Telugu Murli 28/08/2020

28-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా” మధువనం


“మధురమైనపిల్లలూ- ఎంత సమయము లభిస్తే అంత సమయము ఏకాంతంలోకి వెళ్ళి స్మృతియాత్ర చేయండి, మీరు గమ్యాన్ని చేరుకున్నప్పుడు ఈ యాత్ర పూర్తవుతుంది”

ప్రశ్న:- సంగమయుగంలో తండ్రి తన పిల్లలలో నింపే ఏ గుణము మొత్తం అర్థకల్పము వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది?

జవాబు:- ఏ విధంగా నేను అతి మధురంగా ఉన్నానో, అదే విధంగా పిల్లలను కూడా మధురంగా తయారుచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. దేవతలు చాలా మధురంగా ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో, ఎవరిలోనైతే ఎటువంటి ఆసురీ ఆలోచనలుండవో, వారే మధురమైనవారు. వారికే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. తర్వాత వారికే పూజ జరుగుతుంది.

ఓంశాంతి. ఆత్మ ఈ శరీరానికి యజమాని అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇది మొదట అర్థము చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకిప్పుడు జ్ఞానం లభించింది. నేను ఆత్మను అని మొట్టమొదట అర్థము చేసుకోవాలి. శరీరము ద్వారా ఆత్మ పని చేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు మనుష్యులెవ్వరికీ రావు, ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నారు. ఇక్కడ, నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న ఆలోచనతో కూర్చోబెట్టడం జరుగుతుంది. నేను ఆత్మను పరమపిత పరమాత్మ సంతానాన్ని. ఈ స్మృతినే క్షణ-క్షణము మర్చిపోతూ ఉంటారు. మొదట ఇది బాగా గుర్తుంచుకోవాలి. యాత్రకు వెళ్ళినప్పుడు నడుస్తూ ఉండండి అని చెప్తారు. మీరు కూడా స్మృతి యాత్రలో నడుస్తూనే ఉండాలి, అంటే స్మృతి చేయాలి. స్మృతి చేయడం లేదు అంటే యాత్ర చేయడం లేదు. దేహాభిమానము వచ్చేస్తుంది. దేహాభిమానము వలన ఏదో ఒక వికర్మ జరుగుతుంది. అలాగని మనుష్యులు సదా వికర్మలే చేస్తారని కాదు. అయినా సంపాదన అయితే ఆగిపోతుంది కదా, కనుక వీలైనంత వరకు స్మృతియాత్రలో ఢీలా అవ్వకూడదు. ఏకాంతంలో కూర్చుని మీలో మీరే విచార సాగర మథనము చేసి పాయింట్లు తీస్తూ ఉండాలి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను, మధురమైన వస్తువు గుర్తొస్తూ ఉంటుంది కదా.

ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ ఒకరినొకరు నష్టపరుచుకుంటున్నారని పిల్లలకు అర్థము చేయించారు. బాబా కేవలం టీచర్ల మహిమను చేస్తారు, అందులో కొంతమంది టీచర్లు చెడుగా ఉంటారు, అయినా టీచర్ అనగా నేర్పించేవారు, నడవడికను నేర్పించేవారు. ధార్మిక బుద్ధికలవారు మంచి స్వభావము కలిగి ఉంటారు, వారి నడవడిక కూడా బాగుంటుంది. తండ్రి ఒకవేళ మద్యం మొదలైనవి తాగినట్లయితే పిల్లలకు కూడా అదే సాంగత్యం అంటుకుంటుంది. దీనిని చెడు సాంగత్యము అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. తప్పకుండా రామరాజ్యం ఉండేది, కానీ అది ఎలా ఉండేది, ఎలా స్థాపించబడింది అనే ఈ అద్భుతమైన, మధురమైన విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ అని అంటారు కదా. తండ్రి స్మృతిలోనే ఉంటూ మీరు పవిత్రంగా అవుతారు మరియు పవిత్రంగా తయారుచేస్తారు. తండ్రి కొత్త సృష్టిలోకి రారు. సృష్టిలో మనుష్యులు, జంతువులు, పొలాలు-పంటలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుష్యులకు అన్నీ కావాలి కదా. శాస్త్రాలలో ఉన్న ప్రళయం యొక్క సమాచారం కూడా తప్పు. ప్రళయము అసలు జరగదు. ఈ సృష్టిచక్రము తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంతిమం వరకు అంతా స్మృతిలో ఉంచుకోవాలి. మనుష్యులకైతే అనేక రకాలైన చిత్రాలు గుర్తుకొస్తాయి. మేళాలు, ఉత్సవాలు గుర్తుకొస్తాయి. అవన్నీ హద్దుకు సంబంధించినవి, మీది అనంతమైన స్మృతి, అనంతమైన సంతోషం, అనంతమైన ధనము. అనంతమైన తండ్రి కదా. హద్దు తండ్రి నుండి అన్నీ హద్దుకు సంబంధించినవి లభిస్తాయి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము లభిస్తుంది. ధనము ద్వారానే సుఖము లభిస్తుంది. అక్కడ అపారమైన ధనముంటుంది. అక్కడ అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. మేము సతోప్రధానంగా ఉండేవారమని, మళ్ళీ తయారవ్వాలని మీ బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకిప్పుడే తెలుసు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు – స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ గా ఉంటారు కదా. బాబా కన్నా మధురంగా అయ్యేవారు ఉన్నత పదవిని పొందుతారు. అనేకుల కళ్యాణము చేసేవారు స్వీటెస్ట్. తండ్రి కూడా స్వీటెస్ట్ కదా, అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు. తేనెను లేదా పంచదారను మాత్రమే స్వీటెస్ట్ అని అనరు. ఇది మనుష్యుల నడవడిక గురించి చెప్పడం జరుగుతుంది. వీరు స్వీట్ చైల్డ్ (మధురమైన బిడ్డ) అని అంటారు కదా. సత్యయుగములో ఆసురీ విషయాలేవీ ఉండవు. అంత ఉన్నతమైన పదవిని పొందినవారు తప్పకుండా ఇక్కడ పురుషార్థము చేసి ఉంటారు.

మీకిప్పుడు కొత్త ప్రపంచము గురించి తెలుసు. మీ కోసమైతే రేపే కొత్త ప్రపంచమైన సుఖధామము ఉంటుంది. శాంతి ఎప్పుడు ఉండేదో మనుష్యులకు అసలు తెలియదు. విశ్వములో శాంతి ఏర్పడాలి అని అంటారు. విశ్వంలో శాంతి ఒకప్పుడు ఉండేది, అది ఇప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఇప్పుడు అందరికీ ఎలా అర్థము చేయించాలి? మనుష్యులకు ఆసక్తి కలిగించే ఇటువంటి పాయింట్లు తీయాలి. అశాంతి చాలా ఉంది కావున విశ్వంలో శాంతి ఏర్పడాలని ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని ముందుగా చూపించాలి. వీరి రాజ్యమున్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది, దానినే స్వర్గము, దైవీ ప్రపంచమని అంటారు. అక్కడ విశ్వములో శాంతి ఉండేది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితపు విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది ముఖ్యమైన విషయము. విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది అని ఆత్మలందరూ కలిసి అంటారు. అక్కడ ఆత్మలందరూ పిలుస్తూ ఉన్నారు, ఇక్కడు మీరు విశ్వములో శాంతి స్థాపన చేసే పురుషార్థము చేస్తున్నారు. విశ్వంలో శాంతి కోరుకునేవారికి భారత్ లోనే శాంతి ఉండేదని మీరు చెప్పండి. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. నరకం (కలియుగం)లో అశాంతి ఉంటుంది ఎందుకంటే అనేక ధర్మాలున్నాయి, ఇది మాయా రాజ్యము. భక్తి ఆర్భాటము కూడా ఉంది. రోజు-రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. మనుష్యులు కూడా మేళాలు, ఉత్సవాలు మొదలైనవాటికి వెళ్తారు, వాటిలో తప్పకుండా ఎంతో కొంత సత్యము ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరని మీకిప్పుడు తెలుసు. పావనంగా అయ్యే మార్గాన్ని మనుష్యులెవ్వరూ తెలియజేయలేరు. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచము ఒక్కటే, కేవలం కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం అని అంటారు. కొత్త ప్రపంచములో కొత్త భారత్, కొత్త ఢిల్లీ ఉంటుంది. కొత్తదిగా అవ్వాల్సిందే, అందులో మళ్ళీ కొత్త రాజ్యము ఏర్పడుతుంది. ఇక్కడ పాత ప్రపంచంలో పాత రాజ్యముంటుంది. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము అని దేనినంటారో కూడా మీకు తెలుసు. భక్తి విస్తారం ఎంతో ఎక్కువగా ఉంది, దీనిని అజ్ఞానం అని అంటారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. రామ-రామ అనండి లేదా ఇంకేదో చేయండి అని తండ్రి మీకు ఆ విధంగా చెప్పరు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా పునరావృతమౌతాయో పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ (విద్య) ను మీరు చదువుతున్నారు. దీని పేరే ఆత్మిక ఎడ్యుకేషన్. ఆధ్యాత్మిక జ్ఞానము. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు ఆధ్యాత్మిక జ్ఞానసాగరుడైన తండ్రి. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానమని అనడం జరుగుతుంది.

పరమపిత పరమాత్మ బిందువు, వారు మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలమైన మేము చదువుకుంటున్నాము. ఇది మర్చిపోకూడదు. ఆత్మలైన మాకు లభించే జ్ఞానాన్ని, మళ్ళీ ఇతర ఆత్మలకు మేము ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉన్నప్పుడే ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా అపరిపక్వంగా ఉన్నారు, వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. దేహీ-అభిమానిగా అయ్యే అభ్యాసము చేయాలి. ఆత్మనైన నేను వీరితో వ్యాపారము చేస్తున్నాను. ఆత్మనైన నేను వ్యాపారం చేస్తున్నాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలోనే లాభముంది. మేము యాత్రలో ఉన్నామని ఆత్మకు జ్ఞానముంది. కర్మలైతే చేయాల్సిందే. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించాలి. వ్యాపార-వ్యవహారాలు కూడా చేయాలి. వ్యాపారాలు మొదలైనవాటిలో నేను ఆత్మను అని గుర్తుంచుకోవాలి, ఇది చాలా కష్టము. ఎప్పుడూ ఏ విధమైన వ్యతిరేక కర్మ చేయకూడదు అని తండ్రి చెప్తున్నారు. అన్నిటికన్నా పెద్ద పాపము వికారాలకు సంబంధించినది. అదే చాలా విసిగించేటటువంటిది. పిల్లలైన మీరిప్పుడు పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేస్తారు. దాని స్మృతిచిహ్నమే ఈ రక్షా బంధనము. ఇంతకు ముందు పైసా విలువంత రాఖీ లభించేది. బ్రాహ్మణులు వెళ్ళి రాఖీ కట్టేవారు. ఈ రోజుల్లోనైతే రాఖీ కూడా ఎంత ఫ్యాషనబుల్ గా తయారుచేస్తున్నారు. వాస్తవానికి అది ఇప్పటి విషయము. మేమెప్పుడూ వికారాలలోకి వెళ్ళము, మీ నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వం తీసుకుంటాము అని మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. 63 జన్మలైతే విషయవైతరణీ నదిలో మునకలు వేశారు, ఇప్పుడు మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకువెళ్తాను అని తండ్రి చెప్తారు. సాగరమంటూ ఏదీ లేదు. పోలిక కోసం చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని శివాలయములోకి తీసుకువెళ్తాను. అక్కడ అపారమైన సుఖముంటుంది. ఇప్పుడిది అంతిమ జన్మ, హే ఆత్మలూ, పవిత్రంగా అవ్వండి. తండ్రి చెప్పేది మీరు వినరా. ఈశ్వరుడైన మీ తండ్రి చెప్తున్నారు – మధురమైన పిల్లలూ, వికారాలలోకి వెళ్ళకండి. జన్మ-జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి, అవి నన్ను స్మృతి చేస్తేనే భస్మమవుతాయి. కల్పక్రితము కూడా మీకు శిక్షణనిచ్చాను. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూనే ఉంటాము అని మీరు ఈ గ్యారంటీ ఇచ్చినప్పుడు తండ్రి గ్యారంటీ ఇస్తారు. శరీర భానం లేనంతగా స్మృతి చేస్తూ ఉండండి. సన్యాసులలో కూడా కొంతమంది చాలా చురుకైన పక్కా బ్రహ్మ జ్ఞానులు ఉంటారు, వారు కూడా అలా కూర్చుని-కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ మీకైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు, పావనంగా అయి వెళ్ళాలి. వారైతే తమ మతంపై నడుస్తారు. అలాగని వారు శరీరాన్ని వదిలి ముక్తి-జీవన్ముక్తులకేమీ వెళ్ళరు. అలా వెళ్ళరు. మళ్ళీ ఇక్కడికే వస్తారు కానీ వారు నిర్వాణం చెందారని వారి శిష్యులు భావిస్తారు. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు, నియమమే లేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వృక్షము తప్పకుండా వృద్ధి చెందాల్సి ఉంది.

మీరిప్పుడు సంగమయుగంలో కూర్చున్నారు, మిగిలిన మనుష్యులందరూ కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సంప్రదాయస్థులుగా అవుతున్నారు. మీ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు వస్తూ ఉంటారు. అక్కడ దేవీ-దేవతల వంశవృక్షం ఉంటుంది కదా. ఇక్కడ బదిలీ అయ్యి ఇతర ధర్మాలలోకి మారిపోయారు, మళ్ళీ వాటి నుండి బయటకు వచ్చేస్తారు. లేకపోతే అక్కడ స్థానాన్ని నింపేవారెవరు. వారు తప్పకుండా తమ స్థానాన్ని నింపేందుకు మళ్ళీ వచ్చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా మంచి-మంచి వారు కూడా వస్తారు, ఇతర ధర్మాలలోకి మారిపోతారు, మళ్ళీ తమ స్థానాలకు వచ్చేస్తారు. మీ వద్దకు ముసల్మానులు మొదలైనవారు కూడా వస్తారు కదా. చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది, ఇక్కడికి ఇతర ధర్మాల వారు ఎలా వెళ్తున్నారు అని వెంటనే చెక్ చేస్తారు. అత్యవసర పరిస్థితులలోనైతే చాలామందిని పట్టుకుంటారు, మళ్ళీ ధనము లభించగానే వదిలేస్తారు కూడా. కల్పక్రితము ఏదైతే జరిగిందో, అది మీరిప్పుడు చూస్తున్నారు. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా, ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులము. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు. ఎవరైనా పేదవారిని ధనవంతులుగా చేయడమనేది ఆత్మిక సేవ. తండ్రి కళ్యాణము చేస్తున్నారు కనుక పిల్లలు కూడా సహాయం చేయాలి. ఎవరైతే అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో, వారు చాలా ఉన్నతమైన స్థానాన్ని చేరుకోగలరు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలే కానీ చింతించకూడదు, ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది. పురుషార్థము చాలా తీవ్రంగా చేయించడం జరుగుతుంది, తర్వాత ఏ ఫలము అయితే వెలువడుతుందో, అది కల్పక్రితము వలె లభించింది అని భావించడం జరుగుతుంది. పిల్లలూ, చింతించకండి, సేవలో శ్రమ చేయండి అని తండ్రి పిల్లలకు చెప్తున్నారు. తయారవ్వకపోతే తండ్రి ఏమి చేస్తారు! ఈ కులానికి చెందినవారు కాకపోతే మీరు ఎంతగా తల కొట్టుకున్నా, కొందరు మీ బుర్రను కొద్దిగా తింటారు, కొందరు ఎక్కువగా తింటారు. దుఃఖము బాగా కలిగినప్పుడు మళ్ళీ వస్తాను అని బాబా చెప్పారు. మీరు చేసేదేదీ వ్యర్థమవ్వదు. సత్యము చెప్పడం మీ పని. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయని శివబాబా చెప్తున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నారని చాలామంది చెప్తారు. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉండేవారు అని భావిస్తారు. అయితే ఆ భగవంతుడు ఎవరు అన్నదానిలో తికమక పడిపోయారు. కృష్ణుడు అయితే అవ్వరు. కృష్ణుడు అవే రూపురేఖలతో మళ్ళీ సత్యయుగములోనే ఉంటారు. ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు భగవంతుడు పాతదానిని కొత్తదిగా ఎలా తయారుచేస్తారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. చివరకు మీ పేరు బయటకొస్తుంది. స్థాపన జరుగుతుంది, తర్వాత వీరు రాజ్యం చేస్తారు, వినాశనము కూడా జరుగుతుంది. ఒకవైపు కొత్త ప్రపంచము, ఒక వైపు పాత ప్రపంచము – ఈ చిత్రము చాలా బాగుంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము…… అని కూడా అంటారు కానీ ఏమాత్రం అర్థము చేసుకోరు. ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రము. ఉన్నతాతి ఉన్నతమైనవారు శివబాబా. శివబాబా బ్రహ్మా ద్వారా మనకు స్మృతియాత్ర నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చేయండి, యోగమనే పదము కష్టమనిపిస్తుంది. స్మృతి అనే పదము చాలా సహజమైనది. బాబా అనే పదము చాలా ప్రియమైనది. ఎవరి ద్వారానైతే విశ్వ రాజ్యాధికారం లభిస్తుందో, ఆ తండ్రిని ఆత్మలైన మేము స్మృతి చేయలేకపోతున్నాము అని స్వయంగా మీకే సిగ్గనిపిస్తుంది. మీ అంతట మీకే సిగ్గనిపిస్తుంది. మీరు బుద్ధిహీనులు, తండ్రిని స్మృతి చేయలేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు, వికర్మలు ఎలా వినాశమౌతాయి అని తండ్రి కూడా అంటారు. మీరు ఆత్మలు, నేను మీ అవినాశీ పరమపిత పరమాత్మను. మేము పావనంగా అయి సుఖధామానికి వెళ్ళాలి అని మీరనుకుంటే శ్రీమతంపై నడవండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమౌతాయి! అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అన్ని రకాలుగా పురుషార్థం చేయాలి, చింతించకూడదు, ఎందుకంటే స్వయంగా తండ్రి మన బాధ్యతను తీసుకున్నారు. మనదేదీ వ్యర్థం కాదు.

2. తండ్రి సమానంగా చాలా-చాలా మధురంగా అవ్వాలి. అనేకుల కళ్యాణము చేయాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ నేను ఆత్మను అని అభ్యాసము చేయాలి.

వరదానము:- ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకునే సర్వ ఖజానాలతో సంపన్నమైన మరియు తృప్త ఆత్మా భవ

ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉంటూ ప్రతి అడుగును వేస్తారో, వారు అడుగడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకుంటారు. ఈ సంగమయుగంలోనే పదమాల సంపాదన యొక్క గనులు లభిస్తాయి. సంగమయుగము జమ చేసుకునే యుగము. ఇప్పుడు ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోగలరు. ఒక్క అడుగు అంటే ఒక్క సెకండు కూడా జమ అవ్వకుండా ఉండకూడదు, అంటే వ్యర్థమవ్వకూడదు. భాండాగారము సదా నిండుగా ఉండాలి. అప్రాప్తి అనే వస్తువేదీ లేదు….. అనేటటువంటి సంస్కారముండాలి. ఇప్పుడు అటువంటి తృప్తి చెందిన మరియు సంపన్న ఆత్మగా అయినట్లయితే, భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానులుగా అవుతారు.

స్లోగన్:- ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు బదులుగా జ్ఞానస్వరూప సీట్ పై సెట్ అయి ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *