Telugu Murli 19/08/20

19-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైనపిల్లలూ – ఇప్పుడు మీ పిలుపును వినడం జరిగింది, మీరు ఈ పురుషోత్తమ సంగమయుగములో ఉత్తమోత్తమమైన పురుషులుగా తయారయ్యే ఆ రోజు చివరకు వచ్చేసింది”

ప్రశ్న:- గెలుపు మరియు ఓటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ మనుష్యులను దుఃఖితులుగా చేస్తుంది?

జవాబు:- “జూదము”. చాలామంది మనుష్యులలో జూదమాడే అలవాటు ఉంటుంది, ఇది భ్రష్ట కర్మ. ఎందుకంటే ఓడిపోతే దుఃఖము మరియు గెలిస్తే సంతోషము కలుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి యొక్క ఆజ్ఞ – పిల్లలూ, దైవీ కర్మలను చెయ్యండి. సమయం వ్యర్థమయ్యేటటువంటి కర్మలేవీ చెయ్యకండి. సదా అనంతమైన విజయమును పొందే పురుషార్థము చేయండి.

గీతము:- చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది…… (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్ ……)

ఓంశాంతి. డబల్ ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా ఓం శాంతి అని చెప్పాలి. ఇక్కడ డబల్ ఓంశాంతి ఉంటుంది. ఒకటి సుప్రీమ్ ఆత్మ (శివబాబా) ఓంశాంతి అని చెప్తారు, రెండవది ఈ దాదా ఓంశాంతి అని చెప్తారు. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని, శాంతి దేశంలో ఉంటానని పిల్లలైన మీరు కూడా చెప్తారు. ఇక్కడ ఈ స్థూల దేశములోకి పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఈ విషయాలను ఆత్మలు మర్చిపోయారు, మళ్ళీ మీ పిలుపు వినే ఆ రోజు చివరికి రానే వచ్చింది. ఏ పిలుపును వింటారు? బాబా, దుఃఖాన్ని హరించి సుఖమునివ్వండి అని అంటారు. ప్రతి ఒక్క మనిషి సుఖ-శాంతులనే ఇష్టపడతారు. తండ్రి పేదల పెన్నిధి. ఈ సమయంలో భారత్ పూర్తిగా నిరుపేదగా ఉంది. మనము పూర్తిగా షావుకార్లుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, మిగిలినవారందరూ అడవిలో ఉన్నారు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా నిశ్చయముంది. వీరు శ్రీ శ్రీ అని, వీరి మతము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనదని మీకు తెలుసు. భగవానువాచ కదా. మనుష్యులైతే వాయిద్యము మ్రోగించినట్లుగా రామ-రామ అని జపం చేస్తూ ఉంటారు. కాని రాముడైతే త్రేతాయుగపు రాజు, వారి మహిమ గొప్పది. 14 కళలుండేవి. రెండు కళలు తక్కువ, వారి గురించి కూడా రామ రాజ, రామ ప్రజ….. అని పాడుతారు. మీరు షావుకార్లుగా అవుతున్నారు కదా. రాముని కంటే గొప్ప షావుకార్లు లక్ష్మీ-నారాయణులు. రాజును అన్నదాత అని అంటారు. బాబా కూడా దాతయే, వారు అన్నీ ఇస్తారు, పిల్లలను విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. పాపము చేసి పొందడానికి, అక్కడ అప్రాప్తి అనే వస్తువు ఏదీ ఉండదు. అక్కడ పాపము యొక్క పేరే ఉండదు. అర్థకల్పము దైవీ రాజ్యము, తర్వాత అర్థకల్పము ఆసురీ రాజ్యము. ఎవరిలోనైతే దేహాభిమానము, పంచ వికారాలుంటాయో, వారినే అసురులని అంటారు.

ఇప్పుడు మీరు నావికుడు మరియు తోట యజమాని వద్దకు వచ్చారు. మనము డైరెక్ట్ గా వారి వద్ద కూర్చున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా కూర్చుని-కూర్చుని మర్చిపోతారు. భగవంతుడు ఇస్తున్న ఆజ్ఞను అంగీకరించాలి కదా. మొదట శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారుచేసేందుకు వారు శ్రీమతానిస్తున్నారు. కావున వారి మతముపై నడుచుకోవాలి కదా. దేహీ-అభిమానులుగా అవ్వండి అని మొట్టమొదటి మతానిస్తున్నారు. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. ఇది పక్కా అంటే పక్కాగా గుర్తుంచుకోండి. ఈ మాటలను గుర్తు చేసుకుంటే నావ తీరానికి చేరిపోతుంది. మీరే 84 జన్మలు తీసుకుంటారు అని పిల్లలకు అర్థం చేయించబడింది. మీరే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఈ ప్రపంచము అయితే పతితంగా దుఃఖితముగా ఉంది. స్వర్గాన్ని సుఖధామము అని అంటారు. శివబాబా, భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. మనము వారి విద్యార్థులము. వారు తండ్రి కూడా, టీచరు కూడా, కనుక బాగా చదువుకోవాలి. దైవీ కర్మలు కూడా చేయాలి. ఎటువంటి భ్రష్ట కర్మ చేయకూడదు. జూదము కూడా భ్రష్ఠకర్మలలోకి వస్తుంది. ఇది కూడా దుఃఖమునిస్తుంది. ఓడిపోతే దుఃఖం కలుగుతుంది, గెలిస్తే సంతోషం కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు మాయతో అనంతమైన ఓటమిని పొందారు. ఇది కూడా అనంతమైన గెలుపు-ఓటముల ఆట. పంచ వికారాల రూపీ రావణునితో ఓడిపోతే ఓటమి, వాటిపై విజయము పొందాలి. మాయతో ఓడిపోతే ఓటమినే. ఇప్పుడు పిల్లలైన మీకు విజయము లభిస్తుంది. ఇప్పుడు మీరు కూడా జూదము మొదలైనవన్నీ వదిలేయాలి. ఇప్పుడు అనంతమైన విజయాన్ని పొందేందుకు పూర్తిగా అటెన్షన్ పెట్టాలి. అటువంటి కర్మను ఎప్పుడూ చేయకూడదు, సమయాన్ని వ్యర్థము చేయకూడదు. అనంతమైన విజయము పొందేందుకు పురుషార్థము చేయాలి. చేయించే తండ్రి సమర్థుడు. వారు సర్వశక్తివంతుడు. కేవలం తండ్రి మాత్రమే సర్వశక్తివంతుడు కాదు, రావణుడు కూడా సర్వశక్తివంతుడే అని కూడా అర్థం చేయించారు. అర్థకల్పము రావణరాజ్యము, అర్థకల్పము రామరాజ్యము నడుస్తుంది. ఇప్పుడు మీరు రావణునిపై విజయము పొందుతారు. ఇప్పుడు ఆ హద్దు విషయాలను వదిలి అనంతములో నిమగ్నమవ్వాలి. నావికుడు వచ్చారు. చివరకు ఆ రోజు వచ్చింది కదా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మీ పిలుపును వినడం జరుగుతుంది. పిల్లలూ, మీరు అర్థకల్పము చాలా ఎదురుదెబ్బలు తిన్నారు, పతితంగా అయ్యారు అని తండ్రి చెప్తున్నారు. భారత్ పావనమైన శివాలయంగా ఉండేది. మీరు శివాలయంలో ఉండేవారు. ఇప్పుడు మీరు వేశ్యాలయములో ఉన్నారు. మీరు శివాలయంలో ఉండేవారిని పూజిస్తారు. ఇక్కడ ఈ అనేక ధర్మాల గొడవ ఎంతగా ఉంది. నేను వీటన్నిటినీ సమాప్తం చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. అన్నీ వినాశనమవ్వాల్సిందే, ఇతర ధర్మ స్థాపకులు వినాశనము చేయరు. వారు సద్గతినిచ్చే గురువులు కూడా కాదు. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది. సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే. ఈ పదాలను బాగా నోట్ చేసుకోండి. ఇక్కడ విని బయటకు వెళ్ళగానే ఇక్కడిది ఇక్కడే వదిలేసేవారు చాలామంది ఉన్నారు. గర్భజైలులో ఉన్నప్పుడు, మేము పాపాలు చేయము అని అంటారు. బయటకు వస్తారు, అంతే, అక్కడిది అక్కడే ఉండిపోతుంది. కొద్దిగా పెద్ద అవ్వగానే పాపాలు చేయడం ప్రారంభిస్తారు. కామ ఖడ్గాన్ని నడిపిస్తారు. సత్యయుగంలోనైతే గర్భము కూడా మహల్లా ఉంటుంది. కనుక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు – చివరకు ఆ రోజు నేడు వచ్చింది. ఏ రోజు? పురుషోత్తమ సంగమయుగపు రోజు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మేము పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లలు ఫీల్ అవుతారు. ఉత్తమోత్తమ పురుషులుగా మనమే ఉండేవారము, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ధర్మముండేది. కర్మలు కూడా శ్రేష్ఠతి శ్రేష్ఠంగా ఉండేవి. రావణరాజ్యమే ఉండదు. తండ్రి వచ్చి చదివించే ఆ రోజు ఆఖరికి రానే వచ్చింది. వారే పతిత-పావనుడు. కావున అటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. ఇప్పుడిది కలియుగ అంతిమం. పావనంగా అయ్యేందుకు, కొంచెం సమయము కూడా కావాలి కదా. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థులని అంటారు. 60 వస్తే చేతికర్ర వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూడండి, 80 సంవత్సరాల వారు కూడా వికారాలను విడిచిపెట్టరు. నేను వీరి వానప్రస్థ స్థితిలో వీరిలో ప్రవేశించి వీరికి అర్థము చేయిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే పవిత్రంగా అయి తీరం చేరుతుంది. ఆత్మయే ఎగురుతుంది. ఇప్పుడు ఆత్మ రెక్కలు తెగిపోయి ఉన్నాయి. ఎగరలేదు. రావణుడు రెక్కలను తెంచేశాడు. పతితంగా అయిపోయింది. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. మొదటైతే సుప్రీమ్ తండ్రిని తెలుసుకోవాలి కదా. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శంకరుని ఊరేగింపు ఉండదు. తండ్రి వెనుక పిల్లలైన మనమందరం వెళ్తాము. తీసుకెళ్ళేందుకే బాబా వచ్చి ఉన్నారు. శరీర సహితంగానైతే తీసుకువెళ్ళలేరు కదా. ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. పవిత్రంగా అవ్వనంతవరకు తిరిగి వెళ్ళలేరు. పవిత్రత ఉన్నప్పుడు శాంతి మరియు సంపద ఉండేవి. కేవలం ఆది సనాతన దేవ-దేవతా ధర్మం వారైన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఇతర ధర్మాల వారందరూ ఉన్నారు. దేవతా ధర్మము లేనే లేదు. దీనిని కల్ప వృక్షమని అంటారు. దీనిని మర్రి వృక్షంతో పోల్చడం జరుగుతుంది. కాండము లేదు. మిగతా వృక్షమంతా నిలబడి ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా పునాది అయిన దేవీ-దేవతా ధర్మము లేదు. మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. ఒకప్పుడు ఆ దేవతా ధర్మము ఉండేది కాని ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది, మళ్ళీ పునరావృతమవుతుంది. నేను ఏకధర్మ స్థాపన చేసేందుకు మళ్ళీ వస్తాను, మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి, లేకపోతే సృష్టిచక్రము ఎలా తిరగుతుంది అని బాబా చెప్తున్నారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమవుతాయని కూడా అంటారు. ఇప్పుడిది పాత ప్రపంచము, మళ్ళీ కొత్త ప్రపంచము పునరావృతమవుతుంది. ఈ పాత ప్రపంచము మారి కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. ఇదే భారత్ క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. యమునా నది తీరములో పరిస్తాన్ ఉండేదని అంటారు. మీరు కామచితిపై కూర్చుని శ్మశానగ్రస్తులుగా అయిపోయారు, మళ్ళీ మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తారు అని బాబా చెప్తున్నారు. శ్రీ కృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు – ఎందుకు? ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. పేరు అయితే బాగుంది కదా. రాధ మరియు కృష్ణుడు – వీరు కొత్త ప్రపంచపు యువరాజు-యువరాణులు. కామచితిపై కూర్చోవడంతో ఇనుప యుగము వారిగా అయిపోయారు అని బాబా చెప్తున్నారు. సాగరుని పిల్లలు కామచితిపై కాలి మరణించారని గాయనము కూడా ఉంది. ఇప్పుడు తండ్రి అందరిపై జ్ఞాన వర్షమును కురిపిస్తున్నారు. తర్వాత, అందరూ బంగారు యుగములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడిది సంగమయుగము. మీకు అవినాశీ జ్ఞానరత్నాల దానము లభిస్తోంది, దీని ద్వారా మీరు షావుకార్లుగా అవుతారు. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది. వారు శాస్త్రాల మహావాక్యాలు లక్షల విలువ చేస్తాయని భావిస్తారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా పదమపతులుగా అవుతారు. ఇది సంపాదనకు ఆధారము కదా. ఈ జ్ఞానరత్నాలను మీరు ధారణ చేస్తారు. జోలెను నింపుకుంటారు. వారు మళ్ళీ శంకరుని గురించి – ఓ బమ్ బమ్ మహదేవ, జోలెను నింపు…. అని అంటారు. శంకరునిపై ఎన్ని నిందలను మోపారు. బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఇక్కడే ఉంది. 84 జన్మలు అని విష్ణువు కోసమూ చెప్తారు, లక్ష్మీ-నారాయణల కోసము కూడా అంటారని మీకు తెలుసు. మీరు బ్రహ్మా కోసం కూడా చెప్తారు. తండ్రి కూర్చుని తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి, బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఏమిటి అన్నది అర్థము చేయిస్తున్నారు. మీరే దేవతలుగా ఉండేవారు, చక్రములో తిరిగి బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు దేవతలుగా అవుతారు. పాత్రంతా ఇక్కడే నడుస్తుంది. వైకుంఠంలోని ఆట-పాటలను చూస్తారు. ఇక్కడైతే వైకుంఠము లేదు. మీరా నాట్యము చేసేవారు. వాటన్నింటినీ సాక్షాత్కారాలు అని అంటారు. ఆమెకెంత గౌరవముంది. సాక్షాత్కారము జరిగింది, కృష్ణుడితో నాట్యం చేసారు. అయితే ఏమిటి, స్వర్గములోకైతే వెళ్ళలేదు కదా. గతి-సద్గతులు సంగమంలోనే లభిస్తాయి. ఈ పురుషోత్తమ సంగమయుగాన్ని మీరు అర్థము చేసుకున్నారు. మనము బాబా ద్వారా ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. విరాటరూప జ్ఞానము కూడా కావాలి కదా. చిత్రాన్ని పెడతారు, దాని అర్థమేమీ తెలియదు. అకాసురుడు-బకాసురుడు, ఇవన్నీ ఈ సంగమయుగములోని పేర్లు. భస్మాసురుడు అన్న పేరు కూడా ఉంది. కామచితిపై కూర్చుని భస్మమైపోయారు. నేను అందరినీ మళ్ళీ జ్ఞానచితిపై కూర్చోబెట్టి తీసుకువెళ్తాను అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఆత్మలందరూ సోదరులు. హిందూ-చైనీయులు సోదరులు, హిందూ-ముస్లింలు సోదరులు అని కూడా అంటారు. ఇప్పుడు సోదరులు కూడా పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. ఆత్మయే కర్మ చేస్తుంది కదా. శరీరము ద్వారా ఆత్మ కొట్లాడుతుంది. పాపము కూడా ఆత్మకే అంటుకుంటుంది, అందుకే పాపాత్మ అని అంటారు. తండ్రి ఎంత ప్రేమగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శివబాబా మరియు బ్రహ్మాబాబా, ఇద్దరికీ పిల్లలూ-పిల్లలూ అని పిలిచే హక్కు ఉంది. ఓ పిల్లలూ! ఆత్మనైన నేను ఇక్కడికొచ్చి పాత్రను అభినయిస్తున్నాను అని అర్థం చేసుకున్నారు కదా అని తండ్రి, దాదా ద్వారా అడుగుతున్నారు. తర్వాత అంతిమంలో తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా చేసి తమతోపాటు తీసుకువెళ్తారు. తండ్రియే వచ్చి జ్ఞానాన్నిస్తారు. వారు రావడం కూడా ఇక్కడికే వస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివజయంతి తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి జరుగుతుంది. శ్రీ కృష్ణుడే మళ్ళీ శ్రీ నారాయణుడిగా అవుతారు. మళ్ళీ చక్రము తిరిగి అంతిమంలో నల్లగా (పతితంగా) అవుతారు. తండ్రి వచ్చి మళ్ళీ సుందరంగా తయారుచేస్తారు. మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. మళ్ళీ మెట్లు దిగుతారు. ఈ 84 జన్మల లెక్క ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రియే పిల్లలకు అర్థము చేయిస్తారు. చివరకు భక్తుల పిలుపు వినడం జరుగుతుంది అని పాటను కూడా విన్నారు. ఓ భగవంతుడా, మీరు వచ్చి మాకు భక్తి ఫలమునివ్వండి అని పిలుస్తారు కూడా. భక్తి ఫలమునివ్వదు. ఫలమును భగవంతుడు ఇస్తారు. భక్తులను దేవతలుగా చేస్తారు. మీరు చాలా భక్తి చేశారు. మొట్టమొదట మీరే శివుని భక్తి చేశారు. ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థము చేసుకుంటారో, వారు మన కులానికి చెందినవారని మీరు ఫీల్ అవుతారు. ఎవరి బుద్ధిలోనైతే కూర్చోదో, వారు చాలా భక్తి చేయలేదు, వెనుక వచ్చారని అర్థము చేసుకోండి. ఇక్కడ కూడా ప్రారంభం నుండి రారు. ఇది లెక్క. ఎవరైతే చాలా భక్తి చేశారో వారికి ఫలము ఎక్కువగా లభిస్తుంది. భక్తి కొద్దిగా చేసినట్లయితే ఫలము కూడా కొద్దిగానే లభిస్తుంది. వారు స్వర్గ సుఖాలను అనుభవించలేరు ఎందుకంటే ప్రారంభములో వారు శివుని భక్తిని తక్కువగా చేసారు. మీ బుద్ధి ఇప్పుడు పని చేస్తుంది. బాబా రకరకాల యుక్తులు చాలా తెలియజేస్తుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నము పదమాల సమానమైనది, వీటితో మీ జోలెను నింపుకొని, బుద్ధిలో ధారణ చేసిన తర్వాత దానము చేయాలి.

2. శ్రీ శ్రీ యొక్క శ్రేష్ఠ మతంపై పూర్తిగా నడవాలి. ఆత్మను సతోప్రధానంగా తయారుచేసుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థమును పూర్తిగా చేయాలి.

వరదానము:- మన్మనాభవ యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసే నష్టోమోహా స్మృతి స్వరూప భవ

బంధనాల బీజము సంబంధము. తండ్రితో సర్వ సంబంధాలు జోడించినప్పుడు ఇతరుల పట్ల మోహం ఎలా ఏర్పడుతుంది. సంబంధము లేకుండా మోహముండదు మరియు మోహము లేకపోతే బంధనముండదు. ఎప్పుడైతే బీజమునే సమాప్తం చేస్తారో, అప్పుడు బీజము లేకుండా వృక్షము ఎలా జన్మిస్తుంది. ఒకవేళ ఇప్పటివరకు బంధనాలున్నట్లయితే, కొన్ని తెంచేశారు, కొన్ని జోడించారు అని ఋజువు అవుతుంది, అందువలన మన్మనాభవ అనే విధి ద్వారా మనసు యొక్క బంధనాల నుండి కూడా ముక్తులై, నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు ఏం చేయాలి, బంధనం ఉంది, తెగిపోవడం లేదు అనే ఈ ఫిర్యాదులు సమాప్తమైపోతాయి.

స్లోగన్:- బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉల్లాస-ఉత్సాహాలు కావున ఎటువంటి పరిస్థితులలోనైనా ఉల్లాస-ఉత్సాహాల ప్రెషర్ తగ్గిపోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *