Telugu Murli 24/08/20

24-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం

“మధురమైన పిల్లలూ – మేము 84 జన్మల చక్రమును పూర్తి చేసాము, ఇప్పుడు ఇంటికి వెళ్తాము, ఈ కర్మ భోగము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అని సదా ఇదే సంతోషంలో ఉండండి”

ప్రశ్న:- వికర్మాజీతులుగా అయ్యే పిల్లలు వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ విషయంలో చాలా అటెన్షన్ పెట్టాలి?

జవాబు:- అన్ని వికర్మలకు మూలం దేహాభిమానము, ఎప్పుడూ ఆ దేహాభిమానంలోకి రాకుండా ధ్యానముంచాలి. దీనికోసం పదే-పదే దేహీ-అభిమానీగా అయి తండ్రిని స్మృతి చేయాలి. మంచి మరియు చెడుల ఫలితము తప్పకుండా లభిస్తుంది, అంతిమంలో వివేకము తింటూ ఉంటుంది. కానీ ఈ జన్మలోని పాప భారాన్ని తేలిక చేసుకునేందుకు తండ్రికి అంతా సత్యమునే వినిపించాలి.

ఓంశాంతి. స్మృతిలో ఉండడమే అన్నిటికన్నా గొప్ప గమ్యము. చాలామందికి కేవలం వినాలనే ఆసక్తి ఉంటుంది. జ్ఞానాన్ని అర్థము చేసుకోవడం చాలా సహజం. 84 జన్మల చక్రమును అర్థము చేసుకోవాలి, స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. ఎక్కువగా ఏమీ లేదు. మనమందరం స్వదర్శన చక్రధారులమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కృష్ణుడిని చూపించినట్లుగా స్వదర్శన చక్రముతో ఎవ్వరి తలనూ నరకరు. ఇప్పుడు ఈ లక్ష్మీ-నారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు. వారికి స్వదర్శన చక్రమేమైనా ఉందా? మరి కృష్ణునికి చక్రము ఎందుకు చూపిస్తారు? ఒక మ్యాగజైన్ ఉంది, అందులో కృష్ణునివి ఇటువంటి చిత్రాలు చాలా చూపిస్తారు. తండ్రి అయితే వచ్చి మీకు రాజయోగమును నేర్పిస్తున్నారే కానీ చక్రము ద్వారా అసురులను చంపరు. ఆసురీ స్వభావం ఉన్నవారిని అసురులు అని అంటారు. మనుష్యులైతే మనుష్యులే కదా. అంతేకానీ కూర్చుని స్వదర్శన చక్రముతో అందరినీ చంపరు. భక్తి మార్గములో ఏవేవో చిత్రాలను కూర్చుని తయారుచేశారు. రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు ఈ సృష్టి చక్రాన్ని మరియు మొత్తం డ్రామాను తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ పాత్రధారులు. ఆ హద్దులోని పాత్రధారులకు ఆ డ్రామా గురించి తెలుసు. ఇది అనంతమైన డ్రామా. దీనిని విస్తారంగా అర్థం చేసుకోలేరు. అది రెండు గంటల డ్రామా. పాత్రను విస్తారంగా తెలుసుకుంటారు. ఇక్కడైతే 84 జన్మల గురించి తెలుసుకోవడం జరుగుతుంది.

నేను బ్రహ్మా రథములో ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారు. బ్రహ్మా యొక్క 84 జన్మల కథ కూడా ఉండాలి. ఈ విషయాలు మనుష్యుల బుద్ధిలోకి రావు. 84 లక్షల జన్మలా లేక 84 జన్మలా అనేది కూడా అర్థం చేసుకోరు. మీ 84 జన్మల కథ వినిపిస్తాను అని తండ్రి చెప్తున్నారు. 84 లక్షల జన్మలైతే వాటి గురంచి వినిపించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మేము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగాము అని ఈ 84 జన్మల కథను మీరైతే సెకండులో తెలుసుకుంటారు, 84 లక్షలైతే సెకండులో అర్థము చేసుకోలేరు. 84 లక్షల జన్మలు అసలు లేవు. మా 84 జన్మల చక్రము పూర్తయ్యింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాము అని పిల్లలైన మీకు కూడా సంతోషముండాలి. ఈ కర్మభోగము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వికర్మలు భస్మమై కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ యుక్తిని తెలియజేసారు. అంతేకాక ఈ జన్మలో ఏవైతే వికర్మలు చేసారో, వాటిని వ్రాసి ఇచ్చినట్లయితే భారం తేలికవుతుంది అని అర్థం చేయిస్తున్నారు. జన్మ-జన్మాంతరాల వికర్మలైతే ఎవ్వరూ వ్రాయలేరు. వికర్మలు జరుగుతూనే వచ్చాయి. రావణరాజ్యము ప్రారంభమైనప్పటి నుండి కర్మలు వికర్మలుగా అవుతున్నాయి. సత్యయుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. భగవానువాచ – మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నాను. లక్ష్మీనారాయణుల నుండి వికర్మాజీత్ శకము ప్రారంభమవుతుంది. ఇది మెట్ల చిత్రములో చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. మేమే సూర్యవంశీయులము, చంద్రవంశీయులము అన్న రహస్యాన్ని కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విరాట రూప చిత్రాలను కూడా చాలా తయారుచేస్తారు కానీ అర్థము ఏ మాత్రమూ తెలియదు. తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ బ్రహ్మా పైన వీరికి నేర్పించిన వారు కూడా ఎవరో ఉంటారు కదా. ఒకవేళ వీరికి ఎవరైనా గురువు నేర్పించి ఉంటే, ఆ గురువుకు కేవలం ఒక్క శిష్యుడు మాత్రమే ఉండరు. పిల్లలూ, మీరు పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా అవ్వాల్సిందే అని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఈ చక్రములో అనేకసార్లు తిరిగారు. తిరుగుతూనే ఉంటారు. మీరు ఆల్ రౌండ్ పాత్రధారులు. ఆది నుండి అంతిమం వరకు ఇంకెవ్వరి పాత్రా ఉండదు. తండ్రి మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు ఫలానా-ఫలానా సమయంలో వస్తారని కూడా మీకు తెలుసు. మీదైతే ఆల్ రౌండ్ పాత్ర. క్రిస్టియన్లు సత్యయుగంలో ఉండేవారని అనరు. వారు ద్వాపరయుగము మధ్యలో వస్తారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఇది మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు కూడా. ఇంకెవ్వరికీ సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. రచయిత గురించే తెలియకపోతే రచన గురించి ఎలా తెలుస్తుంది. సత్యమైన విషయాలను ముద్రించి విమానము నుండి అన్నిచోట్లా వేయాలని తండ్రి అర్థం చేయించారు. అటువంటి పాయింట్లు లేక టాపిక్స్ కూర్చుని వ్రాయాలి. పనేమీ లేదు అని పిల్లలంటారు. ఈ సేవ అయితే చాలా ఉందని తండ్రి అంటారు. ఇక్కడ ఏకాంతంలో కూర్చుని ఈ పని చేయండి. పెద్ద-పెద్ద సంస్థలు, గీతా పాఠశాలలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ మేల్కొల్పాలి. అందరికీ సందేశమివ్వాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. వివేకవంతులైనవారు వెంటనే అర్థము చేసుకుంటారు. తప్పకుండా సంగమయుగములోనే కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. సత్యయుగంలో పురుషోత్తమ మనుష్యులుంటారు. ఇక్కడ ఆసురీ స్వభావము గల పతిత మనుష్యులుంటారు. కుంభమేళా మొదలైన వాటికి చాలా మంది మనుష్యులు స్నానాలు చేసేందుకు వెళ్తారని బాబా ఈ విషయం కూడా అర్థం చేయించారు. ఎందుకు స్నానం చేయడానికి వెళ్తారు? పావనంగా అవ్వాలని కోరుకుంటారు. మనుష్యులు స్నానము చేసేందుకు ఎక్కడెక్కడికి వెళ్తారో, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి. ఈ నీరు పతిత-పావని ఏమీ కాదని మనుష్యులకు అర్థం చేయించాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా పాఠశాలలకు వెళ్ళి కరపత్రాలు పంచాలి. పిల్లలు సేవ కావాలని అడుగుతారు. గీతా భగవంతుడు పరమపిత పరమాత్మ శివుడు, శ్రీకృష్ణుడు కాదు అని కూర్చుని వ్రాయండి. తర్వాత శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర యొక్క మహిమను వ్రాయండి. శివబాబా జీవితచరిత్రను వ్రాయండి. అప్పుడు వారంతట వారే నిర్ణయించుకుంటారు. పతిత-పావనుడు ఎవరు అనే పాయింట్లు కూడా వ్రాయాలి. తర్వాత, శివుడు మరియు శంకరుల తేడాను కూడా చూపించాలి. శివుడు వేరు, శంకరుడు వేరు. కల్పమనగా 5 వేల సంవత్సరాలు అని కూడా తండ్రి అర్థం చేయించారు. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు, 84 లక్షలు కాదు. ఇటువంటి అతి ముఖ్యమైన విషయాలను క్లుప్తంగా వ్రాయాలి. వాటిని విమానము నుండి కూడా క్రిందికి వేయవచ్చు, అర్థం చేయించవచ్చు కూడా. ఇది చక్రము వలె ఉంది, ఇందులో ఫలానా-ఫలానా ధర్మాలు ఫలానా-ఫలానా సమయంలో స్థాపనవుతాయని స్పష్టంగా ఉంది కావున ఈ సృష్టిచక్ర చిత్రము కూడా ఉండాలి. కనుక పూర్తి జ్ఞానమంతా వచ్చే విధంగా మరియు సహజంగా సేవ జరిగే విధంగా ముఖ్యమైన 12 చిత్రాల క్యాలెండర్లను కూడా ముద్రించవచ్చు. ఈ చిత్రాలు చాలా అవసరము. ఏ చిత్రాలు తయారుచేయాలి, ఏయే పాయింట్లు వ్రాయాలి అన్నది కూర్చుని రాయండి.

మీరు గుప్తవేషంలో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మీరు గుప్త యోధులు. మీ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా కూడా గుప్తము, జ్ఞానము కూడా గుప్తము. దీని శాస్త్రం మొదలైనదేమీ తయారవ్వదు, ఇతర ధర్మస్థాపకుల బైబిల్ మొదలైనవి ముద్రించబడతాయి, వాటిని చదువుతూ వస్తారు. ప్రతి ధర్మం వారిది ముద్రించబడుతుంది. మీది మళ్ళీ భక్తి మార్గంలో ముద్రించబడుతుంది. ఇప్పుడు ముద్రించబడదు ఎందుకంటే ఇప్పుడైతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు మీరు బుద్ధిలో కేవలం స్మృతి చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా జ్ఞానముంది. వారు శాస్త్రాలు మొదలైనవేవీ చదవరు. వారు నాలెడ్జ్ ఫుల్. నాలెడ్జ్ ఫుల్ అంటే అందరి మనసులు తెలిసినవాడు అని అర్థం అని మనుష్యులు భావిస్తారు. భగవంతుడు చూస్తారు కావుననే కర్మలకు ఫలమునిస్తారు అని అనుకుంటారు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో ఎవరైతే వికర్మలు చేస్తారో, వారికి శిక్షలు పడుతూ ఉంటాయి. మంచి లేక చెడు కర్మల ఫలితము లభిస్తుంది. దాని గురించి ఎక్కడా రాసి లేదు. కర్మల ఫలం వేరొక జన్మలో తప్పకుండా లభిస్తుందని మనుష్యులు భావిస్తారు. మేము ఈ-ఈ పాపాలు చేశామని మొత్తం గుర్తుకొచ్చి అంతిమ క్షణములో వివేకము చాలా తింటుంది. ఎటువంటి కర్మ చేస్తే అటువంటి జన్మ లభిస్తుంది. మీరిప్పుడు వికర్మాజీతులుగా అవుతున్నారు కనుక అటువంటి వికర్మ ఏదీ చేయకూడదు. దేహాభిమానులుగా అవ్వడం అన్నిటికన్నా పెద్ద వికర్మ. దేహీ-అభిమానిగా అయి తండ్రిని స్మృతి చేయండి అని బాబా పదే-పదే చెప్తున్నారు. మీరు పవిత్రంగా అవ్వవలసిందే. అన్నిటికన్నా పెద్ద పాపము కామ ఖడ్గాన్ని నడిపించడం. ఇదే ఆదిమధ్యాంతాలు దుఃఖమునిచ్చేటటువంటిది, అందుకే సన్యాసులు కూడా ఈ సుఖము కాకిరెట్ట సమానమైనది అని అంటారు. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. ఇక్కడ దుఃఖమే దుఃఖము, అందుకే సన్యాసులకు వైరాగ్యము కలుగుతుంది. కానీ వారు అడవులకు వెళ్ళిపోతారు. వారిది హద్దు వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. ఈ ప్రపంచమే ఛీ-ఛీ గా ఉంది. బాబా, మీరు వచ్చి మా దుఃఖాలను హరించి సుఖాన్నివ్వండి అని అందరూ అంటారు. తండ్రియే దుఃఖహర్త, సుఖకర్త. కొత్త ప్రపంచంలో ఈ దేవతల రాజ్యం ఉండేది, అక్కడ ఏ రకమైన దుఃఖమూ ఉండేది కాదు అని పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే, వారు స్వర్గస్థులయ్యారని మనుష్యులంటారు కానీ మేము నరకములో ఉన్నాము, మేము మరణించినప్పుడు స్వర్గములోకి వెళ్తాము అని భావించరు. మరి ఇంతకీ ఆ మరణించినవారు కూడా స్వర్గానికి వెళ్ళారా లేదా ఇక్కడ నరకములోకే వచ్చారా అన్నది ఏమీ అర్థము చేసుకోరు. పిల్లలైన మీరు ముగ్గురు తండ్రుల రహస్యాన్ని కూడా అందరికీ అర్థం చేయించవచ్చు. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి, ఈ ఇద్దరు తండ్రుల గురించైతే అందరికీ తెలుసు, మరియు ఈ అలౌకిక ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ సంగమయుగములోనే ఉంటారు. బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఆ బ్రాహ్మణులేమీ బ్రహ్మా యొక్క ముఖవంశావళి కాదు. బ్రహ్మా ఉండేవారు అని తెలుసు, అందుకే బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు, వారు ఏ బ్రాహ్మణులు అన్నది వారికి తెలియదు. మీరు పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులు. వారు కలియుగీ బ్రాహ్మణులు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతూ ఉంది కనుక పిల్లలు పాయింట్లన్నీ ధారణ చేయాలి, ఆ తర్వాత సేవ చేయాలి. పూజలు చేసేందుకు మరియు శ్రాద్ధం పెట్టేందుకు బ్రాహ్మణులు వస్తారు. మిమ్మల్ని సత్యమైన బ్రాహ్మణులుగా తయారు చేయగలము అని వారితో కూడా మీరు చిట్ చాట్ చేయవచ్చు. ఇప్పుడు భాద్రపద మాసము వస్తుంది, అందరూ పితృదేవతలకు తినిపిస్తారు. అది కూడా యుక్తిగా మాట్లాడాలి, లేకపోతే బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళి అంతా వదిలేశారని అంటారు. వారికి కోపము వచ్చే విధంగా ఏమీ చేయకూడదు. యుక్తిగా మీరు జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. ఆ బ్రాహ్మణులు తప్పకుండా వస్తారు, అప్పుడే మీరు జ్ఞానాన్నివ్వగలరు కదా. ఈ మాసములో మీరు బ్రాహ్మణులకు చాలా సేవ చేయవచ్చు. బ్రాహ్మణులైన మీరు ప్రజాపిత బ్రహ్మా సంతానము. బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు స్థాపించారో చెప్పండి అని అడగండి. మీరు ఇంట్లో కూర్చునే వారి కళ్యాణము కూడా చేయవచ్చు. అమరనాథ యాత్రకు వెళ్ళినప్పుడు కేవలం రాసినదాన్ని చూసి అంతగా అర్థము చేసుకోలేరు. అక్కడ కూర్చుని అర్థం చేయించాలి – మేము మీకు సత్యమైన అమరనాథ కథను వినిపిస్తాము, అమరనాథుడని ఒక్కరిని మాత్రమే అంటారు, అమరనాథుడంటే అమరపురిని స్థాపించేవారు అని అర్థం, అది సత్యయుగము. ఇటువంటి సేవ చేయవలసి ఉంటుంది. అక్కడకి నడుచుకుని వెళ్ళవలసి ఉంటుంది. మంచి-మంచి, గొప్ప-గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి అర్థం చేయించాలి. సన్యాసులకు కూడా మీరు జ్ఞానాన్నివ్వవచ్చు. మీరు సృష్టి అంతటికీ కళ్యాణకారులు. శ్రీమతంపై మేము విశ్వానికి కళ్యాణము చేస్తున్నాము అన్న నషా బుద్ధిలో ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏకాంతంలో లేక తీరిక లభించినప్పుడు జ్ఞానము యొక్క మంచి-మంచి పాయింట్లపై విచార సాగర మథనము చేసి వ్రాయాలి. అందరికీ సందేశాన్ని అందించే మరియు అందరి కళ్యాణమును చేసే యుక్తిని రచించాలి.

2. వికర్మల నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానీగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మ చేయకూడదు, ఈ జన్మలో చేసినటువంటి వికర్మలను బాప్ దాదాకు సత్యాతి-సత్యంగా వినిపించాలి.

వరదానము:- సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత, విజయీ భవ

ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో, వారే సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అంటే సంపన్నత. తండ్రి సంపన్నంగా ఉంటారు కనుక వారి మహిమలో సాగరము అనే పదాన్ని వాడుతారు, అదే విధంగా పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగరులుగా అనగా సంపన్నంగా అయినట్లయితే సదా సంతోషంలో నాట్యము చేస్తూ ఉంటారు. సంతోషము తప్ప ఇంకేదీ లోపలకు రాలేదు. స్వయం సంపన్నంగా అయిన కారణంగా ఎవ్వరితోనూ విసిగిపోరు. ఏ రకమైన చిక్కులైనా లేదా విఘ్నాలైనా ఒక ఆటగా అనుభవమవుతాయి, సమస్య మనోరంజనం యొక్క సాధనంగా అయిపోతుంది. నిశ్చయబుద్ధికలవారిగా ఉన్న కారణంగా సదా హర్షితంగా మరియు విజయులుగా ఉంటారు.

స్లోగన్:- సున్నితమైన పరిస్థితులకు భయపడకండి, వాటి ద్వారా పాఠము నేర్చుకొని స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *