Telugu Murli 22/08/20

22-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైన పిల్లలూ- తండ్రికి పిల్లలైన మీరే ప్రియమైనవారు, మిమ్మల్ని సరిదిద్దేందుకే తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు, సదా ఈశ్వరీయ మతంపై నడుచుకుంటూ స్వయాన్ని పవిత్రంగా తయారుచేసుకోండి”

ప్రశ్న:- విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు మరియు ఏ విధితో జరుగుతుంది?

జవాబు:- మీకు తెలుసు – మహాభారత యుద్ధము తర్వాతనే విశ్వములో శాంతి ఏర్పడుతుంది. కానీ దీని కోసం మీరు మొదటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి. మీ కర్మాతీత స్థితిని తయారుచేసుకునేందుకు శ్రమ చేయాలి. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని స్మరిస్తూ తండ్రి స్మృతి ద్వారా సంపూర్ణ పావనంగా అవ్వాలి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన జరుగుతుంది.

గీతము:- నేడు మానవుడు అంధకారములో ఉన్నాడు…… (ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్……)

ఓంశాంతి. ఇది భక్తి మార్గములో పాడిన పాట. మేము అంధకారములో ఉన్నాము, ఇప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రమునివ్వండి అని అంటారు. జ్ఞానసాగరుడిని జ్ఞానం అడుగుతారు. మిగిలినదంతా అజ్ఞానము. కలియుగంలో అందరూ అజ్ఞానం యొక్క ఆసురీ నిద్రలో నిద్రిస్తున్న కుంభకర్ణులు అని అంటారు. జ్ఞానమైతే చాలా సులభము అని తండ్రి చెప్తున్నారు. భక్తిమార్గములో అనేక వేద-శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, హఠయోగాలు చేస్తారు, గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే వారెప్పుడూ రాజయోగము నేర్పించలేరు. తండ్రి మాత్రమే రాజ్యాన్నిస్తారు. మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. అందుకే సన్యాసులు, సుఖము కాకిరెట్టతో సమానమని అంటారు ఎందుకంటే వారు స్వయం ఇళ్ళు-వాకిళ్ళు వదిలి పారిపోతారు. ఈ జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ రాజయోగాన్ని భగవంతుడు మాత్రమే నేర్పిస్తారు. మనుష్యులు, మనుష్యులను పావనంగా చేయలేరు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు భక్తిమార్గములో ఎంతగా చిక్కుకొని ఉన్నారు. జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. స్నానాలు చేసేందుకు వెళ్తారు. కేవలం గంగా స్నానానికే కాదు, ఎక్కడైనా నీటి చెరువులు మొదలైనవి చూస్తే, వాటిని కూడా పతిత-పావనిగా భావిస్తారు. ఇక్కడ కూడా గోముఖముంది. జలపాతాలు నుండి నీరు వస్తుంది. బావిలోని నీటిని పతిత-పావని గంగ అని అనరు. ఇది కూడా తీర్థ స్థానమని మనుష్యులు భావిస్తారు. చాలామంది మనుష్యులు భావనతో అక్కడికి వెళ్ళి స్నానాలు మొదలైనవి చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది. మీరు చెప్పినా కూడా వారు అంగీకరించరు. తమ దేహ-అహంకారము చాలా ఉంటుంది. మేము ఇన్ని శాస్త్రాలు చదివాము…… అని అంటారు. ఇంతవరకు చదివినదంతా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనష్యులకెలా తెలుస్తాయి, కనుక ఇటువంటి పాయింట్లు రాసి విమానము నుండి క్రిందకు వేయమని తండ్రి చెప్తున్నారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పుడుతుంది అని ఈ రోజుల్లో అడుగుతారు. ఎవరైనా సలహా ఇస్తే వారికి బహుమతులు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు వారు శాంతిని స్థాపించలేరు. శాంతి ఎక్కడుంది? అసత్యపు బహుమతులు ఇస్తూ ఉంటారు.

యుద్ధము తర్వాతనే విశ్వములో శాంతి ఏర్పడుతుందని మీకిప్పుడు తెలుసు. ఈ యుద్ధము ఏ సమయంలోనైనా ప్రారంభము కావచ్చు. అటువంటి తయారీ ఉన్నది. కేవలం పిల్లలైన మీరు కర్మాతీత స్థితిని పొందడమే ఆలస్యము, ఇందులోనే శ్రమ ఉంది. బాబా చెప్తున్నారు, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి మరియు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి మరియు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. డ్రామానుసారంగా కల్పక్రితము వలె విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది అని మీరు వ్రాయవచ్చు కూడా. విశ్వంలో శాంతి సత్యయుగములోనే ఉంటుంది అని మీరు అర్థం చేయించవచ్చు కూడా. ఇక్కడ తప్పకుండా అశాంతే ఉంటుంది. కానీ చాలామంది మీ మాటలు నమ్మరు ఎందుకంటే వారు స్వర్గములోకి వచ్చేది లేదు, కావున శ్రీమతంపై నడవరు. ఇక్కడ కూడా చాలామంది శ్రీమతంపై పవిత్రంగా ఉండలేకపోతున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడి మతం మీకు లభిస్తుంది. ఎవరి నడవడిక అయినా సరిగ్గా లేకపోతే, ఈశ్వరుడు మీకు మంచి మతం ఇవ్వాలి అని అంటారు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతంపై నడుచుకోవాలి. 63 జన్మలు మీరు విషయసాగరములో మునకలు వేశారు అని తండ్రి చెప్తున్నారు. వారు పిల్లలతోనే మాట్లాడతారు. తండ్రి, పిల్లలనే సరిదిద్దుతారు కదా. వారు మొత్తం ప్రపంచమంతటినీ ఎలా సరిదిద్దుతారు. పిల్లల ద్వారా తెలుసుకోండి అని వారు బయటివారికి చెప్తారు. తండ్రి బయటవారితో మాట్లాడరు. తండ్రికి పిల్లలే ప్రియమనిపిస్తారు. సవతి పిల్లలు ప్రియమనిపించరు. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకు ధనమునిస్తారు. పిల్లలందరూ సమానంగా ఉండరు. తండ్రి కూడా చెప్తున్నారు, నా పిల్లలుగా అయినవారికే నేను వారసత్వాన్నిస్తాను, ఎవరైతే నా వారుగా అవ్వరో, వారు జీర్ణము చేసుకోలేరు. శ్రీమతంపై నడవలేరు. వారు భక్తులు. బాబా చాలామందిని చూశారు. ఎవరైనా గొప్ప సన్యాసి వస్తే, వారికి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. ఫండ్స్ (చందాలు) పోగు చేస్తారు. తమ-తమ శక్తి అనుసారంగా ఫండ్స్ ఇస్తారు. ఇక్కడ తండ్రి చందాలు వసూలు చేయమని అయితే చెప్పరు. ఇక్కడ ఏ బీజాన్నైతే నాటుతారో, దాని ఫలము 21 జన్మల వరకు పొందుతారు. మనుష్యులు దానము చేసేటప్పుడు, మేము ఈశ్వరార్థము చేస్తున్నామని భావిస్తారు. ఈశ్వర సమర్పణమ్ అని అంటారు లేక కృష్ణ సమర్పణమ్ అని అంటారు. కృష్ణుడి పేరు ఎందుకు చెప్తారు? ఎందుకంటే వారిని గీతా భగవంతునిగా భావిస్తారు. శ్రీరాధార్పణమ్ అని ఎప్పుడూ అనరు. ఈశ్వరార్పణమ్ లేక కృష్ణార్పణమ్ అని అంటారు. ఫలమునిచ్చేవారు ఈశ్వరుడు మాత్రమే అని తెలుసు. ఎవరైనా షావుకారుని ఇంట్లో జన్మిస్తే, వారు గత జన్మలో చాలా దాన-పుణ్యాలు చేశారు, అందుకే ఈ విధంగా అయ్యారు అని అంటారు కదా. రాజుగా కూడా అవ్వవచ్చు. కానీ అది అల్పకాలిక కాకిరెట్ట సమానమైన సుఖము. రాజులకు కూడా సన్యాసులు సన్యాసం చేయించేటప్పుడు, స్త్రీ సర్పం వంటివారు అని వారికి చెప్తారు, కానీ దుశ్శాసనుడు నన్ను నగ్నంగా చేస్తున్నాడని ద్రౌపది పిలిచింది. ఇప్పుడు కూడా అబలలు, మా గౌరవాన్ని కాపాడండి అని ఎంతగా పిలుస్తారు. బాబా, వీరు మమ్మల్ని చాలా కొడుతున్నారు, విషాన్నివ్వకపోతే చంపేస్తామని అంటున్నారు, బాబా, ఈ బంధనాల నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. బంధనాలైతే సమాప్తమయ్యేదే ఉంది, తర్వాత 21 జన్మలు ఎప్పుడూ నగ్నంగా అవ్వరు అని తండ్రి చెప్తున్నారు. అక్కడ వికారాలే ఉండవు. ఈ మృత్యు లోకంలో ఇది అంతిమ జన్మ. ఇది వికారీ ప్రపంచము.

రెండవ విషయము, మనుష్యులు ఈ సమయంలో ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ స్వర్గమెక్కడ ఉంది. ఇది నరకము. స్వర్గవాసులయ్యారంటే తప్పకుండా నరకములోనే ఉన్నారు. కానీ నీవు నరకవాసివి అని ఎవరినైనా నేరుగా అంటే, వారు డిస్టర్బ్ అవుతారు. ఇటువంటి వారికి మీరు వ్రాయాలి – ఫలానావారు స్వర్గవాసులైయ్యారంటే దాని అర్థం మీరు నరకవాసులు అనే కదా. మీరు సత్యాతి-సత్యమైన స్వర్గములోకి వెళ్ళేటటువంటి యుక్తిని మేము మీకు తెలియజేస్తాము. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. 5 వేల సంవత్సరాల క్రితము వలె, ఈ యుద్ధము తర్వాత, విశ్వంలో శాంతి ఏర్పడుతుందని వార్తాపత్రికలలో ప్రకటించండి. అక్కడ ఒకే ఒక ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది. వారు మళ్ళీ అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన అసురులుండేవారు, త్రేతాలో రావణుడు ఉండేవాడు అని అంటారు. ఇప్పుడు వారితో ఎవరు తల బాదుకోవాలి? జ్ఞానానికి మరియు భక్తికి రాత్రికి-పగలుకి ఉన్నంత తేడా ఉంది. ఇంత సహజమైన విషయము కూడా ఎవరి బుద్ధిలోనైనా కష్టంగా కూర్చుంటుంది. కనుక ఇటువంటి స్లోగన్స్ తయారుచేయాలి. డ్రామానుసారంగా ఈ యుద్ధము తర్వాత విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. కల్ప-కల్పము విశ్వంలో శాంతి ఏర్పడుతుంది, మళ్ళీ కలియుగాంతంలో అశాంతి ఏర్పడుతుంది. సత్యయుగములో మాత్రమే శాంతి ఉంటుంది. గీతలో పొరపాటు చేయడం వల్లనే భారత్ కు ఇటువంటి పరిస్థితి వచ్చిందని మీరు వ్రాయవచ్చు కూడా. పూర్తిగా 84 జన్మలు తీసుకున్న శ్రీ కృష్ణుని పేరు వేశారు. శ్రీ నారాయణుని పేరు కూడా వేయలేదు. ఎంతైనా వారికి 84 జన్మలలో కొన్ని రోజులు తక్కువ అని చెప్పాలి కదా. కృష్ణుడికి పూర్తిగా 84 జన్మలుంటాయి. పిల్లలను వజ్రంలా తయారుచేసేందుకు శివబాబా వస్తారు, మరి వారు వచ్చి ప్రవేశించేందుకు వారి కోసం డిబ్బీ (శరీరము) కూడా అటువంటి బంగారముదిగా ఉండాలి. ఇప్పుడు వీరిని బంగారముగా ఎలా చేయాలి, అందుకే వెంటనే, నీవు విశ్వానికి యజమానిగా అవుతావు అని వారికి సాక్షాత్కారము చేయించారు. ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి అని చెప్పిన వెంటనే పవిత్రంగా అవ్వడం ప్రారంభించారు. పవిత్రంగా అవ్వకపోతే జ్ఞాన ధారణ జరగదు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలి. ఇది పరమపిత పరమాత్మ యొక్క జ్ఞానము. దీన్ని ధారణ చేసేందుకు కూడా బంగారు పాత్ర కావాలి. పవిత్రంగా ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కిందపడిపోతే యోగం యొక్క యాత్రనే సమాప్తమైపోతుంది. జ్ఞానము కూడా సమాప్తమైపోతుంది. భగవానువాచ, కామము మహాశత్రువు అని ఎవ్వరికీ చెప్పలేరు. వారికి బాణము తగలదు. తర్వాత వారు కేవలం ఇతరులను మాత్రమే మేల్కొలిపి స్వయం నిదురించే జ్ఞానులుగా అవుతారు. ఎటువంటి వికారము ఉండకూడదు. రోజూ లెక్కాపత్రం వ్రాయండి. తండ్రి ఏ విధంగా సర్వశక్తివంతుడో, అదే విధంగా మాయ కూడా సర్వశక్తివంతమైనది. అర్థకల్పము రావణరాజ్యము నడుస్తుంది. దీనిపై విజయము బాబా తప్ప ఇంకెవ్వరూ కలిగించలేరు. డ్రామానుసారంగా రావణరాజ్యము కూడా ఉండాల్సిందే. భారత్ యొక్క గెలుపు-ఓటముల పైనే ఈ డ్రామా తయారు చేయబడింది. ఈ తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థము చేయిస్తారు. ముఖ్యమైనది పవిత్రంగా అయ్యే విషయము. పతితులను పావనంగా చేసేందుకే నేనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. కానీ శాస్త్రాలలో పాండవులు మరియు కౌరవుల యుద్ధము, జూదము మొదలైనవి కూర్చుని చూపించారు. ఇటువంటి విషయాలు అక్కడెలా జరుగుతాయి. రాజయోగ చదువు ఈ విధంగా ఉంటుందా? యుద్ధ మైదానములో గీతా పాఠశాల ఉంటుందా? జనన-మరణ రహితుడైన శివబాబా ఎక్కడ, పూర్తిగా 84 జన్మలు తీసుకునే కృష్ణుడెక్కడ. వారి అంతిమ జన్మలోనే బాబా వచ్చి ప్రవేశిస్తారు. ఎంత స్పష్టంగా ఉంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా కూడా అవ్వాలి. ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండలేరు అని సన్యాసులు కూడా అంటారు. మీకు ఎటువంటి ప్రాప్తి లభించనప్పుడు పవిత్రంగా ఎలా ఉండగలరు అని చెప్పండి. ఇక్కడైతే విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. నా కోసం కుల గౌరవాన్ని కాపాడండి అని తండ్రి చెప్తున్నారు. వీరి గడ్డం పరువు నిలబెట్టండి అని శివబాబా చెప్తున్నారు. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా ఉన్నట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు మీ కోసమే శ్రమ చేస్తున్నారు. ఇతరులెవ్వరూ స్వర్గములోకి రాలేరు. ఇక్కడ మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో అందరూ కావాలి కదా. అక్కడ మంత్రులుండరు. రాజులకు సలహాలు తీసుకునే అవసరముండదు. పతిత రాజుల వద్ద కూడా ఒకే మంత్రి ఉంటారు. ఇక్కడైతే ఎంతమంది మంత్రులున్నారో చూడండి. పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అన్ని జంఝాటాల నుండి విడిపిస్తారు. తర్వాత 3 వేల సంవత్సరాలు ఎటువంటి యుద్ధాలు జరగవు. జైలు మొదలైనవి ఉండవు. కోర్టు మొదలైనవేవీ ఉండవు. అక్కడ సుఖమే సుఖముంటుంది. దీనికోసం పురుషార్థము చేయాలి. మృత్యువు తలపై నిలబడి ఉంది. స్మృతియాత్ర ద్వారా వికర్మాజీతులుగా అవ్వాలి. మీరే అందరికీ మన్మనాభవ అని తండ్రి సందేశమునిచ్చే సందేశకులు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా అయి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా తయారుచేసుకోవాలి. కేవలం ఇతరులను మాత్రమే మేల్కొలిపి స్వయం నిదురించే జ్ఞానులుగా అవ్వకండి.

2. నేరుగా తండ్రి ఎదురుగా తమదంతా అర్పించి శ్రీమతంపై నడుస్తూ 21 జన్మల కోసం రాజ్య పదవిని తీసుకోవాలి.

వరదానము:- శుద్ధి యొక్క విధి ద్వారా కోటను దృఢంగా చేసుకునే సదా విజయీ మరియు నిర్విఘ్న భవ

ఈ కోటలో ప్రతి ఆత్మ సదా విజయీగా మరియు నిర్విఘ్నంగా అవ్వాలి, దీనికోసం విశేషమైన సమయంలో నలువైపులా ఒకేసారి యోగం యొక్క ప్రోగ్రాం పెట్టండి. అప్పుడు ఎవ్వరూ ఈ తీగను కట్ చేయలేరు, ఎందుకంటే సేవను ఎంతగా పెంచుతూ ఉంటారో, అంతగా మాయ కూడా తనవారిగా చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కావున ఏ కార్యాన్నైనా ప్రారంభించే సమయంలో ఏ విధంగా శుద్ధి యొక్క విధులను నిర్వహిస్తారో, అదే విధంగా సంగఠిత రూపంలో సర్వ శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఒకే శుద్ధ సంకల్పముండాలి – నేను విజయీని, ఇదే శుద్ధి యొక్క విధి – దీని ద్వారా కోట దృఢంగా అవుతుంది.

స్లోగన్:- యుక్తియుక్తమైన మరియు యథార్థమైన సేవకు ప్రత్యక్ష ఫలము సంతోషము.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

ఇప్పుడు వికర్మలు తయారుచేసుకునే కాంపిటీషన్ చేయకూడదు

మొట్టమొదట, మేము ఏలాగైనాసరే మా వికారాలను వశం చేసుకోవాలి అన్న లక్ష్యము మీరు తప్పకుండా పెట్టుకోవాలి, అప్పుడే ఈశ్వరీయ సుఖ-శాంతులతో ఉండగలరు. స్వయం శాంతిగా ఉంటూ ఇతరులను శాంతిలోకి తీసుకురావడం మీ ముఖ్య పురుషార్థము, ఇందులో తప్పకుండా సహనశక్తి కావాలి. అంతా స్వయంపైనే ఆధారపడి ఉంది, అంతేకాని ఎవరైనా ఏదైనా అన్నట్లయితే అశాంతిలోకి రావడం కాదు. జ్ఞానం యొక్క మొదటి గుణము, సహనశక్తిని ధారణ చేయడం. చూడండి, అజ్ఞాన కాలంలో కూడా ఎవరైనా ఎంతగా తిట్టినా సరే, నాకెక్కడ తగిలాయి అని భావించండి అని అంటారు. ఎవరైతే తిట్టారో వారు స్వయం అశాంతిలోకి వస్తారు, వారి లెక్కాచారాన్ని వారు తయారుచేసుకున్నారు. కానీ మనం కూడా అశాంతిలోకి వచ్చి, ఏదైనా అన్నామంటే, మళ్ళీ మనకు వికర్మ తయారవుతుంది, కనుక వికర్మలు తయారుచేసుకునే కాంపిటీషన్ చేయకూడదు. మనమైతే వికర్మలను భస్మము చేసుకోవాలి, తయారుచేసుకోకూడదు, ఇటువంటి వికర్మలైతే జన్మ-జన్మాంతరాలుగా తయారుచేసుకుంటూ వచ్చారు మరియు దుఃఖమును పొందుతూ వచ్చారు. ఇప్పుడైతే జ్ఞానము లభిస్తూ ఉంది, ఈ పంచ వికారాలను జయించండి. వికారాలు కూడా చాలా విస్తారంగా ఉన్నాయి, చాలా సూక్ష్మ రీతిలో వస్తాయి. ఎప్పుడైనా ఈర్ష్య కలిగితే, వీరు ఇలా చేసినప్పుడు మరి నేనెందుకు చేయకూడదు అని ఆలోచిస్తారు. ఇది పెద్ద తప్పు. స్వయాన్ని పొరపాట్లు చేయనివారిగా తయారుచేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నట్లయితే నాలో ఎంతవరకు సహనశక్తి ఉంది అని ఇది కూడా నా పరీక్ష అని భావించండి. ఒకవేళ ఎవరైనా, నేను చాలా సహనం చేసాను అని అంటూ, ఒక్కసారైనా ఆవేశములోకి వచ్చినట్లయితే చివరికి ఫెయిల్ అయిపోయినట్లు. ఎవరైతే అన్నారో వారు ఎలాగో తమది తాము పాడుచేసుకున్నారు, కానీ మనమైతే తయారుచేసుకోవాలి, అంతేకానీ పాడుచేసుకోకూడదు. కావున మంచి పురుషార్థము చేసి జన్మ-జన్మాంతరాల కోసం మంచి ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి. కానీ ఎవరైతే వికారాలకు వశమై ఉన్నారో, వారిలో భూతము ప్రవేశించింది, భూతాల భాషయే ఆ విధంగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవాత్మలుగా ఉంటారో, వారి భాష దైవీ భాషగానే వెలువడుతుంది. కనుక స్వయాన్ని దైవీగా తయారుచేసుకోవాలి, ఆసురీగా చేసుకోకూడదు. అచ్ఛా – ఓం శాంతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *