతుడు అని ఎవరిని అంటారో ఎవ్వరికీ తెలియదు. ఎంతో హోదాలో ఉన్న గొప్ప-గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైనవారు కూడా గాడ్ ఫాదర్ ను స్మృతి చేస్తున్నామని చెప్తారు కాని వారు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏమి చేశారో, అదంతా మర్చిపోయారు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. డ్రామాలో ఇవన్నీ రచింపబడి ఉన్నాయి. ఈ రావణ రాజ్యం మళ్ళీ ఏర్పడుతుంది మరియు నేను రావలసి వస్తుంది. రావణుడే మిమ్మల్ని అజ్ఞానం యొక్క ఘోరమైన అంధకారములో నిద్రపుచ్చుతాడు. జ్ఞానాన్ని కేవలం ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే తెలియజేస్తారు, దాని ద్వారా సద్గతి కలుగుతుంది. తండ్రి తప్ప వేరెవ్వరూ సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. తండ్రి ఏ గీతా జ్ఞానాన్నైతే వినిపించారో, అది మళ్ళీ ప్రాయః లోపమైపోయింది. ఈ జ్ఞానము పరంపరగా నడుస్తూ వస్తుందని కాదు. ఇతరుల ఖురాన్, బైబిల్ మొదలైనవి నడుస్తూ వస్తాయి, వినాశనమవ్వవు. నేను మీకిప్పుడు ఏదైతే జ్ఞానాన్ని ఇస్తున్నానో, ఇది పరంపరగా అనాదిగా వచ్చేందుకు దానికి శాస్త్రం ఏదీ తయారవ్వదు. ఇది మీరు వ్రాస్తారు, తర్వాత సమాప్తం చేసేస్తారు. ఇవన్నీ న్యాచురల్ గా కాలిపోయి సమాప్తమైపోతాయి. తండ్రి కల్పక్రితము కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నారు – ఈ జ్ఞానము మీకు లభిస్తుంది, తర్వాత మీరు వెళ్ళి ప్రారబ్ధాన్ని పొందుతారు, అప్పుడు ఈ జ్ఞానము అవసరముండదు. భక్తిమార్గములోవన్నీ శాస్త్రాలు. బాబా మీకు ఏ గీతనూ చదివి వినిపించడం లేదు. వారు రాజయోగ శిక్షణనిస్తారు, భక్తిమార్గములో మళ్ళీ దీని శాస్త్రమును తయారుచేసినప్పుడు, అర్థ రహితంగా చేసేశారు. గీతా జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు అన్నది మీ ముఖ్యమైన విషయము. వారి పేరును మార్చేశారు, ఇంకెవ్వరి పేర్లను మార్చలేదు. అందరికీ ముఖ్యమైన ధర్మ శాస్త్రాలున్నాయి కదా. ఇందులో ముఖ్యమైనవి దేవతా ధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము. మొదట బౌద్ధ ధర్మము, తర్వాత ఇస్లామ్ ధర్మము అని కొందరు చెప్తారు. ఈ విషయాలకు, గీతకు ఎటువంటి సంబంధము లేదు, తండ్రి నుండి వారసత్వం తీసుకోవడమే మా పని అని చెప్పండి. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు – ఇది పెద్ద వృక్షము. మంచిది, పుష్ప గుచ్ఛము వలె దీని నుండి మూడు కొమ్మలు వెలువడుతాయి. ఇది ఎంత మంచి తెలివితేటలతో తయారు చేయబడిన వృక్షము. మేము ఏ ధర్మానికి చెందిన వారము, మా ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అని ఎవరైనా వెంటనే అర్థము చేసుకుంటారు. ఈ దయానందుడు, అరవింద ఘోష్ మొదలైన వారందరూ ఈ మధ్యలోనే ఉండి వెళ్ళారు. వారు కూడా యోగము మొదలైనవి నేర్పిస్తారు. అదంతా భక్తి. జ్ఞానానికి నామ-రూపాలే లేవు. వారికి ఎంత గొప్ప-గొప్ప టైటిల్స్ లభిస్తాయి. ఇదంతా కూడా డ్రామాలో రచింపబడి ఉంది, ఇది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ప్రారంభము నుండి మొదలుకొని ఈ చక్రము ఎలా తిరిగింది, మళ్ళీ ఎలా పునరావృతమౌతుంది అన్నది మీకు తెలుసు. ఈ వర్తమానం మళ్ళీ భూతకాలంగా అయి భవిష్యత్తుగా అయిపోతుంది. పాస్ట్, ప్రెజంట్, ఫ్యూచర్. ఏదైతే జరిగిపోయిందో, అది మళ్ళీ భవిష్యత్తుగా అయిపోతుంది. ఈ సమయంలో మీకు జ్ఞానము లభిస్తుంది, ఆ తర్వాత మీరు రాజ్యము తీసుకుంటారు, ఈ దేవతల రాజ్యము ఉండేది కదా. ఆ సమయంలో ఇంకే రాజ్యమూ లేదు. ఇది కూడా ఒక కథలాగా చెప్పండి. చాలా సుందరమైన కథ అవుతుంది. చాలాకాలం క్రితము 5 వేల సంవత్సరాల క్రితము ఈ భారత్ సత్యయుగంగా ఉండేది, ఇంకే ధర్మమూ ఉండేది కాదు, కేవలము దేవీ-దేవతల రాజ్యమే ఉండేది. దానిని సూర్యవంశీ రాజ్యమని అనేవారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము 1250 సంవత్సరాలు నడిచింది, ఆ తర్వాత వారు ఆ రాజ్యాన్ని ఇతర సోదరులైన క్షత్రియులకు ఇచ్చారు, అప్పుడు ఇక వారి రాజ్యము నడిచింది. తండ్రి వచ్చి చదివించారని మీరు అర్థం చేయించవచ్చు. ఎవరైతే బాగా చదువుకున్నారో, వారు సూర్యవంశీయులుగా అయ్యారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో, వారికి క్షత్రియులని పేరు వచ్చింది. అంతేకాని యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి అని బాబా చెప్తున్నారు. మీరు వికారాలపై విజయము పొందాలి. ఎవరైతే కామముపై విజయము పొందుతారో, వారే జగత్ జీతులుగా అవుతారని, బాబా ఆర్డినెన్స్ (శాసనము) జారీ చేశారు. చివరికి అర్థకల్పము తర్వాత వామమార్గములోకి పడిపోతారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. దేవతల ముఖాల వలె తయారు చేయబడి ఉన్నాయి. రామరాజ్యము మరియు రావణ రాజ్యము సగం-సగం ఉంటాయి. తర్వాత ఏమయ్యింది, ఆ తర్వాత ఏమయ్యింది అని వారి కథను కూర్చుని తయారు చేయాలి. ఇదే సత్యనారాయణుని కథ. ఒక్క తండ్రి మాత్రమే సత్యమైనవారు, వారు ఈ సమయంలో వచ్చి మొత్తం ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని మీకిస్తున్నారు, ఇది ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యులకైతే తండ్రి గురించే తెలియదు. డ్రామాలోని పాత్రధారులకే దాని క్రియేటర్-డైరెక్టర్ మొదలైనవారి గురించి తెలియదు. ఇక మిగిలిన వారెవరికి తెలుస్తుంది! డ్రామానుసారంగా ఇది మళ్ళీ ఇలాగే జరుగుతుందని తండ్రి మీకిప్పుడు తెలియజేస్తున్నారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ చదివిస్తారు. ఇక్కడకు వేరెవ్వరూ రాలేరు. నేను పిల్లలను మాత్రమే చదివిస్తాను అని తండ్రి చెప్తున్నారు. కొత్తవారిని ఎవ్వరినీ ఇక్కడ కూర్చోబెట్టలేరు. ఇంద్రప్రస్థము కథ కూడా ఉంది కదా. నీలము, పుష్యరాగము అని పేర్లు కూడా ఉన్నాయి కదా. మీలో కూడా కొందరు వజ్రము లాంటి రత్నాలున్నారు. రమేష్ ను చూడండి, ప్రదర్శిని గురించిన విషయాన్ని వెల్లడించారు, దాని గురించి అందరికీ విచారసాగర మథనము జరిగింది. కనుక వజ్రము లాంటి పని చేశారు కదా. కొందరు పుష్యరాగము వలె ఉన్నారు, కొందరు మరొక విధంగా ఉన్నారు. కొందరికి ఏమీ తెలియదు. రాజధాని స్థాపన అవుతోందని కూడా తెలుసు. అందులో రాజులు-రాణులు మొదలైన వారందరూ కావాలి. బ్రాహ్మణులైన మనము శ్రీమతంపై చదువుకొని విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత సంతోషం ఉండాలి. ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది. నేను వెళ్ళి బాలుడిగా అవుతానని ఈ బాబా ఇప్పుడే అనుకుంటూ ఉంటారు. బాల్యము యొక్క ఆ విషయాలు ఇప్పుడే ఎదురుగా వస్తూ ఉన్నాయి, నడవడికనే మారిపోతుంది. అదే విధంగా అక్కడ కూడా వృద్ధులుగా అయినప్పుడు, ఇప్పుడు ఈ వానప్రస్థ శరీరాన్ని వదిలి మేము కిశోర ప్రాయములోకి వెళ్తామని భావిస్తారు. బాల్యము సతోప్రధాన స్థితి. లక్ష్మీ-నారాయణులు యువకులు, వివాహం జరిగిన వారిని కిశోరప్రాయులని అనరు. యువ ప్రాయమును రజో, వృద్ధాప్యాన్ని తమో అని అంటారు, అందుకే కృష్ణునిపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీ-నారాయణులు కూడా వారే. కాని మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. కృష్ణుడిని ద్వాపరములోకి, లక్ష్మీ-నారాయణులను సత్యయుగములోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు.

కుమారీలు బాగా నిలబడగలగాలి అని తండ్రి చెప్తున్నారు. అవివాహిత కన్య, అథర్ కుమారీ, దిల్ వాడా మొదలైన మందిరాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ మీ యథార్థమైన స్మృతిచిహ్నాలు. అవి జడమైనవి, ఇది చైతన్యము. మీరిక్కడ చైతన్యంలో కూర్చున్నారు, భారత్ ను స్వర్గంగా చేస్తున్నారు. స్వర్గమైతే ఇక్కడే ఉంటుంది. మూలవతనము, సూక్ష్మవతనము ఎక్కడ ఉన్నాయో, పిల్లలైన మీకు అన్నీ తెలుసు. మొత్తం డ్రామా గురించి మీకు తెలుసు. ఏదైతే గడిచిందో, అది మళ్ళీ భవిష్యత్తు అవుతుంది, మళ్ళీ అది భూతకాలమైపోతుంది. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారో అర్థము చేసుకోవాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. అంతే, సంతోషంలో శీతలంగా అయిపోవాలి. తండ్రి స్మృతితో అలజడులన్నీ తొలగిపోతాయి. బాబా మన తండ్రి కూడా, మనల్ని చదివిస్తున్నారు కూడా, అంతేకాక మనల్ని తమతో పాటు కూడా తీసుకువెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రితో ఈ విధంగా మాట్లాడాలి. బాబా మాకిప్పుడే తెలిసింది, బ్రహ్మా మరియు విష్ణుపుల గురించి కూడా తెలిసింది. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడ్డారు. ఇప్పుడు విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. బ్రహ్మాను సూక్ష్మవతనంలో చూపిస్తారు. వాస్తవానికి బ్రహ్మా ఇక్కడ ఉన్నారు. విష్ణువు రాజ్యం చేసేవారు. ఒకవేళ విష్ణువు నుండి బ్రహ్మా వెలువడినట్లయితే, వారు తప్పకుండా రాజ్యము కూడా చేస్తారు. విష్ణు నాభి నుండి వెలువడినప్పుడు పిల్లవాడిగా ఉండాలి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మానే 84 జన్మలు పూర్తి చేసి ఇప్పుడు మళ్ళీ విష్ణుపురికి యజమానిగా అవుతారు. ఈ విషయాలు కూడా ఎవ్వరూ పూర్తిగా అర్థము చేసుకోరు, కనుక ఆ సంతోషం యొక్క పాదరసం కూడా ఎక్కదు. మీరే గోప-గోపికలు. సత్యయుగములో ఉండరు. అక్కడైతే రాకుమార-రాకుమారీలుంటారు. గోప-గోపికల యొక్క గోపీ వల్లభుడు కదా. ప్రజాపిత బ్రహ్మా అందరికీ తండ్రి మరియు నిరాకారీ శివుడు ఆత్మలందరికీ తండ్రి. వీరంతా ముఖవంశావళి. బి.కె. లైన మీరందరూ సోదరీ-సోదరులు అయ్యారు. వికారీ దృష్టి ఉండకూడదు, ఇందులోనే మాయ ఓడిస్తుంది. ఇప్పటి వరకు ఏదైతే చదివారో, అది బుద్ధి ద్వారా మర్చిపోండి, నేను ఏదైతే వినిపిస్తున్నానో, అది చదవండి అని తండ్రి చెప్తున్నారు. మెట్ల చిత్రము చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఆధారమంతా ఒకే విషయముపై ఉంది. గీతా భగవంతుడు ఎవరు? కృష్ణుడిని భగవంతుడని అనరు. వారు సర్వగుణ సంపన్నమైన దేవత. వారి పేరు గీతలో వేయడం జరిగింది. వారినే నల్లగా కూడా చేశారు మరియు లక్ష్మీ-నారాయణులను కూడా నల్లగా చేసేశారు. లెక్కాచారాలేవీ లేవు. రామచంద్రుడిని కూడా నల్లగా చేశారు. కామచితిపై కూర్చోవడం వలన నల్లగా అయ్యారని తండ్రి చెప్తున్నారు. ఒక్కరి పేరునే తీసుకుంటారు. మీరందరూ బ్రాహ్మణులు. ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చుంటారు. శూద్రులు కామచితిపై కూర్చున్నారు. ఎలా మేల్కొలపాలి అని విచార సాగర మథనము చేసి యుక్తులు తీయండి అని తండ్రి చెప్తున్నారు. డ్రామానుసారంగా మేల్కొంటారు. డ్రామా చాలా నెమ్మది-నెమ్మదిగా నడుస్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము గోపీ వల్లభుని గోప-గోపికలము అని సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి ద్వారా సదా సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది.

2. ఇప్పటివరకు ఏదైతే చదివారో, దానిని బుద్ధి ద్వారా మర్చిపోయి తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో, దానినే చదవాలి. మేము సోదరీ-సోదరులము అన్న స్మృతి ద్వారా వికారీ దృష్టిని సమాప్తం చేసుకోవాలి. మాయతో ఓడిపోకూడదు.

వరదానము:- రియాల్టీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కార మూర్త్ భవ

ఇప్పుడు ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాల్టీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయించేటటువంటి సమయం వస్తుంది. ప్రత్యక్షతా సమయంలో, మాలలోని మణి యొక్క నంబరు మరియు భవిష్య రాజ్య స్వరూపము, రెండూ ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు రేస్ చేస్తూ-చేస్తూ కొంచెం రీస్ (అసూయ) అనే ధూళి యొక్క పర్దా, ప్రకాశిస్తున్న వజ్రాలను దాచిపెడుతుంది, చివర్లో ఆ పర్దా తొలగిపోతుంది, అప్పుడు దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకి వచ్చేస్తాయి, రాయల్ కుటుంబము ఇప్పటి నుండే తమ రాయల్టీని చూపిస్తారు అనగా తమ భవిష్య పదవిని స్పష్టం చేస్తారు, కావున రియాల్టీ ద్వారా రాయల్టీని ప్రత్యక్షం చేయించండి.

స్లోగన్:- ఏ విధి ద్వారానైనా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థమును ఇమర్జ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *