Telugu Murli 18/08/20

18-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైనపిల్లలూ – మీ సతోప్రధానమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు, స్మృతిలో ఉండే పురుషార్థము బాగా చేయండి, నేను ఆత్మను, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని సదా గుర్తుండాలి”

ప్రశ్న:- స్మృతి చార్టును పెట్టడం పిల్లలకు ఎందుకు కష్టమనిపిస్తుంది?

జవాబు:- ఎందుకంటే చాలా మంది పిల్లలు స్మృతిని యథార్థంగా అర్థం చేసుకోరు. స్మృతిలో కూర్చుంటారు మరియు బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. శాంతిగా అవ్వరు. వారు మళ్ళీ వాయుమండలాన్ని పాడుచేస్తారు. అసలు స్మృతినే చేయకపోతే చార్టును ఎలా వ్రాస్తారు. ఒకవేళ ఎవరైనా అసత్యము వ్రాస్తే, వారికి ఎన్నో శిక్షలు పడతాయి. సత్యమైన తండ్రికి సత్యమే వినిపించాల్సి ఉంటుంది.

గీతము:- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను…… (తక్ దీర్ జగాకర్ ఆయీ హూ……)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రతిరోజూ వీలైనంత వరకూ దేహీ-అభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే మనము ఆ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క భాగ్యం తయారుచేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. పవిత్రంగా, సతోప్రధానంగా అవ్వకుండా సతోప్రధానమైన భాగ్యాన్ని తయారుచేసుకోలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయము ఒక్కటే. దీనిని మీ వద్ద వ్రాసుకోండి. చేతులపై పేరు వ్రాసుకుంటారు కదా. నేను ఒక ఆత్మను, అనంతమైన తండ్రి నుండి నేను వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని మీరు కూడా వ్రాసుకోండి ఎందుకంటే మాయ మరపింపజేస్తుంది, కనుక వ్రాసుకొని ఉన్నట్లయితే క్షణ-క్షణము గుర్తుకొస్తుంది. మనుష్యులు స్మృతి చేసేందుకు “ఓం” లేక “కృష్ణుడు” మొదలైనవారి చిత్రాలను కూడా పెట్టుకుంటారు. ఇది అతి కొత్త స్మృతి. దీనిని అనంతమైన తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. దీనిని అర్థము చేసుకుంటే మీరు సౌభాగ్యశాలురుగానే కాదు పదమ్ భాగ్యశాలురుగా అవుతారు. తండ్రిని తెలుసుకోని కారణంగా, స్మృతి చేయని కారణంగా నిరుపేదలుగా అయిపోయారు. ఒక్క తండ్రి మాత్రమే సదా కోసం జీవితాన్ని సుఖవంతంగా చేసేందుకు వచ్చారు. వారిని స్మృతి కూడా చేస్తారు కాని అసలు వారెవరో తెలియదు. విదేశీయులు కూడా సర్వవ్యాపి అని అనడం భారతవాసీయుల నుండి నేర్చుకున్నారు. భారత్ దిగజారగానే అందరూ పడిపోయారు. స్వయం దిగజారేందుకు మరియు అందరినీ దిగజార్చేందుకు భారత్ యే కారణము. నేను కూడా ఇక్కడికే వచ్చి భారత్ ను స్వర్గముగా, సత్యఖండంగా తయారుచేస్తానని తండ్రి చెప్తున్నారు. అటువంటి స్వర్గాన్ని తయారుచేసేవారిని ఎంతగా నిందించారు. వారిని మర్చిపోయారు, అందుకే యదా యదాహి…… అని వ్రాసి ఉన్నది. దీని అర్థమును కూడా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. బలిహారం తండ్రి ఒక్కరిది మాత్రమే. తండ్రి తప్పకుండా వస్తారు, అందుకే శివజయంతిని జరుపుకుంటారని మీకిప్పుడు తెలుసు. కానీ శివజయంతికి అసలు విలువ ఇవ్వరు. వారు తప్పకుండా వచ్చి వెళ్ళారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగపు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమును వారే స్థాపన చేస్తారు. మా ధర్మమును ఫలానా సమయములో ఫలానా వారు స్థాపించారని మిగిలినవారందరికీ తెలుసు. వాటి కంటే ముందు దేవీ-దేవతా ధర్మముండేది. ఆ ధర్మము ఎక్కడకు మాయమైపోయిందో వారికి అసలు తెలియదు. తండ్రియే అందరికన్నా ఉన్నతమైనవారు, మహిమ ఇంకెవ్వరికీ లేదు అని ఇప్పుడు తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ధర్మ స్థాపకులకు ఏమి మహిమ ఉంటుంది? తండ్రియే పావన ప్రపంచ స్థాపన మరియు పతిత ప్రపంచ వినాశనము చేయిస్తారు మరియు మీకు మాయపై విజయం పొందేలా చేస్తారు. ఇది అనంతమైన విషయము. మొత్తం అనంతమైన ప్రపంచముపై రావణ రాజ్యముంది. హద్దు లంక మొదలైనవాటి విషయం కాదు. ఈ గెలుపు-ఓటముల కథ కూడా మొత్తం భారత్ కు సంబంధించినదే. మిగిలినవన్నీ ఉపకథలు. భారత్ లోనే ద్వికిరీటధారులు మరియు ఏక కిరీటధారులైన రాజులుంటారు మరియు ఎవరైతే పెద్ద-పెద్ద చక్రవర్తులు ఉండి వెళ్ళారో, వారెవ్వరి పైనా ప్రకాశ కిరీటము ఉండదు. కేవలం దేవీ-దేవతలపై మాత్రమే ఉంటుంది. అయినా దేవతలు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు శివబాబాను పరమపిత, పతిత-పావనుడు అని అంటారు. వీరికి ప్రకాశ కిరీటాన్ని ఎక్కడ చూపిస్తారు. ప్రకాశం లేని పతితులున్నప్పుడు ప్రకాశ కిరీటాన్ని చూపించడం జరుగుతుంది. వారెప్పుడూ ప్రకాశం లేనివారిగా అవ్వరు. బిందువుకు ప్రకాశాన్ని ఎలా చూపించగలరు. అలా వీలు కాదు. రోజు-రోజుకూ మీకు చాలా గుహ్యాతి-గుహ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు, వాటిని ఎంత వీలైతే అంత బుద్ధిలో నిలుపుకోవాలి. ముఖ్యమైనది స్మృతియాత్ర. ఇందులో మాయ విఘ్నాలు చాలా ఏర్పడతాయి. కొంతమంది స్మృతి చార్టులో 50-60 శాతము అని కూడా వ్రాస్తారు కాని స్మృతియాత్ర అని దేనిని అంటారో వారు అర్థం చేసుకోరు. దీనిని స్మృతి అని అనవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా కష్టము. మీరిక్కడ 10-15 నిముషాలు కూర్చుంటారు, అందులో కూడా స్మృతిలో మంచిరీతిగా ఉన్నామా అని కూడా చెక్ చేసుకోండి. చాలామంది స్మృతిలో ఉండలేరు, ఇక వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. చాలామంది స్మృతిలో ఉండకపోవడంతో విఘ్నాలను కలిగిస్తూ ఉంటారు. వారికి రోజంతా బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. కావున ఇక్కడ శాంతి ఉండదు, కనుక స్మృతి చార్టును కూడా పెట్టరు. అసత్యము వ్రాసినట్లయితే ఇంకా శిక్షలు పడతాయి. చాలామంది పిల్లలు తప్పులు చేస్తారు, దాచిపెడతారు. సత్యము చెప్పరు. వారిని తండ్రి అని అంటూ వారికి సత్యము చెప్పకపోతే ఎంత దోషం ఏర్పడుతుంది. ఎంత పెద్ద అశుద్ధమైన పని చేసినా కూడా, సత్యం చెప్పేందుకు సిగ్గనిపిస్తుంది. తరచుగా అందరూ అసత్యమే చెప్తారు. అసత్యమైన మాయ, అసత్యమైన శరీరము…… కదా. ఒక్కసారిగా దేహాభిమానములోకి వచ్చేస్తారు. నిజము చెప్పడము మంచిదే, ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఇక్కడ సత్యమునే చెప్పాలి. జ్ఞానముతో పాటు స్మృతియాత్ర కూడా తప్పనిసరి ఎందుకంటే స్మృతియాత్ర ద్వారానే స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము జరిగేది ఉంది. జ్ఞానము అర్థం చేయించడం చాలా సహజం. స్మృతిలోనే శ్రమ ఉంది. అంతేకాని బీజము నుండి వృక్షము ఎలా వస్తుందో, అదైతే అందరికీ తెలుసు. బుద్ధిలో 84 జన్మల చక్రముంది, బీజము మరియు వృక్షముల జ్ఞానముంటుంది కదా. తండ్రి అయితే సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞానసాగరుడు. వారిలో అర్థము చేయించేందుకు జ్ఞానముంది. ఇది పూర్తిగా అసాధారణమైన విషయము. ఇది మనుష్య సృష్టి వృక్షము. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అందరూ తెలియదు-తెలియదు అంటూ వచ్చారు. గడువు గురించే తెలియదంటే ఇంకేమి తెలుసుకుంటారు. మీలో కూడా చాలా కొద్దిమందికి మాత్రమే బాగా తెలుసు, అందుకే తమ-తమ సలహాలనివ్వండి అని సెమినార్లకు కూడా పిలుస్తారు. సలహాను ఎవరైనా ఇవ్వవచ్చు. అంతేకాని ఎవరి పేరుందో, వారు మాత్రమే ఇవ్వాలని కాదు. మా పేరు లేదు, మేము ఎలా ఇవ్వాలి అని అనుకోకూడదు. ఎవరికైనా సేవార్థం ఏదైనా సలహా ఉంటే – బాబా, ఈ యుక్తి ద్వారా సేవ బాగా పెరుగుతుంది అని వ్రాయవచ్చు. ఎవరైనా సలహాను ఇవ్వవచ్చు. ఏ రకమైన సలహాలనిచ్చారు అని చూస్తాము. ఏ యుక్తితో మనము భారత్ యొక్క కళ్యాణము చేయాలి, అందరికీ సందేశమునివ్వాలి అని పరస్పరము చర్చించి, వ్రాసి పంపించండి అని బాబా అయితే చెప్తూ ఉంటారు. మాయ అందరినీ నిద్రపుచ్చింది. మృత్యువు ఎదురుగా ఉన్నప్పుడు తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు – ఇప్పుడు అందరిదీ వానప్రస్థ స్థితి, ఇక చదవండి, చదవకపోండి, మరణించడం తప్పనిసరి. ఏర్పాట్లను చేసుకోండి, చేసుకోకపోండి, కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపనవుతుంది. మంచి-మంచి పిల్లలు తమ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. గుప్పెడు బియ్యం తీసుకొని వచ్చారు అని సుదాముని ఉదాహరణ కూడా గాయనం చేయబడి ఉంది. బాబా, మాకు కూడా మహళ్ళు లభించాలి. వారి వద్ద ఉండేదే గుప్పెడు బియ్యమైతే వారేమి చెయ్యగలరు. మమ్మా పిడికెడు బియ్యం కూడా తీసుకురాలేదు అని బాబా, మమ్మా ఉదాహరణను తెలియజేసారు. కానీ ఎంత ఉన్నతమైన పదవిని పొందారు. ఇందులో ధనము యొక్క విషయం లేదు. స్మృతిలో ఉండాలి మరియు తమ సమానంగా తయారుచేయాలి. బాబాకైతే ఎటువంటి ఫీజు మొదలైనవి లేవు. మా వద్ద ధనము ఉంది కనుక అది ఎందుకు యజ్ఞములో స్వాహా చెయ్యకూడదు అని భావిస్తారు. వినాశనమైతే జరగాల్సిందే. అంతా వ్యర్థమైపోతుంది. కొద్దిగానైనా సఫలము చేసుకోండి. ప్రతి ఒక్క మనిషి ఎంతోకొంత దాన-పుణ్యాలు మొదలైనవి తప్పకుండా చేస్తారు. అక్కడ పాపాత్ములకు పాపాత్ముల దాన-పుణ్యాలు. అయినా కూడా దానికి అల్పకాలం కోసం ఫలము లభిస్తుంది. ఎవరైనా విశ్వవిద్యాలయము, కళాశాల మొదలైనవి నిర్మించారనుకోండి, ధనము చాలా ఉంటే ధర్మశాల మొదలైనవి కట్టించారనుకోండి, వారికి భవనాలు మొదలైనవి మంచివి లభిస్తాయి. అయినా వ్యాధులు మొదలైనవైతే ఉంటాయి కదా. ఎవరైనా ఆసుపత్రి మొదలైనవి కట్టించారంటే, వారి ఆరోగ్యము బాగుంటుంది. కానీ దాని ద్వారా అన్ని కోరికలు సిద్ధించవు. ఇక్కడైతే అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తవుతాయి.

మీరు పావనంగా అవుతున్నారు కనుక ధనమంతా విశ్వాన్ని పావనంగా తయారుచేయడంలో వినియోగించడం మంచిదే కదా. అర్థకల్పము కోసం ముక్తి-జీవన్ముక్తులనిస్తారు. మాకు శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అడుగుతారు. అదైతే శాంతిధామములోనే లభిస్తుంది మరియు సత్యయుగంలో ఒకే ధర్మమున్న కారణంగా అక్కడ అశాంతి ఉండదు. రావణరాజ్యములో అశాంతి ఉంటుంది. రామ రాజా, రామ ప్రజా…… అని గాయనం కూడా ఉంది. అది అమరలోకము. అక్కడ అమరలోకములో మరణము అనే పదమే ఉండదు. ఇక్కడైతే కూర్చుని-కూర్చుని అకస్మాత్తుగా మరణిస్తారు. దీనిని మృత్యులోకమని, దానిని అమరలోకమని అంటారు. అక్కడ మరణించడం అనేది ఉండదు. పాత శరీరాన్ని ఒకటి వదిలి మళ్ళీ బాలకునిగా అయిపోతారు. రోగాలుండవు. ఎంత లాభము కలుగుతుంది. శ్రీ శ్రీ మతంపై మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కావున అటువంటి ఆత్మిక సెంటర్లు ఎన్ని తెరవాలి. కొద్దిమంది వచ్చినా కూడా అదేమైనా తక్కువా. ఈ సమయంలో మనుష్యులెవ్వరికీ డ్రామా గడువు గురించి తెలియదు. మీకు ఇది ఎవరు నేర్పించారు అని అడుగుతారు. అరే, మాకు తెలియజేసేవారు తండ్రి. ఎంతమంది బి.కె.లున్నారు. మీరు కూడా బి.కె.లే. శివబాబాకు పిల్లలు. ప్రజాపిత బ్రహ్మాకు కూడా పిల్లలు. వీరు మానవజాతికి గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వీరి నుండి బి.కె.లైన మనం వెలువడ్డాము. వంశాలుంటాయి కదా. మీ దేవీ-దేవతా కులం చాలా సుఖమునిచ్చేటటువంటిది. ఇక్కడ మీరు ఉత్తములుగా అవుతారు, ఆ తర్వాత అక్కడ రాజ్యము చేస్తారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. దేవతలు ఈ తమోప్రధాన ప్రపంచములో పాదాలు మోపరని కూడా పిల్లలకు అర్థం చేయించాను. జడచిత్రాల నీడ పడవచ్చు, చైతన్య దేవతల నీడ పడదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు – పిల్లలూ, ఒకటి స్మృతియాత్రలో ఉండండి, వికర్మలేవీ చేయకండి మరియు సేవ కోసం యుక్తులు తీయండి. బాబా, మేమైతే లక్ష్మీ-నారాయణుల వలె అవుతాము అని పిల్లలు అంటారు. మీ నోటిలో గులాబ్ అని బాబా అంటారు, కానీ దీని కోసం శ్రమ కూడా చేయాలి. ఉన్నత పదవిని పొందాలంటే మీ సమానంగా తయారుచేసే సేవ చేయండి. ఒక రోజు మీరు చూస్తారు – ఒక్కొక్క పండా తమతో పాటు 100-200 యాత్రికులను కూడా తీసుకొస్తారు. మున్ముందు చూస్తూ ఉంటారు. మొదటి నుండే అంతా చెప్పలేము. ఏదైతే జరుగుతూ ఉంటుందో, అది చూస్తూ ఉంటారు.

ఇది అనంతమైన డ్రామా. మీది తండ్రితో పాటు అందరికన్నా ముఖ్యమైన పాత్ర, మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. మీరిప్పుడు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలే ఉండవు. తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. తండ్రి వచ్చి దుఃఖాల నుండి ముక్తిని కలిగిస్తారు. ఇంత ధనముంది, పెద్ద-పెద్ద మహళ్ళున్నాయి, విద్యుత్ దీపాలున్నాయి, చాలు, ఇదే స్వర్గము అని భారతవాసీయులు భావిస్తారు. ఇదంతా మాయ యొక్క ఆడంబరము. సుఖము కోసం అనేక సాధనాలను తయారుచేస్తారు. పెద్ద-పెద్ద భవనాలను, మహళ్ళను తయారుచేస్తారు, కానీ మృత్యువు అకస్మాత్తుగా ఎలా వచ్చేస్తుంది, అక్కడ మృత్యు భయముండదు. ఇక్కడైతే అకస్మాత్తుగా మరణిస్తారు, తర్వాత ఎంతగా దుఃఖిస్తారు. ఇంకా, సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు కారుస్తారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ ఆచారాలు-పద్ధతులు ఉంటాయి. అనేక మతాలున్నాయి. సత్యయుగంలో ఇటువంటి విషయాలుండవు. అక్కడైతే ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటారు. కనుక మీరు ఎంత సుఖములోకి వెళ్తారు. దాని కోసం ఎంత పురుషార్థము చేయాలి. అడుగడుగులోనూ మతమును (డైరెక్షన్) తీసుకోవాలి. గురువు లేక పతి మతమును తీసుకుంటారు లేదా తమ సొంత మతంపై నడుచుకుంటారు. ఆసురీ మతము దేనికి పనికొస్తుంది. అసురత్వం వైపే తోసేస్తుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, ఇది ఉన్నతాతి ఉన్నతమైనది, అందుకే శ్రీమత్ భగవానువాచ అని గాయనం కూడా ఉంది. పిల్లలైన మీరు శ్రీమతము ద్వారా మొత్తం విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. ఆ స్వర్గానికి మీరు యజమానులుగా అవుతారు కనుక ప్రతి అడుగులోనూ మీరు శ్రీమతం తీసుకోవాలి, కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు మతంపై నడవరు. ఎవరికైనా కొంచెం తెలివి ఉన్నా, ఏదైనా సలహా ఉన్నా, బాబాకు వ్రాసి పంపండి అని బాబా అర్థం చేయించారు. ఎవరెవరు సలహాలనిచ్చేందుకు యోగ్యులో బాబాకు తెలుసు. కొత్త-కొత్త పిల్లలు తయారవుతూ ఉంటారు. మంచి-మంచి పిల్లలు ఎవరో, బాబాకైతే తెలుసు కదా. దుకాణంలో ఉండేవారు కూడా ఇతరులకు తండ్రి పరిచయము లభించే విధంగా ప్రయత్నాలు చేయడానికి సలహాలు తీయాలి. దుకాణములో కూడా అందరికీ గుర్తు చేయిస్తూ ఉండాలి. భారత్ లో సత్యయుగమున్నప్పుడు ఒకే ధర్మము ఉండేది. ఇందులో కోపగించుకునే విషయమే లేదు. అందరికీ తండ్రి ఒక్కరే. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి, స్వర్గానికి యజమానులుగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారుచేసే సేవ చేయాలి, అనేకులను తమ సమానంగా తయారుచేయాలి. ఆసురీ మతము నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. స్మృతి యొక్క శ్రమ ద్వారా ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. సుదాముని వలె మీ వద్ద గల పిడికెడు బియ్యమును సఫలము చేసుకొని మీ కోరికలన్నీ సిద్ధింపజేసుకోవాలి.

వరదానము:- పరీక్షలు మరియు సమస్యలలో వాడిపోయేందుకు బదులుగా మనోరంజనాన్ని అనుభవం చేసే సదా విజయీ భవ

ఈ పురుషార్థీ జీవితంలో డ్రామానుసారంగా సమస్యలు లేదా పరిస్థితులు రావల్సిందే. జన్మ తీసుకుంటూనే, ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకోవడం అనగా పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించడం. మార్గంలో వెళ్ళాలన్నప్పుడు, ఆ మార్గంలో దృశ్యాలు ఉండకూడదు అంటే ఎలా వీలవుతుంది. కానీ ఆ దృశ్యాలను దాటేందుకు బదులుగా, ఒకవేళ కరెక్షన్ చేయడం ప్రారంభిస్తే, తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది మరియు మనోరంజనానికి బదులుగా మనసును వాడిపోయేలా చేసుకుంటారు. కావున వాహ్ దృశ్యాలు వాహ్ అనే పాటను పాడుతూ ముందుకు వెళ్ళండి, అనగా సదా విజయీ భవ యొక్క వరదానులుగా అవ్వండి.

స్లోగన్:- మర్యాదలలో నడవడం అనగా మర్యాదా పురుషోత్తములుగా అవ్వడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *